‘జైలర్‌2’.. హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Hrithik Roshan Roddy Theme Song Released From Rajinikanth Jailer 2 Movie, Watch Full Video Goes Viral | Sakshi
Sakshi News home page

Jailer 2: హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌

Oct 27 2026 3:49 PM | Updated on Oct 27 2026 4:05 PM

Hrithik Roshan Roddy Theme Song Released From Rajinikanth Jailer2

తలైవా రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజైన 11 రోజుల్లోనే  తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

అయితే ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌ కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమా నుంచి హృతిక్‌కి సంబంధించిన స్పెషల్‌ సాంగ్‌ రోడి స్పెషల్‌ థీమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కాగా ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణన్‌, విద్యాబాలన్‌, ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజరమూడు, విజయ్‌ సేతుపతి తదితరులు నటించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.  సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ అంటే క్రష్.. నాకు భర్త అవ్వాలంటే..: రితికా నాయక్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement