‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌లో వచ్చిన మార్పులివే.. | Prabhas Birthday Special: After baahubali These Are Changes From Prabhas | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌లో వచ్చిన మార్పులివే..

Oct 23 2026 7:53 AM | Updated on Oct 23 2026 8:06 AM

Prabhas Birthday Special: After baahubali These Are Changes From Prabhas

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పాన్‌ ఇండియా స్టార్‌. ప్రేమకథలు, మాస్‌ యాక్షన్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌.. ‘బాహుబలి’ తర్వాత తన కెరీర్‌ను పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తున్నారు. భారీ బడ్జెట్‌ చిత్రాలు, విభిన్నమైన కథలు, కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత ప్రభాస్‌లో వచ్చిన అసలు మార్పులేంటి? అనేది చూద్దాం.

ప్రభాస్‌ కెరీర్‌లో ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘మిర్చి’ వంటి సినిమాలు కీలకంగా నిలిచాయి. ఈ చిత్రాలతో తెలుగులో స్టార్‌ హీరోగా ఎదిగారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ రెండు చిత్రాల విజయంతో ప్రభాస్‌ సినిమాలపై ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. 

అయితే తర్వాత ఎన్ని సినిమాలు వచ్చానా అభిమానుల సంతృప్తిని తీర్చలేదనే చెప్పాలి. కల్కీ, సలార్‌ మినహా మిగతా సినిమాలు అభిమానులను నిరాశపరిచాయనే చెప్పాలి. 

(చదవండి: అవును.. నేను పెళ్లి చేసుకుంటున్నా: హీరో తేజ)

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరగడంతో ఎన్ని సినిమాలు చేస్తున్నా అభిమానులు అంచనాలను అందుకోవడం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్..ఫౌజీ సినిమా అప్‌డేట్‌ విషయంలోనే ఇదే ప్రస్తావన ఎత్తడం విశేషం.

అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ప్రభాస్‌ ప్రభంజనం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన సినిమాకు కూడా రెండు, మూడు వందల కోట్ల కలెక్షన్స్‌ రాబట్టగలిగే సత్తా ఉన్న ఏకైక నటుడు ప్రభాస్‌. ఆయన సినిమా వస్తోందంటే చాలు అమెరికా నుంచి జపాన్‌  వరకూ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆ సందడి కనిపిస్తుంటుంది. అదీ ప్రభాస్‌ పవర్‌. ప్రసుత్తం ఆయన లైన్‌అప్‌లో పౌజీ, స్పిరిట్‌, కల్కీ 2, సలార్‌ 2 చిత్రాలు ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆకలి తీర్చుతుందో చూడాలి. ప్రభాస్‌ సినిమాకు హిట్‌ టాక్‌ వస్తే మాత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిపోవడం గ్యారెంటీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement