ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేసి.. ఆ అంచనాలను ఆమాంతం పెంచేశాడు జక్కన్న. గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా ఈ మూవీ కథపై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఏదో రకంగా వారణాసి గురించి నెట్టింట చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల బ్రెజిల్ వెళ్లిన ఆయన అక్కడ ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. ‘వారణాసి కథ ఎలా ఉండబోతుందో వివరించడానికే నేను గ్లింప్స్ రిలీజ్ చేశాను. అంతకు మించి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పదల్చుకోలేదు. ఎందుకంటే మాటలతో ఈ సినిమా స్థాయిని పూర్తిగా వివరించలేను. అందుకే కథ చెప్పకుండా వారణాసి ప్రపంచం ఎలా ఉండబోతుంది చిన్న గ్లింప్స్ ద్వారా చూపించాం. ఇది వివిధ ప్రపంచాల చుట్టూ తిరుగుతుంది.
(చదవండి: పల్లెటూరిలో ఎందుకు పుట్టాను.. అసహ్యం వేస్తోంది : బాలీవుడ్ నటుడు)
అంటార్కిటికా నుంచి ఆఫ్రికా వరకు, అక్కడి నుంచి వారణాసి నగరం వరకు ప్రయాణం సాగుతుంది. విభిన్న కాలమానాల్లోకి వెళ్తుంది. పురాణాల కాలంలోకి కూడా తీసుకెళ్తుంది. అక్కడ భారీ ఆకారాలు కలిగిన జీవులు, దేవుళ్లు..ఇలా ఎన్నో అంశాలు కనిపిస్తాయి. అయితే ఈ కథ మొత్తం తండ్రి, కొడుకుల మధ్య ఉండే ప్రేమ, భావోద్వేగాల చుట్టూనే సాగుతుంది’ అని చెప్పారు.
ఈ చిత్రంలో మహేశ్ ‘రుద్ర’గా నటించగా, ప్రియాంక మందాకిని పాత్రను పోషించింది. ఇక విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


