విమర్శించినవారే క్షమాపణలు చెబుతారు: సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ | AR Rahman on Ramayana music backlash: They criticise and then apologise | Sakshi
Sakshi News home page

విమర్శించినవారే క్షమాపణలు చెబుతారు: సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌

Oct 28 2026 3:14 AM | Updated on Oct 28 2026 3:14 AM

AR Rahman on Ramayana music backlash: They criticise and then apologise

‘రామాయణ’ సినిమాకు నిజాయతీగా పని చేశానని, సంగీతం విషయంలో వస్తున్న విమర్శలను పట్టించుకోనని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ అన్నారు. నితీష్‌ తివారీ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘రామాయణ’ (తెలుగులో ‘రామాయణం’). ఈ సినిమాకు ఏఆర్‌ రెహమన్, హన్స్‌ జిమ్మర్‌ ద్వయం సంగీతం అందించారు. ‘రామాయణ’ సినిమా నుంచి ఇప్పటికే ‘రావణ తాండవ్‌’, ‘రంగులు రంగులే..’ పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ పాటల పట్ల కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. 

ఈ అంశంపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. ‘‘సంగీత దర్శకులుగా మేం చాలా పని చేస్తాం. ట్యూన్స్‌లో పదే పదే మార్పులు చేస్తుంటాము. మా పని మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇతరుల కామెంట్స్‌ని కూడా చూసేందుకు మాకు ఓపిక ఉండదు. ఒక పాటను ఎన్నోసార్లు విని, సంతృప్తి చెందిన తర్వాతే ఆ పాటను రిలీజ్‌ చేస్తాం. ‘నిన్న విమర్శించిన వాళ్లే... ఈ రోజు క్షమాపణలు చెబుతారని మా అబ్బాయి నాతో అంటుంటాడు. నేను మాత్రం నా పనిని నిజాయతీగా చేశాను. ప్రజలు నా పనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ ప్రారంభంలో నేను అందించిన పాటల తరహా సంగీతాన్నే మళ్లీ చేయాలన్నట్లుగా కొందరు కోరుకుంటున్నారు. కానీ ఒకే తరహా సంగీతానికి పరిమితం కావడం నాకు ఇష్టం లేదు’’ అని ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు.  ఇక ‘రామాయణ’ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్‌ నటించారు. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మించిన ‘రామాయణ’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని నవంబరు 5న, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement