KGF Heroine Srinidhi Shetty Hikes Her Remuneration Double - Sakshi
Sakshi News home page

Srinidhi Shetty: భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన కేజీయఫ్‌ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్‌

May 30 2022 4:22 PM | Updated on May 30 2022 6:00 PM

KGF Heroine Srinidhi Shetty Hikes Her Remuneration Double - Sakshi

అంతేకాదు కేజీయఫ్‌ 2 సక్సెస్‌ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెను హోస్ట్‌ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

కేజీయఫ్‌ సీరిస్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్‌గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్‌ చిత్రం ఆఫర్‌ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్‌ ఇండియా కావడం, అది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్‌ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు.

చదవండి: బెంగాలీ మోడల్స్‌ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్‌ సూసైడ్‌ కలకలం

సౌత్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ల  తీసుకునే రెమ్యునరేషన్‌కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్‌ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్‌ 2 సక్సెస్‌ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెను హోస్ట్‌ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్‌ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement