నేవీ బ్లూ బనారసి చీరలో చందమామలా సాయిపల్లవి! | Sai Pallavi turned heads in Chennai in a navy blue Banarasi Katan silk saree | Sakshi
Sakshi News home page

Sai Pallavi: నేవీ బ్లూ బనారసి చీరలో చందమామలా సాయిపల్లవి!

Oct 22 2026 1:21 PM | Updated on Oct 22 2026 1:38 PM

Sai Pallavi turned heads in Chennai in a navy blue Banarasi Katan silk saree

చెన్నైలో జరిగిన రామాయణ మూవీ ప్రమోషన్స్‌లో నటి సాయిపల్లవి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో సాయిపల్లవి నేవి బ్లూ బనారసీ పట్టు చీరలో తళుక్కుమన్నారు. సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ..ముదురు నీలం రంగు చీరలో అచ్చం సీతమ్మలా అద్భుతంగా కనపించింది. చేనేత వారసత్వాన్ని చాటి చెప్పేలా బనారసి పట్టు చీరలో మెరిసిందామె. అంతేగాదు కాలాతీ సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచింది. 

చీర మిగిలిన భాగంలో వెండి బుటీలు, మోచేతుల వకు ఉన్న బ్లౌజ్‌తో అందర్నీ కట్టిపడేసింది. క్లాసిక్‌ ఓపెన్ పల్లు, దానిపై చక్కగా అలంకరించిన కుచ్చలతో ముగ్ధమనోహరంగా ఉందా ఆ చీర. ఎరుపు, ఆకుపచ్చ రాళ్లు, ముత్యాలతో కలగలసిన కంఠాభరణం ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. చెప్పాలంటే పర్ఫెక్ట్‌ ట్రెడిషనల్‌ ఫ్యాష్యన్‌ లుక్‌గా పేర్కొనచ్చు. అలాగే కురులను రింగురింగులుగా వదులుగా వదిలేసిందామె. అలాగే ఎప్పటిలానే నేచరుల్‌గా కనిపించేలా తేలికైన మేకప్‌తో సహజసిద్ధమైన ఆహార్యంతో ఆకట్టుకుంది. 

కాగా, నమిత్ మల్హోత్రా దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మంథరగా షీబా చద్దా, రావణుడిగా యశ్, మండోదరిగా కాజల్ అగర్వాల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.

 

ఇదీ చదవండి: రూ. 3 లక్షల అనార్కలీ డ్రెస్‌లో కరిష్మా రాయల్‌ లుక్‌..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement