ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఐపీఎల్ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు.. ఎట్టకేలకు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ గ్రీస్‌లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే వెడ్డింగ్ డేట్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు.
అయితే ఈ జంట రిసెప్షన్ వేడుక తేదీని ముందే ఫిక్స్ చేశారు. వచ్చేనెల 21 చెన్నైలో జరగనుందని ముందే ప్రకటించారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను సైతం తమ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిసెప్షన్ వేడుకకు సంబంధించిన కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ కార్డ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ రిసెప్షన్ కార్డ్ కోసం ఏకంగా మూడున్నర నెలల పాటు కష్టపడ్డారని టాక్. ఈ కార్డ్‌ను 'పింక్ విజిల్ మ్యాన్' రంజని అయ్యంగార్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రికను క్లాసిక్ బరోక్ స్టైల్లో తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పత్రికను మొత్తం చేతితోనే రూపొందించారన చెబుతున్నారు. ఇలా చేసిన ఒక్కో కార్డు ధర దాదాపు రూ.15-20 వేల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కూడా సెలబ్రిటీలే కావడంతో తమ జీవితకాలం గుర్తుండిపోయే మధురమైన వేడుకను గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.



