గణేశ్ నవరాత్రి వేడుకలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యారు. భారీ ఊరేగింపులతో భాగ్యనగరం భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా మారింది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు ఆలస్యంగా సాగుతున్నాయి.
బడా గణేశుడి కోసం రంగంలోకి అధికారులు
ఇంకా ప్రారంభం కాని ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ఆలస్యం!
గత రాత్రి భారీ క్రేన్‌లో సాంకేతికత లోపం
ఈ ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర
ఇంకా ప్రారంభం కాని శోభాయాత్ర
బడా గణేశుడి శోభాయాత్ర, నిమజ్జనం వీక్షించేందుకు భారీగా చేరుకుంటున్న జనం
భారీగా జనం వస్తే నిమజ్జనం ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం
సాయంత్రం కల్లా నిమజ్జనం జరిగే చాన్స్
నిర్వాహకులతో మాట్లాడిన అధికారులు
ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్లాలని సూచన
వీలైనంత త్వరగా శోభాయాత్ర పూర్తి చేసేలా ప్రణాళిక
1గం. కల్లా క్రేన్ నెంబర్ 5 వద్దకు చేరుకునేలా ప్లాన్
అక్కడ గంటసేపు వెల్డింగ్ పనులు కొనసాగే చాన్స్
ఆ తర్వాత కొనసాగనున్న నిమజ్జన ప్రక్రియ
అన్ని సజావుగా సాగితే.. మధ్యాహ్నాం 2 కల్లా పూర్తి కానున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
మరింత ఆలస్యంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
- ఉదయం 6గం.కే ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర
- బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక లోపం
- అనుకున్న సమయానికంటే ఇప్పటికే రెండు గంటల ఆలస్యం
- శోభాయాత్ర ప్రారంభానికి మరో గంట పట్టే అవకాశం
- ఇప్పటికే భారీగా చేరుకున్న భక్తులు
- ఖైరతాబాద్ పురవీధుల్లో భక్తులు పెరిగితే.. శోభాయాత్ర మరింత ఆలస్యం అయ్యే అవకాశం
మహాగణపతి శోభాయాత్ర.. పోలీసుల హెచ్చరిక
- డ్రోన్ల వినియోగం పై పోలీసుల ఆంక్షలు
- ఖైరతాబాద్ గణనాథుడిని శోభాయాత్ర, నిమజ్జనం.. పోలీసుల అలర్ట్
- శోభాయాత్ర, నిమజ్జనం చిత్రీకరించేందుకు భారీగా వచ్చిన ప్రైవేట్ డ్రోన్లు, యూట్యూబర్లు
- డ్రోన్లు వాడితే కేసులు పెడుతామంటూ పోలీసుల హెచ్చరిక ప్రకటనలు

నిమజ్జనం ఆలస్యం కానివ్వం: సీపీ సజ్జనార్
- కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర
- వాహనపూజ, మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సజ్జనార్
- హైడ్రాలిక్ క్రేన్ సమస్య వల్ల ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్న నగర కమిషనర్
- అనుకున్న సమయానికి మహాగణపతి నిమర్జనం పూర్తి చేస్తామని ప్రకటన
ఖైరతాబాద్ గణేశుడిపై ఉత్కంఠ
- 69 అడుగుల మహాగణపతిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
- టస్కర్‌పైకి చేరిన తర్వాతే శోభాయాత్రకు వేగం
- భారీ విగ్రహం కావడంతో ప్రతి అడుగులోనూ అప్రమత్తత
- క్రేన్ రిపేర్‌తో ఆలస్యం.. సమయం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న ఉత్కంఠ
- 12 గంటల్లోపే నిమజ్జనం పూర్తి చేయడమే లక్ష్యం
- హుస్సేన్‌సాగర్‌లో భారీ విగ్రహం కోసం ప్రత్యేక నిమజ్జన పాయింట్
- క్రేన్ నెంబర్ 4తో చేపట్టనున్న నిమజ్జన ప్రక్రియ
- మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌పై భారీగా భక్తులు
- ఆలస్యమైనా.. గడువులోపే బడా గణేశుడి నిమజ్జనం పూర్తవుతుందా?
కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర
పూర్తైన వెల్డింగ్ పనులు
కాసేపట్లో వాహన పూజ
పూజ తర్వాత మహాగణపతికి హారతి
అనుకున్న సమయం కంటే ఆలస్యంగా శోభాయాత్ర
ఖైరతాబాద్ వద్ద భారీగా బందోబస్తు.. 523 మంది పోలీసు సిబ్బంది మోహరింపు
శోభాయాత్ర సాగే మార్గంలో, నిమజ్జనం జరిగే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత
ఆలస్యంగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం?
- ఆలస్యంగా ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
- కిందటి ఏడాది.. ఆరు గంటలకే మొదలైన ఊరేగింపు
- భారీ క్రేన్ రిపేర్‌తో ఈ ఏడాది ఆలస్యం
- 12గంటల లోపే నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయం
- అనుకున్న టైంలోపే పూర్తవుతుందా? అనే ఉత్కంఠ
- బడా గణేశుడు మునిగేందుకు హుస్సేన్ సాగర్‌లో 25 లోతు వరకు పూడిక తీసి వేత
- నిమజ్జన ప్రక్రియ కోసం 30 అడుగుల వెడల్పుతో ప్రత్యేక ప్రాంతం ఏర్పాటు
- టస్కర్ పైకి ఖైరతాబాద్ గణనాథుడిని పెడుతున్న సిబ్బంది
- శోభాయాత్ర వాహనం పైకి ఖైరతాబాద్ గణనాథుడిని చేరుస్తున్న సిబ్బంది

శోభయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ బడా గణేష్
- ఈ ఏడాది శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి అవతారంలో దర్శనం ఇచ్చిన గణనాధుడు
- 69 అడుగుల ఎత్తుతో ఐదు ముఖాలు, ఐదు తలలపై కిరీటాలతో దర్శనం
- విగ్రహానికి కుడివైపున 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళికా మాత ప్రతిమలను ఏర్పాటు
- ఈ ఏడాది కూడా పర్యావరణ హిత గణనాథుడిగా దర్శనం
- ఖైరతాబాద్ గణనాథుడిని తీర్చిదిద్దిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు గుజరాత్‌కు చెందిన సుమారు 150 మంది కళాకారులు
- దాదాపు 80 రోజుల పాటు శ్రమించి రూపుదిద్దుకున్న విగ్రహం

ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ ఆలస్యం
- మండపం నుండి ఇంకా టస్కర్ మీదికి వెళ్లని గణనాథుడు
- రాత్రి హీట్ ఎక్కువై భారీ క్రేన్ రిపేర్
- పోయిన ఏడాది ఈపాటికే టస్కర్ మీద గణనాథుడు సిద్ధం
- అయితే శోభాయాత్ర త్వరగా చేస్తామంటున్న పోలీసులు

ట్యాంక్ బండ్ చుట్టూ డీజేల హోరు
- జంట నగరాల్లో ఘనంగా ప్రశాంతంగా కొనసాగుతున్న గణేశుడి నిమజ్జనం
- ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం
- హుస్సేన్ సాగర్, చెరువుల్లో కొనసాగుతున్న ప్రక్రియ
- తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు చేరుకుంటున్న గణనాథుడు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
- హైదరాబాద్, రంగారెడ్డి ‘క్యూర్’ పరిధిలో స్కూళ్లకు సెలవు
- మంచి నీటి వసతి, వైద్య ఇతరత్ర హెల్ప్ లైన్ల ఏర్పాటు
- ఎంఎంటీఎస్ రైలు సర్వీసులపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టి
- అర్ధరాత్రి ఒంటిగంట దాకా నడవనున్న మెట్రో
- ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీజీఎస్‌ఆర్‌టీసీ


