విద్యా సంస్థలకు కొన్ని నియమాలు ఉంటాయి. ఉండాలి కూడా. ఎందుకంటే.. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత వాటిపైనే ఉంటుంది. అలాంటి విద్యా సంస్థలు స్వతంత్రంగా, విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి. రాజకీయాలకు, ఇతరత్రా జోక్యాలకు దూరంగా ఉండాలి. కానీ ప్రస్తుతం విద్యా వ్యవస్థలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు ఎదుర్కొన్న విద్యా సంస్థలు.. ఇప్పుడు సినిమా ఈవెంట్లకు కూడా అడ్డాలుగా మారుతున్నాయి. ఇంతటితో ఆగకుండా.. ఏకంగా ఓ సినిమా కోసం కాలేజీకి సెలవు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. సినిమా రిలీజ్ సందర్భంగా అక్టోబర్ 30న కాలేజీకి హాలీడే ప్రకటించారు.
సినిమా కోసం సెలవు ఏంటి?
ప్రితిరెడ్డి తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక సినిమా కోసం సెలవు ఇవ్వడం ఏంటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ‘కాలేజీలా లేక సినిమా ప్రమోషన్ ఏజెన్సీలా?’ అంటూ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పెద్ద ఎత్తున్న పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు విద్యావ్యవస్థను ప్రభావితం చేస్తాయని, భవిష్యత్తులో ఇదొక సంప్రదాయంగా మారే ప్రమాదమూ లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
Is this really an educational institution? Every week, there seems to be another movie promotional event, followed by holiday declarations for film releases. I understand that college life should have its share of fun, but this has increasingly turned into a PR spectacle for Preethi Reddy rather than a focus on educational environment. Parents should think twice before enrolling their children here. An educational institution’s priority should be academics, not endless publicity stunts.
— Agasthya Kantu (@agasthyakantu) October 24, 2026
‘ఇది నిజంగా విద్యాసంస్థేనా? ప్రతి వారం ఏదో ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించడం, ఆ తర్వాత సినిమా విడుదలల కోసం సెలవులు ప్రకటించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాలేజీ జీవితంలో సరదా, వినోదం ఉండటాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ఇదంతా క్రమంగా విద్యా వాతావరణం కంటే ప్రీతి రెడ్డి ప్రచార కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తమ పిల్లలను ఈ కాలేజీలో చేర్పించే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. విద్యాసంస్థకు మొదటి ప్రాధాన్యం విద్య, విద్యార్థుల భవిష్యత్తు కావాలి. అంతేకానీ, అంతులేని ప్రచార ఆర్భాటాలు, పబ్లిసిటీ స్టంట్స్ కాదు’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
కాలేజీలు చదువు చెప్పడానికా? సినిమా ప్రమోషన్ల కోసమా? ఇలాంటి కాలేజీల్లోనా మన పిల్లల్ని చదివించేది ? ప్రభుత్వం మల్లారెడ్డి కాలేజీ యాజమని పై చర్యలు తీసుకోదా ? అని మరో నెటిజన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
ఆదర్శ కుటుంబం రిలీజ్ కి మల్లారెడ్డి కాలేజీలో సెలవు ఇచ్చారు కాలేజీలు చదువు చెప్పడానికా? సినిమా ప్రమోషన్ల కోసమా? ఇలాంటి కాలేజీల్లోనా మన పిల్లల్ని చదివించేది ? ప్రభుత్వం మల్లారెడ్డి కాలేజీ యాజమని పై చర్యలు తీసుకోదా ? మల్లారెడ్డి విద్యాసంస్థల్లో వరుసగా సినిమా ఈవెంట్లు నిర్వహించడం, వెంకటేశ్ సినిమా విడుదల రోజున విద్యార్థులకు సెలవు ప్రకటిస్తామని ప్రీతి రెడ్డి చెప్పడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన విద్యాసంస్థలు సినిమా ప్రమోషన్లకు వేదికలుగా మారడం ఎంతవరకు సమంజసం? విద్యార్థుల చదువును పక్కనపెట్టి సినిమా ప్రచారానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఇటీవల టాక్సిక్ సినిమా ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్సులు కూలి విద్యార్థులు గాయపడిన ఘటనపై కూడా వార్తలు వచ్చాయి. అయినా వరుసగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై యాజమాన్యం, అధికారులు సమాధానం చెప్పాలి. అసలు విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఇలాంటి సినిమా ఈవెంట్లకు ఏ నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నారు? విద్యాశాఖ, పోలీసులు అనుమతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారా? విద్యాసంస్థలను వాణిజ్య ప్రచార వేదికలుగా మార్చుకోవచ్చా? విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉండాలి. సినిమా ప్రమోషన్ల కోసం కాదు! తెలంగాణ విద్యాశాఖ ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలి. విద్యార్థుల భద్రత, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. #StudentSafety #EducationFirst #TelanganaEducation #CampusSafety #AshokMedia
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) October 24, 2026
పేరెంట్స్ మల్లారెడ్డి కుటుంబానికి వాళ్ళు పట్టుకొచ్చిన సినిమా లఫూట్ గాళ్ళకి చీర్ లీడర్స్ గా పని చేయడానికి పిల్లలను డబ్బులు కట్టి కాలేజీ కి పంపుతున్నట్లు ఉంది.🤮🤮 https://t.co/09vAgIPPI8
— SRINIVASA RAO🦉 (@NeverSayYesDude) October 23, 2026
మల్లన్న @chmallareddyMLA నువ్వు పూలే అమ్మినవో, పాలే అమ్మినవో ఏదోకటి చేసి ఎదిగినవ్, కానీ ఇపుడు జనరేషన్స్ కి అంత అవకాశం, తెలివి రెండూ లేవు, సచ్చి చెడి సదువుకుంటేనే రేపు బ్రతకడానికి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటారు, ఆ సదువుకునే టైమ్ లో నువ్వు నీ కోడలు కాలేజీలో సినిమా ప్రమోషన్లు, అది చాలదన్నట్లు సినిమాలు చూడటానికి సెలవులు ఇచ్చుకుంటాపోతే.. వాళ్ళు బాగుపడొద్దా ఇక..??😡 ఆ పిల్లలకి కట్టే ఫీజుల వెనక ఎందరో తలిదండ్రుల రెక్కల కష్టం ఉంది, వారి తల్లుల బంగారం, వారి పొలం పాస్ బుక్కులు తాకట్టులో ఉండి ఉంటాయ్..!!🥲 వీళ్ళ విద్యాసంస్థల లైసెన్స్ రద్దు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం @revanth_anumula గారు..!!🙏
— Geetha Ainala గీత అయినాల (@GeethaAinala) October 24, 2026


