రూ. 3 లక్షల అనార్కలీ డ్రెస్‌లో కరిష్మా రాయల్‌ లుక్‌..! | Fashion Tips: Karisma Kapoors Yellow Anarkali Set Worth Rs 3 Lakh | Sakshi
Sakshi News home page

రూ. 3 లక్షల అనార్కలీ డ్రెస్‌లో కరిష్మా రాయల్‌ లుక్‌..!

Oct 22 2026 9:21 AM | Updated on Oct 22 2026 9:23 AM

Fashion Tips: Karisma Kapoors Yellow Anarkali Set Worth Rs 3 Lakh

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ నాలుగు పదుల వయసులో కూడా అంతే గ్లామరస్‌గా ఉంటారామె. యువ హీరోయిన్లకు తీసుపోని విధంగా ఆకర్షణీయంగా ఉంటుందామె. ముఖ్యంగా ఫ్యాషనే ఐకాన్‌గా విలక్షణమైన డిజైనర్‌ వేర్‌లతో మెరుస్తుంటుంది. ఈసారి కరిష్మా ఆవాల పసుపు రంగు అనార్కలీలో రాయల్‌గా మెరిసింది. ఆమె ధరించిన డ్రైస్‌ పండుగ వాతావరణ్నా తీసుకొచ్చినట్లుగా ట్రెడిషనల్‌ వైబ్స్‌ని సృష్టిస్తోంది. 

పసుపు చందేరీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌చేసి అనార్కలీకి పాన్-పాట్ నెక్లైన్, పూర్తి చూడీస్లీవ్‌లు ఉన్నాయి. ఈ డ్రెస్‌పై క్లిష్టమైన జర్దోజీ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా నిలిచింది. దీనికి తోడు గులాబీ, ఊదా, నారింజ, ఆకుపచ్చ రంగుల సొబగులతో రూపిందించిన రేషమ్‌ పూల మోటిఫ్‌లు ఆ డ్రెస్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. పైభాగం పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసి ఉంది. ఇక దానికి మ్యాచింగ్‌ దుప్పటాపై ఎంబ్రాయిడరీ బోర్డర్‌ ఉండి, చేతితో తయారు చేసిన క్రోచెట్‌పూలతో అలంకరించిన టాసెల్స్‌ ఉన్నాయి. 

ఈ అందమైన అనార్కలీ డ్రెస్‌కి అనుగుణంగా గులాబీరంగు లేయర్డ్‌ స్టేట్‌మెంట్‌ నెక్లెస్‌ ధరించింది. ఇది మెడపై చక్కగా అమరడమే కాదు, దానికి మ్యాచింగ్‌గా ధరించి చెవిపోగులు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. అలాగే జుట్టుని ఒదులుగా వదిలేసి, తేలికైన మేకప్‌తో దేవకన్యలా మెరిసింది కరిష్మా. అంతేగాదు కరిష్మా లుక్‌ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతున్నట్లుగా ఉంది. చెప్పాలంటే కరిష్మా ఆహార్యం పండుగ సీజన్‌కు పర్ఫెక్ట్‌​ లుక్‌గా పేర్కొనచ్చు. 

 

ఇదీ చదవండి: అక్కడ మగవాళ్లు చీరలు ధరించి గర్బా నృత్యం..! 200 ఏళ్ల నుంచి ఇప్పటికీ..
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement