బాలాపూర్‌ శోభాయాత్ర ప్రారంభం.. లడ్డూ వేలంపై ఉత్కంఠ | Balapur Ganesh Immersion And laddu Auction Updates | Sakshi
Sakshi News home page

బాలాపూర్‌ శోభాయాత్ర ప్రారంభం.. లడ్డూ వేలంపై ఉత్కంఠ

Sep 25 2026 7:01 AM | Updated on Sep 25 2026 9:10 AM

Balapur Ganesh Immersion And laddu Auction Updates

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌..

👉బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర ప్రారంభం

👉బాలాపూర్‌ శోభాయాత్రకు భారీగా పోలీసు బందోబస్తు. 

  • ఆలస్యం కానున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట
  • ఇంకా ట్రాలీలోకి ఎక్కని బాలాపూర్ గణేష్
  • ఇంకా ప్రారంభం కాని బాలాపూర్ గణేష్ శోభాయాత్ర

బడా గణేష్‌ శోభాయాత్ర కూడా ఆలస్యం..

  • ఏటా కంటే ఆలస్యంగా ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర..
  • ఉదయం 6.30కి ప్రారంభం కావాల్సిన శోభా యాత్ర..
  • బడా గణేష్‌ను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక లోపం..
  • అనుకున్న సమయాని కంటే ఇప్పటికే రెండు గంటల ఆలస్యం..
  • శోభా యాత్ర ప్రారంభానికి మరో గంట పట్టే అవకాశం...
  • ఇప్పటికే భారీగా చేరుకున్న భక్తులు..
  • ఖైరతాబాద్ పురవీధుల్లో భక్తులు పెరిగితే.. శోభా యాత్ర మరింత ఆలస్యం అయ్యే అవకాశం

👉బాలాపూర్‌ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనానికి ముందు బాలాపూర్‌ గణనాథుడు చివరి పూజలు అందుకుంటున్నాడు. పూజా కార్యక్రమాలు పూర్తైన అనంతరం గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

👉ఇదిలా ఉండగా.. బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే వీరంతా బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఈసారి లడ్డూ వేలం పాటపై ఆసక్తి నెలకొంది. గతేడాది బాలాపూర్‌ లడ్డూ రూ.35 లక్షల ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూ ఎంత ధర పలుకుతుందన్నది ఉత్కంఠగా మారింది.

1994లో రూ.450తో ప్రారంభం
👉బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం సంప్రదాయం 1994లో రూ.450తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వేలం ధర పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా కారణంగా సాధారణ వేలం నిర్వహించలేదు. 2025లో కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఇది అప్పటి వరకు అత్యధిక వేలం ధరగా నమోదైంది. 2024లో కొలను శంకర్‌రెడ్డి రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అంటే 2025లో గతేడాది కంటే దాదాపు రూ.4.99 లక్షలు ఎక్కువ పలికింది. ఇప్పుడు 2026 వేలంలో కొత్తగా 9 మంది సభ్యులు రంగంలోకి రావడంతో, గతేడాది రూ.35 లక్షల రికార్డును ఈసారి వేలం దాటుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

  • 1994    రూ.450
    1995    రూ.4,500
    1996    రూ.18,000
    1997    రూ.28,000
    1998    రూ.51,000
    1999    రూ.65,000
    2000    రూ.66,000
    2001    రూ.85,000
    2002    రూ.1.05 లక్షలు
    2003    రూ.1.55 లక్షలు
    2004    రూ.2.01 లక్షలు
    2005    రూ.2.08 లక్షలు
    2006    రూ.3 లక్షలు
    2007    రూ.4.15 లక్షలు
    2008    రూ.5.07 లక్షలు
    2009    రూ.5.10 లక్షలు
    2010    రూ.5.35 లక్షలు
    2011    రూ.5.45 లక్షలు
    2012    రూ.7.50 లక్షలు
    2013    రూ.9.26 లక్షలు
    2014    రూ.9.50 లక్షలు
    2015    రూ.10.32 లక్షలు
    2016    రూ.14.65 లక్షలు
    2017    రూ.15.60 లక్షలు
    2018    రూ.16.60 లక్షలు
    2019    రూ.17.60 లక్షలు
    2020    కరోనా కారణంగా వేలం లేదు
    2021    రూ.18.90 లక్షలు
    2022    రూ.24.60 లక్షలు
    2023    రూ.27 లక్షలు
    2024    రూ.30.01 లక్షలు
    2025    రూ.35 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement