యువత చేత వెట్టిచాకిరి చేయిస్తున్నారు: ప్రముఖ నటుడు | R Narayana Murthy Speech In Husharu2 Teaser Release Event | Sakshi
Sakshi News home page

Husharu2 Teaser: నిరుద్యోగంపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు

Oct 27 2026 5:51 PM | Updated on Oct 27 2026 6:06 PM

R Narayana Murthy Speech In Husharu2 Teaser Release Event

2018లో విడుదలైన ‘హుషారు’ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహం, ప్రేమ, వినోదంతో సాగిన ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హుషారు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. 

 ఈ సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.  ఈ సినిమాలో  కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యతో పాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

యువత సమస్యలపై  ఏమన్నారంటే?
‘హుషారు’ మొదటి భాగంలో శ్రీహర్ష ఎంతగా నవ్వించారో.. రెండో భాగంలోనూ అంతే వినోదాన్ని పంచడంతో పాటు ఆలోచింపజేస్తారు. ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటైన నిరుద్యోగాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, పని హక్కు నేటి పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడటం, వాటిని ప్రైవేటు సంస్థలకు విక్రయించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

మరోవైపు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న యువతతో సమయపాలన లేకుండా అధికంగా పని చేయిస్తున్నారు. వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.  అలాంటి యువతకు జీవితం అంటే కేవలం ఉద్యోగం, పని మాత్రమే కాదని.. స్వేచ్ఛగా బతకడం కూడా ముఖ్యమనే సందేశాన్ని ‘హుషారు 2’ ద్వారా చెప్పేందుకు చిత్రబృందం ప్రయత్నించింది’ అని నారాయణమూర్తి వివరించారు.  దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఐదుగురు స్నేహితుల కథతో ‘హుషారు 2’
ఈ సినిమాలో ఐదుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన వారు.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి తమ జీవితాలను మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు, అనూహ్య సంఘటనలతో కథ సాగనుంది. స్నేహం, వినోదానికి ప్రాధాన్యమిస్తూ యువతకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో చూపించనున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష కొనుగంటి ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. 

అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, ఆర్‌ నారాయణ మూర్తి, దినేష్ తేజ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది.

(ఇదీ చదవండి: ‘జైలర్‌2’.. హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement