అభిషేక్- యువీ (PC: BCCI/X)
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్‌తో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఇరగదీసిన ఓపెనర్లు
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ తొమ్మిది ఫోర్లు, పదకొండు సిక్సర్ల సాయంతో ఏకంగా 113 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్ నుంచి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అతడికి సహకారం అందించాడు.
ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ సైతం కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు కేవలం 43 బంతుల్లోనే 133 పరుగులు జోడించి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ABHISHEK SHARMA, YOU ABSOLUTE MENACE! 🤯 A 35-ball hundred. Let that sink in! 💯 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/OvOMf1rIsy
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
మరోవైపు.. వైభవ్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ 13 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్, అభిషేక్ శర్మ మెంటార్ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇంటి పెరట్లో బ్యాటింగ్ చేస్తున్నట్లుంది
తొలుత అభిషేక్ అర్ధ శతకాన్ని ఉద్దేశిస్తూ.. ‘ఇప్పటికీ నువ్వు 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావు. ఏదేమైనా ఇద్దరు లెఫ్టాండర్ ఓపెనర్లు తమ ఇంటి పెరట్లో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది’ అని యువీ సరదాగా ట్వీట్ చేశాడు.
నా వల్ల కాదు
అనంతరం.. ‘నేనైతే 30 లేదంటే 34 బంతుల్లో సెంచరీ మాత్రం చేయలేను. మీరు చాలా బాగా ఆడారు అభిషేక్ సర్. గొప్ప ఇన్నింగ్స్. సింగిల్స్ కూడా తీశారు. ఇక మరో ఎండ్ నుంచి వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు.
హ్యాట్సాఫ్ సంజూ!
వీళ్లిద్దరిది విధ్వంసకర బ్యాటింగ్ కాంబినేషన్!.. జట్టు ప్రయోజనాల కోసం మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్ నిజంగా కంప్లీట్ టీమ్ మ్యాన్. హ్యాట్సాఫ్ సంజూ! ఇక మన బౌలర్లు కూడా గొప్పగా రాణించి.. ప్రత్యర్థిని 200 పరుగులకే పరిమితం చేశారు!
గొప్ప విజయం. సిరీస్ మనదే. టీమిండియాకు అభినందనలు’’ అని యువీ అభిషేక్, వైభవ్, సంజూలను ప్రశంసించాడు. కాగా సంజూకు సైతం కొన్నాళ్ల క్రితం యువీ బ్యాటింగ్‌లో మెళకువలు నేర్పిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ ఆ రికార్డు యువీదే
కాగా.. ఐసీసీ సభ్య దేశాల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఘనత యువీదే. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ మీద 12 బంతుల్లోనే ఈ లెజెండరీ ఆల్‌రౌండర్ అర్ధ శతకం బాదాడు.
ఇదిలా ఉంటే... న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి నాలుగో టీ20కి ఆక్లాండ్ వేదిక.
ఇవీ చదవండి: వాళ్లిద్దరు అత్యద్భుతం.. సంజూ, నేను ఆశ్చర్యపోయాం: శ్రేయస్ అయ్యర్
చెలరేగిన అభిషేక్- వైభవ్.. టీమిండియా ప్రపంచ రికార్డు


