మూడోసారి తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి?! | Is Virat, Anushka Set to become parents for 3rd time? Rumours Viral | Sakshi
Sakshi News home page

మూడోసారి తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి?!

Oct 28 2026 3:13 PM | Updated on Oct 28 2026 3:29 PM

Is Virat, Anushka Set to become parents for 3rd time? Rumours Viral

సెలబ్రిటీ జంటల్లో టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి- నటి అనుష్క శర్మ దంపతులకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డేటింగ్‌ నుంచి మొదలైన ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించిన విరుష్క జోడీ.. ఎప్పటికప్పుడు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తూనే ఉంటారు.

పిల్లల పెంపకం విషయంలోనూ
ఇక పిల్లల పెంపకం విషయంలోనూ ఒక్కటిగా ముందు సాగుతున్న విరాట్‌- అనుష్క.. వారిని ఇప్పటి వరకు మీడియా కంటపడకుండా కాపాడుకుంటున్నారు. తమ పిల్లలు సామాన్యుల మాదిరే బాల్యాన్ని ఆస్వాదించాలని, సోషల్‌ మీడియా, మీడియా ప్రభావం వారిపై పడకూడదనే ఉద్దేశంతో లండన్‌కు మకాం మార్చారు.

అందుకే లండన్‌కు
అక్కడ సాధారణ పౌరుల్లాగే పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లడం.. కెమెరాల గోల లేకుండా నచ్చినట్లుగా ఉండటం కోసం విరుష్క ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల విరాట్‌- అనుష్క ముంబైకి వచ్చారు. అమెరికా సింగర్‌ కృష్ణ దాస్‌ లైవ్‌ కీర్తన్‌కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అనుష్క కృష్ణ దాస్‌ గానాన్ని ఆస్వాదిస్తూ.. ఆనందంలో తేలిపోయింది. విరాట్‌ మాత్రం కాస్త నిశ్శబ్దంగానే కూర్చుని ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీరిద్దరు గేట్‌ వే ఆఫ్‌ ఇండియాను సందర్శించారు.

మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ
ఈ నేపథ్యంలో కోహ్లి దంపతులు మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. అనుష్క శర్మ నిండైన చుడిదార్‌ వేసుకుని ఈ కార్యక్రమానికి రాగా.. ఆమెను చూస్తుంటే ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నారని.. త్వరలోనే మరో బుజ్జి కోహ్లి లేదంటే అనుష్క రాబోతున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలు
కాగా దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న విరాట్‌- అనుష్క 2017లో ఇటలీలో ఘనంగా వివాహం చేసుకున్నారు. తొలి సంతానంగా 2021లో కుమార్తె వామిక జన్మించగా.. 2024లో కుమారుడు అకాయ్‌కు విరుష్క జన్మనిచ్చారు. అయితే, వామిక పుట్టినపుడు ముందుగానే విరాట్‌- అనుష్క ప్రెగ్నెన్సీ గురించి రివీల్‌ చేశారు.

అయితే, అనుష్క రెండోసారి గర్భం దాల్చినపుడు విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లండన్‌లో అకాయ్‌ జన్మించిన తర్వాత తమకు కొడుకు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. 

అయితే, ప్రస్తుతం మూడోసారి అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌ అంటూ గాసిప్‌రాయుళ్లు ప్రచారం చేస్తుండగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం ధరించిన డ్రెస్‌ కారణంగానే అనుష్క అలా కనిపించి ఉండవచ్చని కొట్టిపారేస్తున్నారు.

ఇవీ చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు 3 అపార్టుమెంట్లు కొన్న విరుష్క
కోహ్లి కాదు!.. రొనాల్డో ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్‌ అతడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement