‘‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలకు మంచి విజయం లభించింది. కానీ, ఆ తర్వాత నేను చేసిన తమిళ చిత్రం ‘కోబ్రా’కు ఆశించిన స్థాయిలో ప్రేక్షక ఆదరణ లభించలేదు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను చూడగలిగాను. ఒక సినిమా హిట్ కావడం అనేది మన చేతుల్లోనే లేదని తెలుసుకున్నాను. కంటెంట్ పరంగా నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ‘ఆదర్శ కుటుంబం’ కూడా నా మనసుకి నచ్చి ఎంపిక చేసుకున్న సినిమానే’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆదర్శ కుటుంబం– హౌస్ నెం.47’. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నాది అమ్మ పాత్ర అని నో చె΄్పాలనుకోలేదు. వెంకటేశ్, త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్ అంటేనే స్పెషల్. అందుకే ఈ చిత్రంలో కచ్చితంగా భాగం కావాలనుకున్నాను.
వెంకటేష్‌గారు అద్భుతమైన యాక్టర్. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ యాక్టింగ్ కానీ చాలా గొప్పగా ఉంటాయి. ఆయన్ను మ్యాచ్ చేయడం సాధ్యం కాదు. కానీ, త్రివిక్రమ్‌గారి సూచనలతో నా వంతుగా ప్రయత్నించాను. ‘హిట్ 3’ చిత్రంలో కొంత యాక్షన్ చేశాను. ‘ఆదర్శ కుటుంబం’లోనూ కొంత యాక్షన్ చేసే అవకాశం లభించింది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చె΄్పాను. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ లో సినిమా చేయడం సంతోషాన్నిచ్చింది. ‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర కోసం నేను ఆడిషన్ ఇచ్చాను. కానీ, సాయిపల్లవిగారు ఫైనలైజ్ అయ్యారు. ప్రస్తుతం కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అని తెలిపారు.


