నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 04న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ఆఫియా సయీద్ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'రుకు రుకు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కుల్‌కర్ణి ఆలపించారు. ఈ సాంగ్ సినీ ప్రియులను తెగ అలరిస్తోంది.


