ఆల్‌టైమ్‌ టీ20 జట్టు ఇదే.. రోహిత్‌కు నో ఛాన్స్‌! భారత్‌ నుంచి ముగ్గురే? | Former MI cricketer picks all-time T20 XI ahead of IND vs WI 2026 series | Sakshi
Sakshi News home page

ఆల్‌టైమ్‌ టీ20 జట్టు ఇదే.. రోహిత్‌కు నో ఛాన్స్‌! భారత్‌ నుంచి ముగ్గురే?

Sep 24 2026 5:17 PM | Updated on Sep 24 2026 5:28 PM

Former MI cricketer picks all-time T20 XI ahead of IND vs WI 2026 series

PC: BCCI/X

ఇంగ్లండ్ స్టార్ పేసర్ రీస్ టోప్లీ తాజాగా 'క్రిక్‌ట్రాకర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు రోహిత్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నప్పటికీ, టోప్లీ తన ఆల్‌టైమ్ టీ20 తుది జట్టులో అతడికి అవకాశం ఇవ్వలేదు. 

ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు లభించింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లి, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాలు టోప్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.   టోప్లీ త‌న జ‌ట్టులో ఓపెన‌ర్లుగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్‌, ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌కు అవ‌కాశ‌మిచ్చాడు. 

మిడిలార్డర్‌లో విరాట్‌, సూర్యకుమార్‌, ఎబీ డివిలియర్స్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ల కోటాలో కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)లను టోప్లీ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో లసిత్ మలింగ (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా)లకు చోటు దక్కింది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీధరన్‌కు టోప్లీ చోటిచ్చాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ (7329) లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నప్పటికి ఆల్‌టైమ్ జట్టులో చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

రీస్ టోప్లీ ఎంపిక చేసిన ఆల్-టైమ్ T20 జట్టు: క్రిస్ గేల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, షాహిద్ అఫ్రిది, లసిత్ మలింగ, బ్రెట్ లీ, జస్ప్రీత్ బుమ్రా, ముత్తయ్య మురళీధరన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement