ఒకే వేదికపై విజయ్‌, శిఖర్‌ ధావన్‌.. అబుదాబిలో సందడి! | Vijay Deverakonda And Shikhar Dhawan Abu Dhabi Weekend Photos Viral | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda-Shikhar Dhawan : అబుదాబిలో విజయ్‌.. మాజీ క్రికేటర్‌తో సందడి !

Oct 27 2026 7:13 PM | Updated on Oct 27 2026 7:43 PM

Vijay Deverakonda And Shikhar Dhawan  Abu Dhabi Weekend Photos Viral

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన అబుదాబిలో సందడి చేశారు. తన వీకెండ్‌ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ పర్యటనలో భారత మాజీ క్రికెటర్‌ శిఖర్ ధావన్‌తో కలిసి ఓ అంతర్జాతీయ క్రీడా కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

శిఖర్ ధావన్‌తో కలిసి..
అబుదాబిలో అక్టోబర్‌ 24న జరిగిన యూఎఫ్‌సీ 333 పోటీలకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. అదే కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్‌ శిఖర్ ధావన్‌, బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా కనిపించారు. వీరంతా ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల దృష్టి ఈ కార్యక్రమంపై పడింది. ముఖ్యంగా విజయ్‌, ధావన్‌ కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా, క్రికెట్‌ రంగాలకు చెందిన ప్రముఖులు ఇలా ఒకే చోట సందడి చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

స్టైలిష్‌ లుక్‌లో హీరో
ఈ పర్యటనలో విజయ్ దేవరకొండ తనదైన శైలితో ఆకట్టుకున్నారు. ఆరెంజ్‌ జాకెట్‌, తెలుపు రంగు ట్యాంక్‌ టాప్‌లో కనిపిస్తూ స్టైలిష్‌ లుక్‌తో మెప్పించారు. సినిమా వేడుకలకు భిన్నంగా అంతర్జాతీయ క్రీడా వేదికపై కనిపించడంతో ఆయన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీలను వీక్షిస్తూ సరదాగా గడిపిన క్షణాలతో పాటు అబుదాబి పర్యటనలో తీసుకున్న మరికొన్ని ఫొటోలను కూడా విజయ్‌ అభిమానులతో పంచుకున్నారు.

ఇదీ చదవండి: యువత చేత వెట్టిచాకిరి చేయిస్తున్నారు: ప్రముఖ నటుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement