నిత్యారెడ్డి స్పెషల్‌ డ్యూటీ | Sai Pallavi first look as an IPS officer Dhanush OM | Sakshi
Sakshi News home page

నిత్యారెడ్డి స్పెషల్‌ డ్యూటీ

Oct 27 2026 4:12 AM | Updated on Oct 27 2026 4:12 AM

Sai Pallavi first look as an IPS officer Dhanush OM

ఐపీఎస్‌ ఆఫీసర్‌ నిత్యారెడ్డిగా స్పెషల్‌ డ్యూటీ చేస్తున్నారు సాయిపల్లవి. ధనుష్‌ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్‌ రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్  థ్రిల్లర్‌ సినిమా ‘ఓం’. ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి, నసీరుద్దీన్‌ షా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రద్ధా అగ ర్వాల్, ధనుష్, అజ్మత్‌ జగ్మాగ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 20న రిలీజ్‌ కానుంది.

 సోమవారం ‘ఓం స్పెషల్‌ డ్యూటీ’ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేసి, ఈ చిత్రంలో ఐపీఎస్‌ ఆఫీసర్‌ నిత్యారెడ్డి పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘ఈ ఎంటైర్‌ నెట్‌వర్క్‌ని టోటల్‌గా న్యాబ్‌ చేయడమే ఈ ఆపరేషన్స్ అల్టిమేటం’, ‘ఐ యామ్‌ రన్నింగ్‌ దిస్‌ ఆపరేషన్ .. అండ్‌ దిస్‌ ఆపరేషన్  ఈజ్‌ నోన్  యాజ్‌ ఓం’, ‘వాట్‌ ఈజ్‌ ది నేచర్‌ ఆఫ్‌ క్రైమ్‌..’, ‘నేచర్‌...క్రైమ్‌ ఎగైనెస్ట్‌ నేచర్‌’, ‘ఎర్రచందనం.. మన ఆంధ్రప్రదేశ్‌ రెడ్‌ గోల్డ్‌’ వంటి డైలాగ్స్‌ ‘ఓం స్పెషల్‌ డ్యూటీ’ వీడియోలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement