బిగ్‌బాస్ 10: త్యాగం చేసిన శివ్.. త్రిగుణ్ మామూలోడు కాదు | Bigg Boss 10 Telugu Day 47, Oct 23rd 2026 Full Episode Highlights, Trigun Teams Up With Shiv To Win Goat Of Speed Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu Day 47: ప్రత్యర్థులు కలిసి గెలిచారు.. రెండు వారాలు సేవ్

Oct 24 2026 10:18 AM | Updated on Oct 24 2026 10:42 AM

Bigg Boss 10 Telugu Day 47 Episode Highlights

త్రిగుణ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే గేమ్ పరంగా అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాడు. బిగ్‌బాస్ 10 హౌసులో 47వ రోజైన శుక్రవారం నాటి ఎపిసోడ్‌లోనూ ఇలానే ఆడాడు. శివ్‌తో తొలుత ప్రత్యర్థిగా బరిలో నిలిచి, తర్వాత అతడితోనే కలిసి జట్టు కట్టి విజయం సాధించాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు. ఇంతకీ శుక్రవారం అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

గ్రీన్‌లో తన ఫొటో చూసుకుని దేబ్జానీ ఎమోషనల్ అయ్యింది. చివరికి న్యాయం గెలిచిందని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో త్రిగుణ్ వచ్చి.. పోరాడావు గెలిచావు. నీతో పాటు అమన్, నీతూ గ్రీన్‌లో ఉండటం హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు గట్టిగా పోరాడారు. మొదటి నుంచి బరువులు మోస్తూ మూడు గంటలు బ్యాలెన్స్ చేశారు అని అన్నాడు. తర్వాత ఎల్లో లెవల్‌లో ఉన్న సభ్యులకు గ్రీన్ లెవల్‌లోకి వెళ్లి గోట్‌గా మారడానికి గోట్ ఆఫ్ కామన్ సెన్స్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో స్క్రీన్‌లో వివిధ రకాల ప్రశ్నలు ఇవ్వగా, సమాధానం తెలిసిన వాళ్లు ముందు వెళ్లి బెల్ మోగించాలని ఎవరైతే ముందు బెల్ మోగించి సమాధానం చెప్తారో ఎక్కువ పాయింట్లు ఎవరు సాధిస్తారో వాళ్లే విజేతలని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి ప్రశ్న తడి దూది, పొడి దూది గురించి అడగ్గా ముకేష్ బెల్ మోగించి తడిగా ఉన్న దూది ఎక్కువ బరువు ఉంటుందని తప్పు సమాధానమిచ్చాడు. రెండూ బరువుగానే ఉంటాయని నరేశ్ చాలా స్మార్ట్‌గా సమాధానమిచ్చాడు.

ఈ టాస్క్‌లో మొదటి నుంచి ‍ప్రతి చిన్నదానికి రచ్చ రచ్చ చేసిన ముకేశ్.. చివరకు ఎక్కువ పాయింట్లు సాధించి ‘గోట్ ఆఫ్ కామన్ సెన్స్’గా నిలిచాడు. దీంతో ఎల్లో లెవల్ నుంచి గ్రీన్ లెవల్‌కి చేరుకుని రెండు వారాలు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు. అనంతరం ఎల్లో లెవల్‌లోని మిగిలిన పోటీదారులు గ్రీన్ లెవల్‌లోకి వెళ్లడానికి గోట్ ఆఫ్ స్పీడ్‌ టాస్క్ ఇచ్చారు. ఇందులో నలుగురు పోటీదారులు రెండు టీంలుగా పాల్గొనాలని ఇద్దరు గాడ్స్‌గా, ఇద్దరు దొంగలుగా మారాలని టాస్క్ ఇచ్చారు. ఎల్లో లెవల్‌లో మొత్తం ఐదుగురు(రాంప్రసాద్, నరేశ్, త్రిగుణ్, శివ, వర్షిణి) ఉండగా.. ఆడలేకపోతున్నా గానీ వర్షిణిని ఆడించడానికి ముకేశ్ తెగ ప్రయత్నించాడు. కానీ చివరకు అది జరగలేదు. రాంప్రసాద్, నరేశ్ దొంగలుగా.. త్రిగుణ్, శివ్ గాడ్స్‌గా గేమ్‌లోకి దిగారు.

ఆటలో భాగంగా శివ్ కాలికి గట్టిగా దెబ్బ తిగిలినా వెనక్కి తగ్గలేదు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో శివ్-త్రిగుణ్‌ గెలిచారు. అయితే వీళ్లిద్దరిలో ఒకరే గ్రీన్ లెవల్‌లోకి వెళ్లగలరని బిగ్‌బాస్ మెలిక పెట్టాడు. దీంతో శివ్‌ని కన్విన్స్ చేసిన త్రిగుణ్.. ఒక ఛాన్స్ ఇవ్వు శివా. నేను అడుక్కునే టైప్ కాదు కానీ చేతులు చాపి అడుగుతున్నా అని అన్నాడు. చూశారా మీరు నన్ను మోసం చేశారు. మీరే అడుగుతున్నారూ టైమ్ చూశారా’ అని శివ్ వెటకారంతో సెటైర్లు వేశాడు. ఎలాగైతేనేం శివ్ ఒప్పుకొన్నాడు.

తర్వాత బిగ్‌బాస్‌తో శివ్ మాట్లాడుతూ.. గతవారం నన్ను కొంతమంది మోసం చేసిన త్రిగుణ్.. మోసపోయిన శివ అని. వైల్డ్ ఫైర్‌గా వచ్చాడు వైల్డ్ ఫూల్ అని అన్నారు. కాలచక్రం ఎలా ఉంటుందంటే అదే త్రిగుణ్‌తో కలిసి ఆడాల్సి వచ్చింది. గెలిచాను కూడా. ఈరోజు ఆయన వచ్చి నన్ను కన్విన్స్ చేశారు. ఆయన నన్ను మోసం చేసినా సరే చాలా కష్టపడి ఆడారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. అతనే గోట్ బిగ్ బాస్ అని శివ్ అన్నాడు . దీంతో త్రిగుణ్‌ని గోట్ ఆఫ్ స్పీడ్‌గా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ వారంతో పాటు వచ్చేవారం త్రిగుణ్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement