Srinidhi Shetty
-
‘హిట్ 3’ ప్రీ రిలీజ్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్ (ఫొటోలు)
-
నాని ‘హిట్ 3: థర్డ్ కేస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Exclusive visuals of @NameisNani , @SrinidhiShetty7 reaching at Tirumala Tirupati Devasthanam on foot #HIT3 #NaturalStarNani pic.twitter.com/eqztW8zfit— Telugu Film Producers Council (@tfpcin) April 26, 2025 -
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్‌కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు. -
నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్
-
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
రామాయణ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కే సీతగా నటించే ఛాన్స్ వచ్చిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన శ్రీనిధి అవి నిజమేనంటోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. రామాయణ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పుడీ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను.స్క్రీన్ టెస్ట్ పూర్తిరామాయణ సినిమా (Ramayana Movie)లో మొదట నన్నే సీతగా అనుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మూడు సన్నివేశాల కోసం నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నా యాక్టింగ్‌కు మంచి స్పందనే వచ్చింది. అందరూ నా నటనను చూసి మెచ్చుకున్నారు. యష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే కేజీఎఫ్ 2 రిలీజైంది. మా జోడీ జనాలకు బాగా నచ్చేసింది. అలాంటప్పుడు ఈ మూవీలో యష్ రావణుడిగా.. నేను సీతగా నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారని ఆలోచించాను. అవకాశం చేజారిందంటే..కచ్చితంగా వాళ్లు మమ్మల్నిలా చూసి జీర్ణించుకోలేరేమో అనిపించింది. ఈ సినిమా మాకు వర్కవుట్ అవొచ్చు, కాకపోవచ్చు అనుకున్నాను. ఏదేమైనా సీత పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi) పూర్తి న్యాయం చేయగలదు. తనను సీతగా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మనకు ఏదైనా కలిసొచ్చిందంటే (అవకాశం వచ్చిందంటే) సంతోషపడాలి.. అది చేజారిందంటే.. ఇంకోచోట మనకోసం ఏదో అవకాశం వేచి ఉందని అనుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాల్ని అందుకుంది. ఈ బ్యూటీ హిట్: ద థర్డ్ కేస్‌తో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.చదవండి: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే! -
కేజీఎఫ్ బ్యూటీ చేతిలో చంటిపాప.. మనసు నిండిపోయిందంటూ..
-
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
హీరో నాని అంటే పక్కంటి కుర్రాడి తరహా పాత్రలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు చేస్తూ తనలో డిఫరెంట్ యాంగిల్ పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం చిత్రాలు.. ఆ తరహా ప్రయత్నాలే. ఇప్పుడు వాటిని మించిపోయేలా బ్రూటల్ మాస్ చూపించబోతున్నాడు.నాని ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇదివరకే రెండు మూవీస్ వచ్చాయి. విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించిన ఈ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథలతో వీటిని తెరకెక్కించారు. వీటిని నిర్మించిన నాని.. మూడో భాగాన్ని నిర్మిస్తూ హీరోగా నటించాడు. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'హిట్ 3' సినిమా చాలా వయలెంట్ గా ఉంటుదని నాని కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే టీజర్ ఉంది. లాఠి పట్టుకుంటే రెచ్చిపోయే అర్జున్ సర్కార్ అనే పోలీస్ గా కనిపించాడు. వైట్ కోట్ తో ఓ వ్యక్తిని చంపే సీన్ అయితే భయం కలిగించింది.టీజరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో అర్థమైపోతుంది. మే 1న థియేటర్లలోకి రాబోతుంది. శైలేష్ కొలను దర్శకుడు కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
అందమైన ప్రేమకథ
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీ రోల్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.కాగా శుక్రవారం (ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ‘తెలుసు కదా’ నుంచి న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓ ఫొటోలో శ్రీనిధీ శెట్టితో, మరో ఫొటోలో రాశీ ఖన్నాతో కలిసి ఉన్నారు సిద్ధు. ఇద్దరు అమ్మాయిలతో హీరో అందమైన ప్రేమకథను ప్రజెంట్ చేస్తున్నాయి పోస్టర్స్.వినోదాల జాక్... సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘జాక్–కొంచెం క్రాక్’. ఇందులో వైష్ణవీ చైతన్య హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
తెలుగు సినిమాలపై ప్రేమలో పడుతున్న హీరోయిన్లు
దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలైతే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్లో సినిమాలు చేయాలని చాలామంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక్కడ అవకాశం దక్కించుకుని, ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగు వేస్తున్న హీరోయిన్స్‌పై కథనం.డబుల్ ధమాకాకన్నడ ‘కేజీఎఫ్’ మూవీలతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు హీరోయిన్ శ్రీనిధీ శెట్టి. ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి ప్రస్తుతం రెండు స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్ 3 (హిట్ 3)’. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృదులగా హీరోయిన్ పాత్రను శ్రీనిధీ శెట్టి చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై డా. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఈ హిట్ 3 మూవీ మే 1న విడుదల కానుంది.ఇక శ్రీనిధి ఓ హీరోయిన్ గా చేస్తున్న మరో మూవీ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘హిట్ 3, తెలుసు కదా’... ఇలా ఒకేసారి రెండు సినిమాలతో డబుల్æధమాకాగా శ్రీనిధీ శెట్టి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.పదేళ్ల తర్వాత...నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు వస్తున్నారు హీరోయిన్ మాళవికా మోహనన్ . ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవికా మోహనన్ , నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. మాళవికాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో మాళవిక ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ‘రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావడం లేదని, కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలిసింది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయాల్సిన ఓ స్పోర్ట్స్ డ్రామా ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్)లో మాళవికా మోహనన్ హీరోయిన్ గా చేయాల్సింది. 2019 వేసవిలో ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇలా... టాలీవుడ్‌కి మాళవిక రాక ఆలస్యమైంది.రీమేక్‌తో ఎంట్రీప్రముఖ తమిళ దర్శక–నిర్మాత శంకర్ కుమార్తె అదితీ శంకర్ ఈ ఏడాది తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మూవీ ‘భైరవం’. ఈ మూవీలో అదితీ శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్‌గా చేస్తున్నారు. కాగా అదితీ శంకర్‌కు ‘భైరవం’ తెలుగులో తొలి చిత్రం. డా. జయంతి లాల్ గడ సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. గత ఏడాది మేలో రిలీజైన తమిళ హిట్ మూవీ ‘గరుడన్ ’కు తెలుగు రీమేక్‌గా ‘భైరవం’ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.ఫౌజీకి జోడీగా...స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ మూవీ ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవడం అనేది చిన్న విషయం కాదు. ఈ అవకాశం యంగ్ హీరోయిన్ ఇమాన్వీకి దక్కింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ లవ్ అండ్ పేట్రియాట్రిక్ మూవీగా ‘ఫౌజి’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇమాన్వీకి ఫస్ట్ మూవీ ఇదే. హైదారాబాద్ శివార్లలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో ఇమాన్వీ పాల్గొంటున్నారు. ప్రభాస్, ఇమాన్వీలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జయప్రద, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి పెద్ద యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇమాన్వీకి కచ్చితంగా ప్లస్ పాయింటే. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇమాన్వీ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు ‘ఫౌజీ’ మూవీలో అవకాశం కల్పించారట.కాంతార అమ్మాయికన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సినిమాలో హీరోయిన్ గా చేసిన సప్తమీ గౌడ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ‘తమ్ముడు’ మూవీతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారని తెలిసింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమీ గౌడ హీరోయిన్ నటిస్తున్నారు. లైలా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీని ఈ శివరాత్రికి థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు’ సినిమా విడుదలపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజికల్ మ్యాజిక్ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘΄పొన్నియిన్ సెల్వన్ ’ మూవీలో ఐశ్వర్యా రాయ్ యంగ్ రోల్ చేసిన నటి సారా అర్జున్ గుర్తుండే ఉంటారు. ఈ యంగ్ హీరోయిన్ స్ట్రయిట్‌గా తెలుగులో చేస్తున్న మూవీ ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజికల్ డ్రామా మూవీలో సారా అర్జున్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.కాలేజ్ ఫెస్టివల్ కోసం నలుగురు టీనేజర్లు ఓ ఒరిజనల్ సాంగ్‌ను కంపోజ్ చేయాలనుకునే ప్రయత్నంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశమని సమాచారం. ఈ మూవీలో ఎనిమిది పాటలు ఉంటాయట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చు తుండటం విశేషం. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.అచ్చ తెలుగు అమ్మాయిప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లోని సినిమాలతో ఇలియానా వంటి హీరోయిన్ ్స తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కాగా ఆయన డైరెక్షన్ లో రానున్న తాజా చిత్రంతో వీణా రావు అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ మూవీలో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామరావు హీరోగా పరిచయం అవుతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఈ మూవీని గీత నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన వీణా రావుకు కూచిపూడి డ్యాన్స్‌లోనూ ్రపావీణ్యం ఉందని, మేకర్స్ ఇటీవల ఓ సందర్భంగా వెల్లడించారు.ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ‘లైలా’ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ నెల 14న ‘లైలా’ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు ఆకాంక్ష. ‘తేరా యార్ హూ మై, కేసరి వీర్’ చిత్రాలతో పాటు దర్శకుడు మిలిప్ జవేరి డైరెక్షన్ లోని మరో మూవీలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ చిత్రాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇలా ఇటు తెలుగు అటు బాలీవుడ్లో ఒకే టైమ్‌లో ఆకాంక్ష ఎంట్రీ ఖరారు కావడం విశేషమనే చెప్పుకోవాలి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న హీరోయిన్స్ మరికొందరు ఉన్నారు. ఇంకొంత మంది హీరోయిన్స్ తెలుగుకు వచ్చేందుకు కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
జైలర్– 2లో కన్నడ బ్యూటీకి ఛాన్స్
నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అంతకు ముందు అపజయాలను ఎదుర్కొంటున్న రజనీకాంత్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చిన చిత్రం జైలర్. కాగా దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ చాలా కాలం ముందే వెల్లడించారు. అంతే కాదు చిత్ర కథ సిద్ధం అయ్యిందని, త్వరలోనే సెట్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి 'హుక్కుమ్' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తాజాగా జైలర్ – 2 చిత్రానికి సంబంధించిన అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు రజనీకాంత్ జైలర్– 2 చిత్రానికి సిద్దం అవుతున్నారనీ, ఈ చిత్రానికి సబంధించిన ప్రోమోను ఇటీవలే చిత్రీకరించినట్లు, ఆ ప్రోమోను చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది. ఇకపోతే జైలర్ చిత్రంలో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర ప్రముఖ నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, 'నువ్వు కావాలయ్యా' పాటతో యువతను గిలిగింతలు పెట్టించిన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. కాగా అదనంగా చిత్రంలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. కన్నడ చిత్రం కేజీఎఫ్‌లో నాయకిగా నటించిన ఈ అమ్మడు తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కన్నడలోనే కాకుండా తెలుగులోనూ నటిస్తున్న శ్రీనిధి శెట్టి తాజాగా కోలీవుడ్‌లో లక్కీఛాన్స్ వచ్చిందన్నది తాజా సమాచారం. దీంతో మరోసారి జైలర్ –2 చిత్రంతో ఈమె తమిళ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం నిరాశపరచడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. జైలర్– 2 చిత్రంతో తన కంటూ గుర్తింపును తెచ్చుకుంటారేమో చూడాలి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్‌ను 2025 ఫిబ్రవరి నెలలో పూర్తి చేయనున్నట్లు, తదుపరి మార్చి నెలలో జైలర్ 2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. -
కశ్మీర్లో యాక్షన్
కశ్మీర్లో విలన్లను రఫ్ఫాడిస్తున్నారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు నాని. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్‌ని చిత్రీకరిస్తున్నాం. 2025 మే 1న సినిమాని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
బలగం బ్యూటీ బోల్డ్ లుక్.. మరింత హాట్‌గా పూనమ్ బజ్వా!
బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ బోల్డ్ లుక్..!హాట్‌నెస్‌తో పూనమ్ బజ్వా స్టన్నింగ్ పిక్స్..!ఇయర్ ఎండ్ మూడ్‌లో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి..!సితార వింటర్ వేకేషన్ పిక్స్..కిస్సిక్ సాంగ్ ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల..స్మైలీ లుక్స్‌తో అనికా సురేంద్రన్..బాత్ టబ్‌లో కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ దివి బైక్ రైడ్.. శోభిత మంగళస్నాన వేడుకలో సమంత సందడి!
బిగ్‌బాస్ బ్యూటీ దివి బైక్ రైడ్..ముంబయిలో మెరిసిన మహేశ్ బాబు కూతురు సితార..శోభిత మంగళస్నానం వేడుకలో సోదరి సమంత సందడి...కూతురితో సండే చిల్ అవుతోన్న ప్రణీత సుభాష్..కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి స్మైలీ లుక్స్..యానిమల్ రోజులను గుర్తు చేసుకున్న త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
మహారాష్ట్రలో తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ప్రారంభమైంది. 24 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పాల్గొనగా ఓ పాట, ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టు చిత్రీకరిస్తారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
దీవుల్లో అమలాపాల్ చిల్.. జలకాలాడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ!
ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతోన్న అమలాపాల్ జలకాలాడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి.. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి లేటేస్ట్ లుక్స్.. బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ లుక్.. కలర్‌ఫుల్ శారీలో ఉప్పెన భామ కృతిశెట్టి.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
యూనివర్సిటీ టాపర్.. అనుకోకుండా సినిమాల్లోకి.. ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ (ఫొటోలు)
-
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు)
-
Srinidhi Shetty: చీరలో నన్ను మిస్ అయ్యారా? అంటూ ఫోటోలు షేర్ చేసిన శ్రీనిధి శెట్టి
-
చీరకట్టులో కేజీఎఫ్ భామ.. శోభిత రానా బోల్డ్ లుక్స్!
దుబాయ్‌లో శోభిత రానా హోయలు... ట్విన్ టవర్స్ వద్ద యషిక ఆనంద్ లుక్స్ వైరల్.. శారీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి స్మైలీ లుక్స్... అలాంటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోజులు.. ఆలయంలో నివేదా పేతురాజ్ పూజలు.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) -
లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి
-
ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు.. మంచుకొండల్లో కేజీఎఫ్ భామ!
►ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు ►మంచుకొండల్లో చిల్ అవుతోన్న కేజీఎఫ్ భామ ►గుర్రంతో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సవారీ ►అరెంజ్ డ్రెస్సులో ఊర్వశి రౌతేలా హోయలు ►వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్ ►కొత్త ఏడాది బీచ్‌లో చిల్ అవుతోన్న మేఘా ఆకాశ్ ► అలాంటి వీడియో షేర్ చేసిన అమలాపాల్.. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
పెళ్లి కూతురిలా 'కేజీఎఫ్' బ్యూటీ.. బాత్ టబ్‌లో హాట్‌బ్యూటీ అలా!
ఓరకంట చూస్తూ క్యూట్ పోజులో రష్మిక వెడ్డింగ్ లుక్‌లో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి అందాల విందు చేస్తున్న యాంకర్ మంజూష బ్లాక్ శారీలో వావ్ అనిపిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ పెళ్లయి రెండేళ్లు.. బీచ్‌లో భార్యతో కార్తికేయ సెలబ్రేషన్స్ వైట్ డ్రస్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న యాంకర్ రష్మీ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ కొడుకు పుట్టినరోజు.. క్యూట్ పిక్ షేర్ చేసిన జెనీలియా చొక్కా విప్పేసి మరీ బాత్ టబ్‌లో ఐషా శర్మ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Lohitha Reddy (@loh_reddy) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
ఆరేళ్ల తర్వాత ఆ దర్శకుడి సినిమా.. KGF బ్యూటీ హీరోయిన్
కేజీఎఫ్ సినిమాతో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి వేరే లెవల్ క్రేజ్ వచ్చింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే క్రేజీ ఛాన్సులు కొట్టేస్తోంది. తాజాగా సిద్ధు కొత్త మూవీ 'తెలుసు కదా'లో అవకాశం దక్కించుకుంది. తాజాగా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కొత్త సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు) ఇకపోతో తమిళ దర్శకుల్లో చేరన్ ఒకరు. కేఎస్ రవికుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతడు.. 1997లో భారతి కన్నమ్మ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వెట్రికొడి గట్టి, ఆటోగ్రాఫ్, తవమాయ్ తవమిరిందు తదితర చిత్రాలు తీశారు. తెలుగులో రవితేజతో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' సినిమా తీసింది ఈ డైరెక్టరే. 2017 తర్వాత దర్శకత్వానికి విరామం ఇచ్చిన ఇతడు.. దాదాపు ఆరేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాడు. ఈగ' చిత్రంలో విలన్ పాత్ర చేసిన ఆకట్టుకున్న సుదీప్ హీరోగా చేరన్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ఇందులోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించనుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!) View this post on Instagram A post shared by Sathya Jyothi Films (@sathyajyothifilms) -
భలే చాన్స్
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్ అందుకున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్ కాంబినేషన్లో సత్యజ్యోతి ఫిలింస్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారట ఈ బ్యూటీ. -
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్‌లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
బెస్ట్ టీమ్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ'
'గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో డీజే టిల్లు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన నుంచి మరొక కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు తెలుసు కదా అనే సరికొత్త టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా.. యువరాజ్ కెమెరామెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. సినిమా టైటిల్ వీడియో చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ అందించిన మ్యూజిక్ మనసును తాకేలా కూల్‌గా ఉంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్ శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనుండటం విశేషం. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి బాద్షా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీకి పరిచమైన నీరజ కోన ఈ చిత్రానికి మొదటిసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన నీరజ దర్శకురాలిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. తెలుసు కదా సినిమా టీమ్ చూస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
అలాంటి లుక్‌లో జాన్వీ.. ముక్కు పుడకతో రష్మిక
ముక్కుపుడకతో రష్మిక క్యూట్ పోజులు బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోతున్న శ్రీనిధిశెట్టి యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ రొమాంటిక్ స్టిల్స్ సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమంత వింటేజ్ గెటప్‌లో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ డైమండ్‌లా జిగేలు మంటున్న సన్నీ లియోన్ జిమ్ వర్కౌట్స్.. కండలు చూపిస్తున్న తేజస్వీ నీలం రంగు చీరల్లో హీరోయిన్ సదా వయ్యారాలు అందాల విందు చేస్తున్న ఇనయా సుల్తానా కాస్త ఒళ్లు చేసినట్లు కనిపిస్తున్న అరియానా బీచ్ వెకేషన్లో జాలీగా తమన్నా View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) ` -
ఈ హీరోయిన్లకు అదృష్టం లేదా?
చిత్రపరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. మరికొంతమందికి వరుస ఫ్లాప్‌లు వచ్చిన క్రేజీ ఆఫర్స్ వరిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి బాగా జరుగుతుంటాయి. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోకి వెళ్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం ఆ భారం హీరోయిన్ మోయాల్సి వస్తుంది. ఒకటి, రెండు చిత్రాలు హిట్ కాకపోతే చాలు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పక్కన పెట్టేస్తారు. పోనీ హిట్ ఇచ్చినా అవకాశాలు ఇస్తారా అంటే అదీ లేదు. టాలీవుడ్లో వరుస హిట్స్ ఇచ్చిన ఈ హీరోయిన్లకు ఇప్పటికీ సినిమా ఛాన్స్‌లు రావడం లేదు. పాన్ ఇండియా హిట్...బట్ నో చాన్స్ ‘కేజీయఫ్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తుంపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ రెండు చిత్రాలలో శ్రీనిధి పెర్ఫామెన్స్ కూ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తన అందాలకు ముగ్దులయ్యారు. వరుస సినిమాల అవకాశాలు వస్తాయని అంతా భావించారు.కానీ ఈ భామకు కేజీయఫ్ 2 తర్వాత ఆ స్థాయిలో ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ సినిమాలతోనైనా అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఆఫర్లే అందకపోవడం గమనార్హం. ‘అఖండ’విజయం కానీ.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్ .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో భారీ విజయం సాధించింది. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్‌గా నటించింది. తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.అయితే అఖండ సినిమా తరువాత ఈ భామ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్.. అయినా కూడా.. భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది సంయుక్త మీనన్. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే ధనుష్‌తో కలిసి ‘సార్’ మూవీలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ మధ్య మెగా హీరో సాయితేజ్‌తో కలిసి ‘విరూపాక్ష’లో నటించగా.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్తకు మొన్నటి వరకు సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లో లీడింగ్ హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. వీళ్లే కాదు.. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేశ్‌కు, బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత వైష్ణవికి కూడా సరైన ఆఫర్లు రాలేవు. వీరిద్దరు హీరోయిన్లుగా కమిట్ అయినా చిత్రాలే లేవు. అన్ని ఉన్నా అదృష్టం లేకపోతే ఏది దక్కదంటారు. మరి ఆ అదృష్టం ఈ అందగత్తెలకు ఎప్పుడు వస్తుందో చూడాలి. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
'కేజీయఫ్'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా తర్వాత వెనుకబడిపోయింది. (ఇదీ చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శ్రీనిధి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీనిధి శెట్టి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇందులో వారి తప్పేంలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు విషయం వేరే ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో నుదుటిన పాపిట్లో సిందూరంతో బొట్టు పెట్టుకొని కనిపించడమే ఈ ప్రచారానికి బలాన్ని చేకుర్చింది. సాదారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు మాత్రమే నుదుటన పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు కాబట్టి శ్రీనిధి కూడా పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో శ్రీనిధి జన్మించింది. వారి సంప్రదాయం ప్రకారం కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారని తెలుస్తోంది. అందువల్లే శ్రీనిధి శెట్టి కూడా నుదుటన బొట్టు పెట్టుకుందని చెబుతున్నారు. కాబట్టి ఆమె పెళ్లిపై ప్రచారం చేయడం ఇంతటితోనైనా ఆపేయండని ఆమెను అభిమానించేవారు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం శాండల్‌వుడ్‌లో ఇలా టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపంతో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్‌ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రెమ్యునరేషన్ రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే అప్పట్లోనే టాక్ వినిపించేది. (ఇదీ చదవండి: అందరూ వైష్ణవినే తిడుతున్నారు: బేబీ నిర్మాత) -
కేజీఎఫ్ హీరోయిన్ను వేధించిన యశ్?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి
సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లే కాదు. కావాలని బురద చల్లేవాళ్లు కూడా ఉంటారు. స్టార్స్‌ను టార్గెట్ చేస్తూ వారి గురించి కారుకూతలు కూస్తూ పబ్బం గడుపుకుంటారు. విమర్శించడమే పనిగా పెట్టుకుని పేరు గడిద్దామనుకుంటారు. ఇందుకోసం హద్దులు మీరి మరీ అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు ఉమైర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుని తిరిగే ఆయనకు సెలబ్రిటీల గురించి తప్పుడు వార్తలు రాయనిదే నిద్ర కూడా పట్టదు. సెలబ్రిటీల మీద చెత్త వాగుడు వాడే ఉమైర్ ఇటీవల కేజీఎఫ్ స్టార్స్ మీద పడ్డాడు. యశ్‌తో పని చేయడం ఎంతో అసౌకర్యంగా ఉందని, అతడితో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని శ్రీనిధి చెప్పిందట! హీరో ఒళ్లంతా విషమేనని, తనను తెగ వేధించాడని ఉమైర్తో వాపోయిందట. ఈ తంతును ట్విటర్లో రాసుకొచ్చాడు ఉమైర్ సంధు. యశ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? క్రిటిక్ అని చెప్పుకునే అతడిని చెడుగుడు ఆడేసుకున్నారు. అయితే ఈ విషయం శ్రీనిధి దాకా వెళ్లింది. అతడు రాసింది చదివాక ఆమె మనసు నొచ్చుకుంది. వెంటనే ట్విటర్లో రియాక్ట్ అయింది. 'సోషల్ మీడియాను కొంతమంది దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు వినియోగిస్తున్నారు. నేనైతే ప్రేమను, ఆనందాన్ని.. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను ప్రశంసించేందుకు ఉపయోగిస్తాను. ఇక్కడ మీకో విషయం మరోసారి చెప్పాలనుకుంటున్నా.. కేజీఎఫ్‌తో ఓ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ సినిమాలో యశ్‌తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. అతడు కేవలం జెంటిల్మెన్ మాత్రమే కాదు.. ఓ మెంటార్, స్నేహితుడు, ఆదర్శప్రాయుడు. రాకింగ్ స్టార్ యశ్‌కు నేనెల్లప్పుడూ అభిమానినే అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ మా క్వీన్ కౌంటరిచ్చింది, అయినా ఎవడో పిచ్చివాగుడు వాగాడని నువ్వు మనసు చిన్నబుచ్చుకోకు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 🌸🙏🏻🤗@TheNameIsYash ⭐️ pic.twitter.com/iAo6xCJjU1 — Srinidhi Shetty (@SrinidhiShetty7) March 16, 2023 -
కృతి శెట్టి ఫస్ట్ లుక్.. ఓటీటీలో హన్సిక పెళ్లిసందడి
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. కస్టడీ చిత్రంలో రేవతిగా హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ మలయాళ భామ మాళవిక మోహనన్ ట్రెండీ లుక్ రెడ్ డ్రెస్‌లో సిగ్గు పడుతున్న ప్రణవి మానుకొండ హాట్‌స్టార్‌లో హన్సిక పెళ్లి వీడియో రెడ్ డ్రెస్‌లో కేజీఎఫ్ భామ అందాలు View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
టాలీవుడ్ దరిద్రం.. వాళ్లసలు హీరోయిన్సే కాదు: నటి
టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్‌కు గుర్తింపు, ఛాన్సులు రెండూ తక్కువేనన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. తెలుగమ్మాయిలు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నా సరే వారికి అవకాశాలు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రారన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్పిందో తెలుగు నటి. 'దామిని విల్లా', 'రంగీలా', 'స్వాతి చినుకులు సంధ్య వేళలో' సినిమాల్లో నటించిన రేఖా బోజ్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కేజీఎఫ్‌లో శ్రీనిధి శెట్టి, కాంతారలో సప్తమి గౌడ హీరోయిన్స్. కన్నడ వాళ్లు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఇది చూసైనా మన దర్శకులు కాస్త మారాలి(బుద్ధి తెచ్చుకోవాలి). ఇవే కాకుండా రంగితరంగ, ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా చాలా సినిమాలున్నాయి. కార్తికేయ 2లో ఆ మలయాళీ కాకుండా ఒక తెలుగు అమ్మాయి ఉన్నా కూడా ఆ మూవీ అలానే ఆడుతుంది. మన సబ్జెక్ట్‌లో, మన గుండెల్లో దమ్ము ఉండాలే కానీ, ఆ నార్త్, మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు. డైలాగ్స్ చెప్పమంటే జీరో ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పడాలు, వొడియాలు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి. మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, చివరి రెండు వరుసల హీరోలు అయిన రాజ్ తరుణ్, కార్తికేయ, విశ్వక్ సేన్ లాంటి వాళ్లు.. ఇంకా లాస్ట్ హీరోలు కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలను తీసుకుంటారు. కానీ అదే సినిమాను మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు. అక్కడ సైడ్ యాక్టర్స్ అయిన నారప్ప, మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లసలు వాళ్ళ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ కాదు!చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిలింస్‌లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు. ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ, దరిద్రం' అని ఆగ్రహం వ్యక్తం చేసింది రేఖా బోజ్. చదవండి: సంపాదన విషయంలో సుమకు, రాజీవ్‌కు గొడవలు? 62 దేశాలు, 18 నెలల.. హీరో షాకింగ్ నిర్ణయం -
Cobra Review: ‘కోబ్రా’మూవీ రివ్యూ
టైటిల్ : కోబ్రా నటీనటులు : చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు సంగీతం : ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ:హరీష్ కణ్ణన్ విడుదల తేది: ఆగస్ట్ 31, 2022 ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు తమిళస్టార్ చియాన్ విక్రమ్. ఫలితాన్ని పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే విక్రమ్ ప్రయోగానికి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ..సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విక్రమ్ పది పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం 17 ఏళ్లు ఎదురుచూస్తున్న విక్రమ్‌కు ‘కోబ్రా’తో ఆ కొరత తీరిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్యకు గురవుతారు. ఈ కేసును విచారిస్తున్న ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్(ఇర్ఫాన్ ఫఠాన్).. ఒడిశా ముఖ్యమంత్రి, రష్యా మంత్రి కూడా అదే రీతిలో హత్యకు గురయ్యారని గుర్తిస్తాడు. ఈ హత్యలకు కోల్‌కతాలో ఉన్న లెక్కల మాస్టర్ మది(చియాన్ విక్రమ్)కి సంబంధం ఉందని అనుమానిస్తాడు. అలాగే వేరు వేరు దేశాల్లో జరిగిన ఈ హత్యలతో యువ వ్యాపారవేత్త రిషి(రోషన్ మాథ్యూ)కి కూడా సంబంధం ఉంటుంది. మరి వీరిలో ఎవరు ఆ హత్యలు చేశారు? ఈ కేసు విచారణలో అస్లామ్‌కు ఓ లెక్కల స్టూడెంట్ జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) ఏ రకమైన సహాయం చేసింది? సాధారణ లెక్కల మాస్టర్‌కు ఈ హత్యలకు ఎలాంటి లింక్ ఉంది? కధీర్కు మదికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనేదే కోబ్రా కథ. ఎలా ఉందంటే.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించేవాడని మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలిపారు. అతని కష్టం తెరపై కనిపించింది కానీ..అజయ్ జ్ణానముత్తు కథనే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. గతంలో డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. విక్రమ్‌కు సెట్ అయ్యే కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయాడు. వరుస హత్యలతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రారంభమవుతుంది. మాథ్యమెటిక్స్లో ఉన్న అనుభవంతో ఆ హత్యలను ఎలా చేశారో వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత మాత్ర కథ పూర్తిగా తేలిపోతుంది. సుదీర్ఘంగా సాగే మది, కధీర్ల ప్లాష్‌బ్యాక్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకందేలా సాగడమే కాకుండా.. నిడివి మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా చివరి భాగంలో కొన్ని యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ నటనకు వంక పెట్టలేం. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ఆయనకు అలావాటు. మది, కధీర్ పాత్రల్లో విక్రమ్ ఒదిగిపోయాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో 10 రకాల పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడు. అందుకోసం ఈ విలక్షణ నటుడు పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక మదిని ప్రాణంగా ప్రేమించే టీచరమ్మ భావన పాత్రలో శ్రీనిధి శెట్టి జీవించేసింది. జెన్నిఫర్‌గా మృణాళిని మెప్పించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర ఆమెది. ఇక లెక్కల స్టూడెంట్‌గా జూడీ మీనాక్షీ గోవింద్ రాజన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పర్వాలేదనిపించాడు. అతనికిది తొలి సినిమా. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. రోషన్ మాథ్యూ విలనిజం బాగుంది. కానీ అతని క్యారెక్టర్‌కు ఓ గోల్ అనేది లేకుండా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ
విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని భారీ అంచనాల మధ్య వినాయక చవితి రోజు బుధవారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. సస్పెన్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ ఏడు విభిన్న రూపాల్లో కనిపించడం విశేషం. ఆయన నటించిన చిత్రం థియేటర్లో విడుదలై మూడేళ్లు అయ్యింది. వెరసి కోబ్రా చిత్రంపై ఇటు చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ అంచనాలను పూర్తి చేయడానికి చిత్ర బృందంతో సిద్ధమయ్యారు. అందులో భాగంగా తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోవై వంటి ప్రధాన నగరాల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. సినీ ప్రేక్షకులు ఆయన బృందానికి బ్రహ్మరథం పట్టారనే చెప్పవచ్చు. తమిళనాడులోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విడుదలైంది. విక్రం హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు నగరాల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతకుముందు ఎప్పుడూ విక్రమ్ ఈ విధంగా తన చిత్రాల కోసం శ్రమించిన దాఖలాలు లేవు. మొత్తం మీద కోబ్రా చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. ఎంతగా అంటే కోబ్రా చిత్రాన్ని చూడడానికి కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని సెలవు అడిగేంతగా. తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఒక లేఖను రాశారు. అందులో కోబ్రా చిత్రాన్ని విడుదల అయిన తొలి రోజు చూడటానికి టిక్కెట్లు లభించలేదని, దీంతో ఒకటో తేదీ సినిమా చూసేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ రోజు తాము కళాశాలకు రాకపోతే తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయరాదని విజ్ఞప్తి చేశారు. -
విక్రమ్ 'కోబ్రా’ మూవీ స్టిల్స్
-
‘కోబ్రా’మూవీ ట్విటర్ రివ్యూ
తమిళస్టార్ చియాన్ విక్రమ్ హీరోగా, వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మీనాక్షి , మృణాళిని హీరోయిన్లుగా నటించారు.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా నేడు(ఆగస్ట్ 31) విడుదలైంది. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న విక్రమ్ సినిమా ఇది. ఇందులో పది రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు విక్రమ్. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించే వాడట. నటించడం మాత్రమే కాదు, డబ్బింగ్లోనూ ఆరు రకాల వేరియేషన్స్ చూపించాడట.సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కోబ్రా’ కథేంటి? పది రకాల పాత్రల్లో కనిపించిన విక్రమ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు?తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #CobraFDFS : 1st half Vera level 👏🏻👏🏻 Gripping engaging @chiyaan Is Back 🤞🏻🥁😉#ARRahman bgm 🎶😳 Hollywood level 🤩@SrinidhiShetty7 Gorgeous ❤️@mirnaliniravi@AjayGnanamuthu Master of screenplay 🔥🔥You killed it 👍🏻#cobrareview #ChiyaanVikram #CobraFromAugust31 #Cobra pic.twitter.com/izuoxF9onN — 🎞️ Kollywood ⭐️ (@KollywoodStar_) August 31, 2022 ‘కోబ్రా’ ఫస్టాఫ్ అదిరిపోయిందని, విక్రమ్‌కు కమ్‌బ్యాక్ మూవీ అని కామెంట్ పెడుతున్నారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అజయ్ జ్ఞానముత్తు స్క్రీప్ప్లై బాగుందని పోస్ట్‌లు పెడుతున్నారు. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అని కామెంట్ చేస్తున్నారు. #cobrareview : #Cobra 1st Half well written script by Ajay very tight screenplay unpredictable #ChiyaanVikram Performance Next Level 2022 Best Actor Awards Parcel to #Vikram 🙏🙏🙏🙏🙏 — Cobra 🐍 (@24amSherlock) August 31, 2022 అజయ్ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, విక్రమ్ తనదైన నటనతో అదరగొట్టేశాడని అంటున్నారు. 2022లో ఉత్తమ నటుడు అవార్డు విక్రమ్‌కే దక్కుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #COBRA Interval Marana Masss Thakali Soru #ChiyaanVikram Vera Level 🔥🔥🔥🔥🔥#Cobra Daaa Dual King Cobra#Vikram #CobraFDFS #CobraFromAugust31 #cobrareview — Cobra 🐍 (@24amSherlock) August 31, 2022 #ChiyaanVikram#cobrareview First Half 🔥🔥 With some lags... Waiting for Second half.. As usual @chiyaan sir Peaked 🔥🔥. — John Wick (@JohnWickTN82) August 31, 2022 #Cobra : 1st Half LA Irukura Questions elam 2nd Half LA Poga Poga theriya Varudhu 💥👌@Chiyaan #ChiyaanVikram #CobraReview — ᴅᴀᴠɪᴅ ᴀᴅᴀᴍ ᴄᵒᵇʳᵃ ғʳᵒᵐ ᴀᵘᵍᵘˢᵗ31 (@David_AdamCVF) August 31, 2022 #Cobra - first half Romba naal kachichi shankar Padam patha feel Super intelligient screenplay Interval twist verithanam Avoid spoilers to enjoy the thrill — Pravin (@pravin8984) August 31, 2022 #Cobra Interval 🔥🔥🔥🔥🔥 Wathaaa fireyyyyy 👌👌#ChiyanVikram is back 👌👌 Acting tharumaaru 👌@arrahman music 👌👌 So far best 👌 4/5#CobraFDFS #CobraReview pic.twitter.com/I1M7I4KyfR — Prof. H A B I L E (@almuyhi2) August 31, 2022 After long we came for movie for mind relax with a good feel... But no good feel expected at theatre..... Whether first day need more sound or second day !!! #Cobra @AjayGnanamuthu @chiyaan @7screenstudio @arrahman — Pradeep Kumar🔥NGK 🔥 (@_pradeep_91_) August 31, 2022 #COBRA Review FIRST HALF: Good 👌#ChiyaanVikram Shines & His Different Looks Are Good 👍#ARRahman's BGM & Song Elevates The Film 😇 Casting 👌 Screenplay is decent 👍 Some Lags 🙂 But, Interval Raises Expectations 🔥 Second Half Waiting 😁#CobraReview #CobraFDFS pic.twitter.com/yVMPoLK7W7 — Kumar Swayam (@KumarSwayam3) August 31, 2022 -
విక్రమ్, యశ్లలో ఉన్న సేమ్ క్వాలిటీ అదే: శ్రీనిధి
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31 విడుదల కానుంది. తాజాగా 'కోబ్రా' చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విక్రమ్, శ్రీ నిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ.. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుంటూ సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీలలో చిత్రీకరించినప్పుడు సహాయ దర్శకులకు రక్తం కూడా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. ఆయన సెట్స్‌కు వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా'' అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నలకు కోబ్రా చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది . కోబ్రా అని టైటిల్ పెట్టారు.. ఇంతకీ కథానాయకుడు విలనా ? హీరోనా? విక్రమ్: కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే వుంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ వుంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ వున్నాయి. నా కెరీర్లో చాలా సవాల్‌గా అనిపించిన సినిమా కోబ్రా. అపరిచితుడులో గొప్ప సందేశం వుంటుంది. కోబ్రాలో అలాంటి సందేశం ఏమైనా ఇస్తున్నారా? విక్రమ్: కోబ్రాలో సందేశం వుండదు కానీ లవ్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా వుంటుంది. దానికి ప్రేక్షకులు చాలా గొప్పగా కనెక్ట్ అవుతారు. ఇంత కష్టమైన పాత్రలు చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది? విక్రమ్: నాకు నటన అంటే పిచ్చి. ఏదైనా భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలనేదే నా ప్రయత్నం. విక్రమ్, యశ్లలో మీరు గమనించిన గొప్ప క్యాలిటీ? శ్రీనిధి: ఇద్దరూ నటన పట్ల అంకిత భావంతో వుంటారు. విక్రమ్ ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా. సెట్స్ లో చాలా హంబుల్ గా వుంటారు. విక్రమ్ సెట్స్ లో ఎలా వుంటారు ? శ్రీనిధి : చాలా సరదాగా వుంటారు. చాలా ప్రాంక్‌లు చేస్తారు. మృణాళిని: విక్రమ్ గారితో షూటింగ్ అంటే సెట్లో చాలా సీరియస్‌గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం గేమ్స్ ఆడుకుంటూ ప్రాంక్స్ చేస్తూ సరదాగా కనిపించారు. నా భయం అంతా పోయింది. మీనాక్షి : విక్రమ్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన సెట్స్ లో వుంటే గొప్ప ఎనర్జీ వుంటుంది. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం. చదవండి: తనను నానామాటలు అన్న థియేటర్ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్ -
కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది: విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. 'తెలుగు ఆడియన్స్‌కి నా ఫెర్ఫర్మెన్స్ తో ఒక బంధం ఉంది.చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది. కొవిడ్ తో షూట్ లేట్ అయ్యింది. ఒక్కొక్క మేనరిజమ్స్ చాలా ఇష్టపడి చేశాను.టెక్నికల్ సైడ్ వెరీ గుడ్ ఫిలిం.శ్రీనిధికి నాకు ఇందులో మంచి రిలేషన్ వుంటుంది. ఇది ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటూ లోపల ఒక ఎమోషనల్ డ్రామాగా వుంటుంది. ట్రైలర్ చూసి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇది యూనివర్సల్ సినిమా ..అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి' అని తెలిపారు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..విక్రమ్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కడం అదృష్టమని, మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని చెప్పింది. థియేటర్స్‌లోనే సినిమాను చూడాలని కోరింది. -
Cobra Movie: కోబ్రా వచ్చేది అప్పుడే
ఈ నెలాఖర్లో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘కోబ్రా’. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. మంగళవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. తెలుగులో ‘కోబ్రా’ చిత్రం హక్కులను నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. ‘‘ఈ చిత్రంలో గణిత మేథావి పాత్రలో విక్రమ్ కనిపిస్తారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్ర పోషించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
కోబ్రా: అదీరా లిరికల్ సాంగ్ విడుదల
విక్రమ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఇందులో గణితశాస్త్ర మేధావి పాత్రలో కనిపిస్తారు విక్రమ్. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ‘అదీరా...’ అనే పాట లిరికల్ వీడియాను విడుదల చేశారు. హీరో పాత్ర లక్షణాలను వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంగర్ ఆలపించారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటింన ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. ఆగస్ట్ 11న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ పాప్‌కార్న్ నాచోస్కు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ... ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది? అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను. సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్‌లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్‌లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ? అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ? అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను. మీరు స్టార్‌గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు? నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్‌గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా. యష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది? యష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి. ప్రశాంత్ నీల్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు. సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా? నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు ఇటీవల కేఎఫ్‌సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్‌కు ఏ మేరకు తేడా ఉంటుంది? కేఎఫ్‌సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్‌లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు? అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'. కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ? నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి. చాలా ప్రాజెక్ట్‌లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు. ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్‌పోజర్‌ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో మీరు నటించే అవకాశం ఉందా ? పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్‌పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం. -
పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!
కేజీఎఫ్ 1, 2 సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాల్లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బోలెడంత గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ గుర్తింపును క్యాష్ చేసుకోవాలనుకుందీ కన్నడ కుట్టి. అందులో భాగంగా తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కోబ్రా సినిమాతో తమిళంలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే కదా! కోలీవుడ్‌లో తొలి సినిమాకే ఆమె భారీ రేంజ్లో డిమాండ్ చేస్తోందట. కేజీఎఫ్ చాప్టర్ 2కు ఆమె మూడు కోట్లు తీసుకుంటే కోబ్రాకు ఏకంగా రూ.6-7 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఇది తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఆ రేంజ్లో తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీవిశ్లేషకులు. కాగా కోబ్రా సినిమాను అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేయగా సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ఎఫ్3 మూవీ, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి -
విక్రమ్ ‘కోబ్రా’ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
విడుదలకు సిద్ధమైన విక్రమ్ ‘కోబ్రా’.. ఆ రోజే రిలీజ్
నటుడు విక్రమ్ కోబ్రాగా బుసలు కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పాత్ర కోసం ఎంతకైనా సిద్ధమయ్యే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్.. పితామగన్, ఐ, అపరిచితుడు, మహాన్ వంటి చిత్రాల్లో తన పాత్ర కోసం ఎంతో శ్రమించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఈయన నైజం. అలా మరోసారి కోబ్రా చిత్రంలో కొత్త గెటప్‌లతో తనదైన నటనతో అబ్బురపరచడానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎంఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. కేజీయఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఇందులో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో విడుదల చేయనుంది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
Srinidhi Shetty: కేజీయఫ్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేంటి?
హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. కేజీయఫ్ బ్రాండ్ తో శ్రీనిథి శెట్టి కూడా అలానే చేయాలి అనుకుంది. అసలే కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ల ఫ్యాక్టరీలా మారిపోయింది. ఇలానే తను కూడా టాలీవుడ్ కి వచ్చి వెలుగు వెలగాలనిచూసింది. (చదవండి: టార్గెట్ సంక్రాంతి... బాక్సాఫీస్ బరిలో చిరు, పవన్, ప్రభాస్) ఇప్పటికే కన్నడ నుంచి అరడజనుకు పైగా కొత్త తారలు టాలీవుడ్ లో ఊపేస్తున్నారు. సౌందర్య, అనుష్క, ప్రేమ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ లిస్ట్ లో చేరాలని ప్రయత్నం చేసిందిశ్రీనిథి శెట్టి. కాని ఆమె అనుకున్న ఆశలకు ఆమె నిర్ణయమే గండి కొట్టినట్టు తెలుస్తోంది. కేజీయఫ్ సినిమా తరువాత పారితోషికాన్ని భారీగా పెంచింది శ్రీనిధి. కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంత వరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. కేజీయఫ్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేనని శాండల్‌వుడ్ లో టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం తో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్ ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. -
తగ్గేదేలే అంటున్న ‘కేజీయఫ్’ బ్యూటీ, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్?
కేజీయఫ్ సీరిస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్‌గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్ చిత్రం ఆఫర్ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్ ఇండియా కావడం, అది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం సౌత్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల తీసుకునే రెమ్యునరేషన్‌కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెను హోస్ట్ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. -
కేజీఎఫ్ 2: 'మెహబూబా' లవ్ సాంగ్ పూర్తి వీడియో చూశారా !
KGF 2 Movie Mehabooba Mehabooba Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల తుఫాన్‌తో రాఖీ భాయ్ ఊచకోత కోస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా పేరొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్లో కూడాల చేరిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సాంగ్స్ పూర్తి వీడియోలను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మదర్స్ డే రోజు 'అమ్మ పాట' పూర్తి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్‌లో సాగిన 'మెహబూబా' పాటను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా ఈ వీడియో సాంగ్ లింక్‌ను షేర్ చేసింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా అలరించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
Fashion: ‘కేజీఎఫ్’ హీరోయిన్ ధరించిన ఈ లెహంగా ధర రూ. 61,900!
Fashion And Lifestyle: ‘కేజీఎఫ్’తో అఖిల భారత ప్రేక్షకులకు అభిమాన నటి అయింది శ్రీనిధి శెట్టి. ఫ్యాషన్ విషయంలో కూడా పేరున్న బ్రాండ్స్‌కు ఫేవరెట్. ఈ విషయం కేజీఎఫ్ 2 ప్రమోషన్స్‌లో ఆమె ఆహార్యాన్ని గమనించిన ఎవరైనా చెప్పగలరు. అలా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు శ్రీనిధిని మెరిపించిన బ్రాండ్స్ గురించి ఇక్కడ.. పౌలమి అండ్ హర్ష్ అతివల అందంతో పోటీపడే దుస్తుల డిజైన్ ఈ బ్రాండ్ సొంతం. ప్రకృతిలోని రకరకాల మొక్కలు.. రంగురంగుల పూలే ఈ బ్రాండ్ డిజైన్స్‌కు స్ఫూర్తి, ప్రేరణ. నేటి మహిళల సౌకర్యానికి 1950ల నాటి ఫ్యాషన్‌ను జోడించి డిజైన్ చేయడమే ఈ బ్రాండ్‌కున్న వాల్యూ. వీళ్లు రూపొందించే ప్రతి పీస్‌ను హ్యాండ్ పెయింట్ చేస్తారు. దాని మీద నాజూకైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి చిన్న డీటైల్ కూడా డిజైన్‌లో ప్రస్ఫుటిస్తుంది. ఈ ప్రత్యేకత ఈ బ్రాండ్ డిమాండ్‌ను మరింత పెంచుతోంది. ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. మోర్తంత్ర భవిష్యత్ జీవితపు కలలు సరే.. అందులోని ముఖ్యమైన ఘట్టాలు అంటే పెళ్లీపేరంటాలకు సంబంధించీ కలలుంటాయి. ఆయా సందర్భాల్లో ఏ చీర కట్టుకోవాలి.. దానికి తగినట్టుగా ఎలాంటి నగలు పెట్టుకోవాలి వగైరా వగైరా. అమ్మాయిల ఆ కలలను నిజం చేసే జ్యూయెలరీ బ్రాండే మోర్తంత్ర (అహ్మదాబాద్). రత్నాల జిలుగులే ఈ బ్రాండ్ ఐడెంటిటీ. పెళ్లి కూతురి కోసం డిజైన్ చేసే నగలే మోర్తంత్ర బ్రాండ్ వాల్యూ. ఈ ఆభరణాలతో ఆ ఆనంద ఘట్టాలను సెలబ్రేట్ చేస్తుంది.. మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలుగా పదిలపరస్తుందీ బ్రాండ్. డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ : లెహెంగా బ్రాండ్: పౌలమి అండ్ హర్ష్ ధర:రూ. 61,900 జ్యూయెలరీ బ్రాండ్: మోర్తంత్ర ఇయర్ రింగ్స్ ధర: రూ. 5,500 ఉంగరం ధర: రూ. 3,500 ‘మనసు పెడితే రోజూ కొత్తగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండొచ్చు! సినిమా నా డ్రీమ్. కాకపోతే అది ఇంత త్వరగా .. ఇంత ఈజీగా నెరవేరుతుందని అనుకోలేదు’– శ్రీనిధి శెట్టి. ∙దీపిక కొండి చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత.. -
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన కేజీయప్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు భాషపై పట్టు సాధించానని, త్వరలోనే టాలీవుడ్ తప్పకుండా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన శ్రీనిధి కేజీయఫ్ తొలి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటింది. దీంతో కేజీయఫ్ చాప్టర్ 2పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న వచ్చిన కేజీయఫ్ 2 అంచనాలను మించి సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళు చేసి 1000 కోట్ట క్లబ్‌లోకి చేరువలో ఉంది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ వరసగా ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తోంది. దీంతో ఆమె బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్ ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధికి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానని పేర్కొంది. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని పేర్కొంది. చదవండి: సూర్యపేటలో అనుపమ సందడి, షాకిచ్చిన ఫ్యాన్స్ -
కేజీఎఫ్ 2కు కోట్లల్లో కలెక్షన్లు, రెమ్యునరేషన్ కూడా కోట్లల్లోనే!
'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్..' కేజీఎఫ్ 2లోని పాపులార్ డైలాగ్ ఇది. రీల్ లైఫ్‌లోని డైలాగ్ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఇదిగో ఇలా మారిపోయింది.. 'రికార్డ్స్, రికార్డ్స్, రికార్డ్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ రికార్డ్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్' అనేలా తయారైంది పరిస్థితి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లకు పైగా రాబట్టింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2లో నటించిన తారలకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్ యశ్ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు, రవీనా టండన్ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడట! చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్ హీరోతో డేటింగ్, కామెంట్ డిలీట్ చేసిన బిగ్‌బీ మనవరాలు -
KGF-2: ‘సలాం రాఖీ భాయ్’అదిరిపోయిన స్టిల్స్
-
సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ
కేజీఎఫ్.. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సీక్వెల్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కేజీయఫ్ 2' అనే చెప్పవచ్చు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది.. కేజీఎఫ్ సీక్వెల్‌గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్టర్2`గురువారం(ఏప్రిల్14)న ప్రేక్షకుల మందుకు వచ్చింది. స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. మరి ఈ చిత్రం 'కేజీఎఫ్' రేంజ్లో సక్సెస్ సాధించిందా? లేక అంతకుమించి ఆకట్టుకుందా? `కేజీఎఫ్ ఛాప్టర్2`పై ఆడియెన్స్ ఓపీనియన్ ఏంటి అన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూలో తెలుసుకుందాం. -
‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : కేజీయఫ్ చాప్టర్ 2 నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, ఈశ్వరీరావు, రావు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్ నిర్మాత:విజయ్ కిరగందూర్ దర్శకుడు: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫి: భువన్ గౌడ విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్ 2 ఒకటి. 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్ . దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు కల్లల్లో ఒత్తులు వేసుకొని వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్ 2 అనే చెప్పవచ్చు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడం, పార్ట్2 టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో ‘కేజీయఫ్ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్ 1 స్థాయిని కేజీయఫ్2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేజీయఫ్ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్ వాసిరాజు(అనంత్ నాగ్) చెబితే.. పార్ట్ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్ రాజ్) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్‌ను రాకీ భాయ్ (యశ్) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్’ సృష్టికర్త సూర్యవర్ధన్ సోదరుడు అధీరా(సంజయ్ దత్) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్(రవీనా టాండన్)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?. శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. 2018లో చిన్న సినిమాగా విడుదలై అతి భారీ విజయం సాధించిన చిత్రం ‘కేజీయఫ్’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదగడం.. ఇలా కేజీయఫ్ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కేజీయఫ్ చాప్టర్ 2లో చూపించారు. కేజీయఫ్ మాదిరే పార్ట్2లో హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 2లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో రాకీభాయ్ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్, ఇయత్ ఖలీల్‌తో జరిపిన డీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ‘కేజీయఫ్’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో మలచుకోలేకపోయాడు. కేజీయఫ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్, అధిరాకు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. అలాగే అతని నేపథ్యం కూడా సినిమాలో చూపించలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్ సెంటిమెంట్ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు.ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్ చెబుతాడు. కేజీయఫ్2లో యశ్ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు యశ్ తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అధీరగా సంజయ్ దత్ ఫెర్పార్మెన్స్ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్ దత్‌కి కేన్సర్ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రకి రవీనా టాండన్ న్యాయం చేసింది. రావు రమేశ్, ఈశ్వరి భాయ్, ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రవి బస్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'కేజీఎఫ్2' మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)
-
ప్రభాస్ కోసం కేజీఎఫ్ భామను రంగంలోకి దింపిన డైరెక్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ కూడా ఒకటి. ఈ పాన్ ఇండియా సినిమాలో తొలిసారిగా ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం. అయితే ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ సినిమాలో ప్రభాస్‌తో స్పెప్పులేసేందుకు కేజీఎఫ్ భామ శ్రీనిధీ శెట్టిని రంగంలోకి దింపుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ భామతో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసింది చిత్ర బృందం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సలార్‌లో ఈ స్పెషల్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. నెక్స్ట్ షెడ్యూల్లోనే ఈ కన్నడ భామతో ప్రభాస్ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉండనుందట. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదట పెట్టనున్నారని సమాచారం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. చదవండి : ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
ప్రభాస్‌తో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి స్టెప్పులు
ఎంత పెద్ద ‘బాహుబలి’లాంటి సినిమా అయినా మనోహరమైన స్పెషల్ సాంగ్ ఉంటే ఓ కనువిందు. ఆ సినిమాలో ప్రభాస్‌తో ఇద్దరు భామలు కలసి స్టెప్పేసిన ‘మనోహరా..’ పాట ఐటమ్ సాంగ్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘సలార్’లోనూ ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. అయితే ఇందులో ఇద్దరు కాకుండా ప్రభాస్‌తో ఒకే ఒక్క బ్యూటీ కాలు కదుపుతారట. ఆ బ్యూటీ ఎవరంటే ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి అని సమాచారం. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ‘సలార్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనిధి డ్యాన్సింగ్ స్కిల్ గురించి ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ‘సలార్’లో ప్రత్యేక పాటకు తీసుకోవాలనుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ ప్రత్యేక పాట వార్త నిజమేనా? చూడాలి. చదవండి: పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? మహేశ్‌బాబుకు జోడీగా శ్రీదేవి కూతురు! -
డిసెంబర్లో షురూ
విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే డిసెంబర్ నుంచి చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తారట. సుమారు 25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిసింది. ‘కోబ్రా’ చిత్రాన్ని చాలా వరకూ రష్యాలో షూట్ చేశారు. మిగిలి ఉన్న కొంత భాగాన్ని చెన్నైలో రష్య సెట్స్‌ను వేసి షూట్ చేస్తారన్నది తాజా సమాచారం. థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
ఫైట్స్ బ్యాలెన్స్ గురూ
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 2’. 2018లో వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. యశ్ ఈ చిత్రంలో రాMీ భాయ్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాకు సంబంధించి రెండే రెండు ఫైట్స్ మినహా టాకీ పార్టు ఆల్మోస్ట్ పూర్తయిందని శాండిల్‌వుడ్ సమాచారం. ఇక కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఈ బ్యాలెన్స్ షూట్లో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించాల్సి ఉంది. ఒక ఫైట్ యశ్, సంజయ్‌దత్‌ల మధ్య ఉంటుంది. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా ‘కేజీఎఫ్:చాప్టర్’ 2 చిత్రాన్ని అక్టోబరు 23న విడుదల చేయాలనుకుంటున్నారు. -
దసరాకు రాకీ భాయ్ వస్తున్నాడు
రెండేళ్ల క్రితం వెండితెరపై రాకీ భాయ్ సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు తెలిసింది. ఇప్పుడు రాకీ భాయ్ మళ్లీ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 2’. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో రాకీ పాత్రలో నటించారు యష్. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘అధీర పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్, రవీనాటాండన్, యశ్‌లపై చిత్రీకరించిన సన్నివేశాలతో ఈ సినిమా మేజర్ షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ గౌడ కెమెరామేన్. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. -
లక్కీ చాన్స్
కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్ కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్‌ని ఇచ్చింది. కానీ ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలేం రాలేదు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్ సినిమా కావడంతో శ్రీనిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ అద్భుత అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కోలీవుడ్ ఎంట్రీకి దారి చూపింది. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధిని తీసుకున్నారు. ‘‘విక్రమ్ సార్‌తో నటించే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అజయ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీనిధి. -
విక్రమ్‌తో కేజీఎఫ్ హీరోయిన్?
తమిళ సినిమా: కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఇప్పుడు కోలీవుడ్ పిలుస్తోంది. చియాన్ విక్రమ్‌తో జతకట్టే అవకాశం ఆమె ముంగిట వాలిందనేది తాజా సమాచారం. ప్రయోగాలకు బ్రాండ్అంబాసిడర్ నటుడు విక్రమ్ అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పాత్రల కోసం ఎంత వరకైనా వెళ్లే విక్రమ్ కడారం కొండాన్ చిత్రం తరువాత కొత్త చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన ఇమైకా నొడిగళ్ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై నిర్మాత లలిత్‌కుమార్ వైకం 18 స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమై సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ఇందులో నటుడు విక్రమ్ పలు గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అదేవిధంగా దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా తెరరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాభవానీశంకర్‌ను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఆమె ఇండియన్–2లో కమల్ హాసన్‌తో, ఎస్జే.సూర్యకు జంటగా కొత్త చిత్రం అంటూ పలు చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ప్రియాభవానీశంకర్ విక్రమ్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి అని తెలిసింది. దీంతో తాజాగా నటి శ్రీనిధిశెట్టిని విక్రమ్‌కు జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ కన్నడంలో ఆ మధ్య తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ చిత్రంలో నాయకిగా నటించిందన్నది గమనార్హం. కన్నడంలో మంచి స్టార్‌గా రాణిస్తున్న శ్రీనిధిశెట్టిని ఇప్పుడు కోలీవుడ్‌కు దిగుమతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమ్‌కు జంటగా ఆమెను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా ఇది నటుడు విక్రమ్‌కు 58వ చిత్రం అవుతుంది. దీనికి శివకుమార్ విజయన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
నువ్వు ఊర మాస్ అంటే హ్యాపీగా అనిపించింది
‘‘వందకోట్ల సినిమాలను చేసే సత్తా అన్ని ఇండస్ట్రీలకు ఉంటుంది. ప్రేక్షకులు పెరిగారు. కన్నడ ఇండస్ట్రీ చిన్నదంటే నాకు కోపం వస్తుంది. బాధగా ఉంటుంది. సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాతలను నేను అడగను. పార్కింగ్ క్రౌడ్‌ని మాత్రమే చూస్తాను. నా సినిమా చూసి ఆడియన్స్ హ్యాపీ అంటే అదే నా విజయంగా ఫీల్ అవుతాను’’ అన్నారు నటుడు యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదలైంది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అనువదించి, విడుదల చేశారు. గురువారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో యశ్ మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్‌గారు అభిమానులు దేవుళ్లు అనేవారు. ఆ విషయం నాకు మళ్లీ గుర్తొచ్చింది. నేను ఎవరికీ తెలీదు. నా సినిమాను చూసి నాకు వెల్కమ్ చెప్పిన తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. పదేళ్ల క్రితం నా వర్క్‌ని చూసి కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు తెలుగువారు సపోర్ట్ చేశారు. తెలుగు కాంప్లిమెంట్స్ స్పెషల్‌గా ఉంటాయి. ఒకచోట ‘అన్నా నువ్వు ఊర మాస్’ అన్నారు. ఆనందంగా అనిపించింది. నిర్మాత విజయ్ కిరంగదూర్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సెట్లోకి వచ్చిన మూడో రోజే సినిమాను రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇలాంటి ఒక సినిమాకు మంచి పొజిషన్ దొరక్కపోతే ఆడియన్స్‌కు రీచ్ అవ్వదు. ఆ పనిని బాగా చేసిన సాయికొర్రపాటి అన్నకు ధన్యవాదాలు. రాజమౌళిగారు ఉన్న స్థాయికి మా సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మా సినిమా గురించి మంచిగా మాట్లాడినప్పుడు భయపడ్డాను. ఆ అంచనాలను అందుకుంటానా? అని. సినిమాపై నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కేజీ రామారావుగారు గైడ్ చేస్తూనే కంట్రోల్ చేశారు. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిదే కాదు. టీమ్ అందరిదీ. తెలుగు హీరోల సినిమాలు చూసి నేను మరింత బాగా తెలుగు నేర్చుకుంటాను. కేజీఎఫ్ రెండో పార్ట్ మరింత బాగా రావడానికి కష్టపడతాను’’ అన్నారు. ‘‘కేజీఎఫ్’ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు. కర్ణాటక గోల్డెన్ హిట్. సక్సెస్ సాధించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు హ్యాపీ’’ అన్నారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కేజీ రామారావు. రచయిత హనుమాన్, కెమెరామెన్ భువన్ గౌడ మాట్లాడారు. నిర్మాత సాయి కొర్రపాటి పాల్గొన్నారు. -
కేజీఎఫ్ అంటే?
యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కె.జి.ఎఫ్’. తమన్నా ఓ ప్రత్యేక పాటలో నటించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగధూర్ నిర్మించారు. చిత్ర సహనిర్మాత కైకాల రామారావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం రీ–రికార్డింగ్ జరుపుకుంటోంది. సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అక్టోబరు 14న ట్రైలర్, నవంబరు 16న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అమెరికా–రష్యాకు మధ్య జరిగిన యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడంతో మనుషుల్లో అత్యాశ పెరిగింది. అదే సమయంలో ‘కె.జి.ఎఫ్’ (కోలార్ బంగారు గనులు) భారత దేశంలోనే అతిపెద్ద బంగారు గని. అది ఒక్క మనిషి చేతిలోకి వెళితే ఏమవుతుంది? అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఫస్ట్ పార్టుగా రూపొందిస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ నీల్. ‘‘1970 కాలంలో జరిగిన మాఫియా నేపథ్యంలో జరిగిన కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు విజయ్ కిరగంధూర్. ఈ చిత్రానికి కెమెరా: భువన్ గౌడ, సంగీతం: రవి భసూర్. -
చేపల కూర అంటే మహా ప్రియం!
► కన్నడిగుళ్లంటే ప్రాణం ► మంగళూరు సుందరి, మిస్ సుప్రా నేషనల్ కిరీట ధారిణి శ్రీనిధి శెట్టి బెంగళూరు: తనకు చేపల కూర అంటే చాలా ఇష్టమని అదేవిధంగా కన్నడిగుళ్లంటే ప్రాణమని మిస్ సుప్రా నేషనల్ కిరీటాన్ని గెలుచుకున్న మంగళూరు బ్యూటీ శ్రీనిధి శెట్టి అన్నారు. పనామాకు చెందిన విశ్వబ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్ సుప్రా 2016 నేషనల్ కిరీటాన్ని సొంత చేసుకున్న ఆమె శనివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు భారతీయ వస్త్రధారణ, అందులోను లంగా, ఓణి, చీర ధరించడం ఎంతో ఇష్టమన్నారు. పనామాకు చెందిన విశ్వబ్యూటీ అసోసియేషన్ సంస్థతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్ల చెప్పారు. ఇది పూర్తి అయిన అనంతరం మోడలింగ్, సినిమాల్లో అవకాశాలు లభిస్తే తన కార్యక్రమాలు విస్తరిస్తానని తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు మోడలింగ్ అంటే ఇష్టమని ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్, లారాదత్తా తనకు స్ఫూర్తి అన్నారు. మిస్‌సుప్రా నేషనల్ కిరీటం దక్కడం తాను కలలో కూడా ఊహించలేదన్నారు. బెంగళూరు జైన్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను రెండేళ్ల పాటు బెంగళూరులోని ఆక్సెంచర్ కంపెనీలో పనిచేశానన్నారు. తాను ఎటువంటి ఆహారం తీసుకున్నా బరువు పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు మంగళూరు సందరి శ్రీనిధి. -
బెంగళూరు భామకు అందాల కిరీటం
పోలెండ్‌లో మిస్ సుప్రాగా ఎంపిక సాక్షి, బెంగళూరు: బెంగళూరుకు చెందిన అందాల భామ శ్రీనిధి రమేష్ శెట్టి ’మిస్ సుప్రా నేషనల్–2016’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. పోలెండ్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన భామలను వెనక్కునెట్టి ఈ అందాలరాశి కిరీటాన్ని అందుకుంది. శ్రీనిధి బెంగళూరులో ఉన్నప్పటికీ ఆమె జన్మస్థలం మంగళూరు. ఆమె తల్లిదండ్రులు మంగళూరుకు చెందిన రమేష్ శెట్టి, కుషలా శెట్టిలు. ఇక శ్రీనిధి బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మంగళూరులో సాగింది. బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ కాలేజీలో ఇంజనీరింగ్‌ను చదివారు. బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలో రెండేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం విశేషం. అటు పై మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆసక్తితో మోడల్‌గా మారి అనేక అందాల పోటీల్లో శ్రీనిధి పాల్గొంది.