ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ కో ఓనర్ కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వచ్చేనెల 10, 11 తేదీల్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ జంట గ్రీస్‌లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారని సమాచారం. ఈ వేడుకలో ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొనే అవకాశముంది.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిసెప్షన్‌కు సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. అద్భుతమైన డిజైన్‌తో బ్లూకలర్ కోటింగ్ రూపొందించారు. వీరి రిసెప్షన్ వేడుకను చెన్నైలోని ఐటీసీలో నిర్వహించనున్నారు. ఈ గ్రాండ్ రిసెప్షన్ నవంబర్ 21న జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అనిరుధ్ మామ అయిన నటుడు రజనీకాంత్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి, అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఆహ్వానితులలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అతిథుల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


