పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘భారతీయ సినిమా సూపర్‌హీరోకు.. ప్రతి తరంలో అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించారు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియోతో ‘కల్కి 2’పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
To the superhero of Indian Cinema… Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas. We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡ https://t.co/uE5GQAOr4c
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2026


