గొప్ప జ్ఞాపకాలన్నీ నా కాలేజ్‌ టైమ్‌లో జరిగినవే : వెంకటేశ్‌ | Venkatesh Speech About Aadarsha Kutumbam Movie At Trailer Release Event | Sakshi
Sakshi News home page

గొప్ప జ్ఞాపకాలన్నీ నా కాలేజ్‌ టైమ్‌లో జరిగినవే : వెంకటేశ్‌

Oct 24 2026 1:05 PM | Updated on Oct 24 2026 1:20 PM

Venkatesh Speech About Aadarsha Kutumbam Movie At Trailer Release Event

‘‘నాకు గుర్తున్న గొప్ప జ్ఞాపకాలు నా కాలేజ్‌  టైమ్‌లో జరిగినవే. కాలేజ్‌ అంటే డిగ్రీ, ఉద్యోగం మాత్రమే కాదు... మంచి క్యారెక్టర్‌తో బయటకు రావాలి. మీ కాలేజ్‌ లైఫ్‌లోని ఈ నాలుగేళ్లు మీ లైఫ్‌ ట్రైలర్స్‌ను విజువలైజ్‌ చేసుకోండి. మీ కలను నిజం చేసుకోండి’’ అని వెంకటేశ్‌ అన్నారు. వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆదర్శకుటుంబం: హౌస్‌ నెం 47’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్‌ ప్రజ్వల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ (ఎస్‌. చినబాబు) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్‌ కళాశాలలో నిర్వహించింది యూనిట్‌. ఈ వేడుకలో వెంకటేశ్‌ మాట్లాడుతూ –‘‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 

(చదవండి: అదితీ సినీ కెరీర్ ముగిసిందా? ఓటీటీ సినిమాలే గతి!)

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ కామెడీ మూవీలా కాకుండా ప్రేక్షకులు ఊహించని డైరెక్షన్‌లో ఈ సినిమా ఉంటుంది. క్రైమ్‌ కామెడీ, డార్క్‌ కామెడీ ట్రై చేశాం. ఇలాంటి అంశాలతో సినిమా చేయడం నాకు, వెంకటేశ్‌గారికి కూడా కొత్త’’ అని అన్నారు. ‘‘మనం కాలేజీలో ఏం చదువుకున్నా లైఫ్‌ మనల్ని సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటుంది. అలానే మా సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసేలా ఉంటుంది’’ అని శ్రీనిధి శెట్టి అన్నారు. ‘‘త్రివిక్రమ్‌గారి ట్రేడ్‌ మార్క్‌ ఫిల్మ్‌లా ఈ సినిమా ఉంటుంది’’ అని తమన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ ప్రీతి రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement