యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తన వివాహానికి సంబంధించిన వార్తలను ఆయనే స్వయంగా కన్ఫామ్ చేశారు. తనకు కాబోయే భార్యకు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఓ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి అని వెల్లడించారు. అంతేకాదు.. ఆమె అమెరికాలో పెరిగినట్లు తెలిపారు.
‘ఈ వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధం. తల్లిదండ్రులే ఈ పెళ్లిని నిశ్చయించారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహం జరగనుంది.రాజస్థాన్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.
అతికొద్ది మందితో..
అయితే ఈ వేడుకకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. తనకు కాబోయే భార్య పేరును మాత్రం తేజ సజ్జా వెల్లడించలేదు. దీంతో ఆమె ఎవరనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. త్వరలోనే ఈ వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: విధి విసిరిన సవాళ్లు.. వ్యాధులను జయించిన తారలు..)


