‘పవర్ పేట’లో పడమట వీధి జానకిగా మారిపోయారు రితికా నాయక్. సందీప్ కిషన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పవర్ పేట’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.
మంగళవారం రితికా నాయక్ బర్త్ డే సందర్భంగా ‘పవర్ పేట’లోని పడమట వీధి జానకి అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు వెల్ల డించి, ఈ పాత్ర తాలూకు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు రితిక. ‘‘ప్రేమ, గౌరవం, రాజకీయం వంటి అంశాల కలయికతో ఈ సినిమా కథ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.


