టికెట్‌ రేట్ల పెంపు.. ఏపీ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ ఫైర్‌ | CPI Narayana Fires On Ap Government For Increasing Ticket price Of Adarsha kutumbam Movie | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘ఆదర్శ కుటుంబం’ టికెట్‌ రేట్ల పెంపు.. సీపీఐ నారాయణ ఫైర్‌

Oct 27 2026 5:36 PM | Updated on Oct 27 2026 6:03 PM

CPI Narayana Fires On Ap Government For Increasing Ticket price Of Adarsha kutumbam Movie

‘ఆదర్శ కుటుంబం- ఏకే 47’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సీపీఐ నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం కోసం విలాసవంతంగా ఖర్చు చేసే నిర్మాతలు, ఆ భారాన్ని సామాన్య ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.  ఈ మేరకు ఆయన సీపీఐ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలకు, సినిమా నిర్మాణ వ్యయాన్ని సాకుగా చూపిస్తూ ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపే అధికారం ఎవరిచ్చారు?  నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే పేరుతో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ, సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లు పెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? సినిమా నిర్మాణం అనేది ఒక వ్యాపారం. వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లే, నష్టాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు నిర్మాతలు చేసిన ఖర్చులకు సామాన్య ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? ‘ఆదర్శ కుటుంబం’ సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది’అని నారాయణ పేర్కొన్నారు. 

కాగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం చిత్రానికి టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరపై రూ.75 (జీఎస్టీతో కలిపి), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అలాగే రోజుకు ఐదు షోలను కూడా ప్రదర్శించుకునే వెసులుబాటూ కల్పించింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement