బెంగాలీ మోడల్స్‌ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్‌ సూసైడ్‌ కలకలం

Another Bengali Model Saraswati Das Commits Suicide in Kolkata - Sakshi

Bengali Model Saraswati Das Suicide in Kolkata: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్‌(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్‌ మృతి చెందండం సంచలనంగా మారింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది.  కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరు లేకోపవడంతో రాత్రి తన అమ్మమ్మతో కలిసి పడుకుంది సరస్వతీ దాస్‌.

చదవండి: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య

ఈ క్రమంలో తెల్లవారు జామున 2 గంటల పాత్రంలో సరస్వతి పక్కన లేకపోడంతో ఆమె అమ్మమ్మ ఇల్లంతా వేతికగా మరో గదిలో ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె అమ్మమ్మ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించగా అప్పటికే సరస్వతీ దాస్‌ మారణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా కొంతకాలంగా తన తండ్రికి దూరంగా తల్లితో కలిసి వాళ్ల మేనమామ ఇంట్లో ఉంటోంది సరస్వతీ దాస్‌. మాధ్యామిక్‌ పరీక్షలో పాసయిన ఆమె చదువు విడిచిపెట్టి ట్యూషన్స్‌ చెబుతూ మోడల్‌గా రాణిస్తోంది. అయితే సరస్వతీ దాస్‌ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల తెలిపారు.

చదవండి: మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి షాకింగ్‌ విషయాలు చెప్పిన హీరో

అంతేకాదు ఆత్మహత్యకు ముందు అర్థరాత్రి 1గంట వరకు ఆమె ఫోన్‌ మాట్లాడినట్లుగా తన ఫోన్‌ రికార్డులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్న చోట ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరస్వతీ దాస్‌ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు జరపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌కు చందిన నటి, మోడల్‌లు ఇలా వరుసగా ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు బెంగాలి మోడల్స్‌ ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా సరస్వతీ దాస్‌ అదే తరహాలో మరణించడం గమనార్హం. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top