పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో పాటు పాత సినిమాలు రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ‘ఫౌజీ’ చిత్ర బృందం అదిరిపోయే ప్రకటన చేసింది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియోను నేడు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
(చదవండి: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌లో వచ్చిన మార్పులివే..)
ఎవరతను?
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన ‘ఫౌజీ’ టీమ్.. ఎవరు అతను(Who is he) అంటూ ఆసక్తికరమైన పోస్టును పంచుకుంది. ‘‘ఎవరతను? అనే ప్రశ్నకు ఈ రోజు వీడియోతో సమాధానం లభిస్తుంది’’ అనే అర్థం వచ్చేలా అప్‌డేట్ ఇచ్చింది. అంతేకాకుండా ‘డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్: 25’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. దీంతో ఈ వీడియోలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.
ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోంది?
ఈ వీడియోలో ప్రభాస్‌ను ఎలా పరిచయం చేయబోతున్నారు? ఆయన లుక్ ఎలా ఉండబోతోంది? పాత్ర స్వభావం, కథలో ఆయన స్థానం గురించి ఏమైనా వివరాలు వెల్లడిస్తారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. ‘ఫౌజీ’ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌పై ఆసక్తి చూపుతున్న అభిమానులకు ఈ ప్రకటన మరింత ఉత్సాహాన్నిస్తోంది. ముఖ్యంగా ‘ఎవరతను?’ అనే ప్రశ్నను హైలైట్ చేయడంతో ప్రభాస్ పాత్ర చుట్టూ మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


