రణ్‌బీర్ కపూర్ రామాయణ.. స్పెషల్ మేకింగ్ వీడియో చూశారా? | Namit Malhotra Ramayana Vision of Ramayana Teaser out now | Sakshi
Sakshi News home page

Vision of Ramayana Teaser: రణ్‌బీర్ కపూర్ రామాయణ.. స్పెషల్ వీడియో రిలీజ్

Oct 27 2026 9:02 PM | Updated on Oct 27 2026 9:02 PM

Namit Malhotra Ramayana Vision of Ramayana Teaser out now

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా పార్ట్-1 ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా వచ్చేనెల 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే పాటలు రిలీజ్‌ చేసిన టీమ్.. మరో వీడియోను పంచుకుంది. విజన్‌ ఆఫ్‌ రామాయణ టీజర్‌ పేరిట వీడియోను విడుదల చేసింది. ఇందులో రామాయణ మూవీ సెట్, మేకింగ్ విజువల్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. మరెందుకు ఆలస్యం ఈ స్పెషల్ వీడియోనూ మీరు కూడా చూసేయండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement