ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ రిలీజ్.. నేతాజీ డైలాగ్స్‌తో గూస్‌బంప్స్! | Prabhas fauzi Movie glimpse released | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ రిలీజ్.. నేతాజీ డైలాగ్స్‌తో గూస్‌బంప్స్!

Oct 23 2026 11:23 PM | Updated on Oct 23 2026 11:50 PM

Prabhas fauzi Movie glimpse released

రెబల్‌ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే కానుక అందించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావనతో పాటు ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్, అదిరిపోయే డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగిన ఈ గ్లింప్స్‌లో నేతాజీ.. బ్రిటిష్ వారిని ఎదుర్కొనే ఓ వీర సైనికుడిగా ప్రభాస్ పాత్రను పరిచయం చేయడం గ్లింప్స్‌కు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్’ అంటూ వచ్చే ఎలివేషన్, భారీ రైఫిల్‌తో ప్రభాస్ కనిపించే సన్నివేశాలు, బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ప్రభాస్‌ను రెండు విభిన్న రూపాల్లో చూపిస్తూ బర్త్‌డే విషెస్ చెప్పడం మరో హైలైట్‌గా నిలిచింది.

ఇక గ్లింప్స్‌కు ముందు విడుదల చేసిన పోస్టర్‌లో పాతకాలపు బంగారు నాణెంపై యూనిఫాంలో ఉన్న ప్రభాస్ రూపాన్ని చూపించారు. ప్రస్తుతం ‘ఫౌజీ’ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement