సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించాడు. నాలుగేళ్లకు పైగా భారత స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా అధిరోహించిన అగ్రపీఠాన్ని కదిలించి, సరికొత్త ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.
జడేజా 2022 మార్చి నుంచి టెస్టు నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతూ వచ్చాడు. ఆయన ఆధిపత్యానికి యాన్సెన్ తెరదించాడు. జడేజా అగ్రస్థానంలో గడిపిన మొత్తం కాలం 1,694 రోజులు కాగా, వరుసగా 1,151 రోజులు నంబర్ వన్‌గా కొనసాగాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో యాన్సెన్ 451 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, జడేజా 422 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.
ఒకేసారి రెండు అగ్రస్థానాలు
యాన్సెన్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనే కాకుండా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా అవతరించాడు. ఈ విభాగంలో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్‌ను రెండో స్థానానికి నెట్టాడు. అలాగే టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ 13 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్థానానికి చేరాడు.
ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో యాన్సెన్ అసాధారణ ప్రదర్శన చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగి 100 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అనంతరం బంతితోనూ చెలరేగి 33 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనే యాన్సెన్‌ను టెస్టు క్రికెట్‌లో అగ్రస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
రెండో స్థానానికి బవుమా
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో 334 బంతుల్లో 179 పరుగులు చేసిన అతడు, టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్‌లోనే అత్యుత్తమమైన రెండో ర్యాంకుకు చేరాడు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ టాప్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఇదీ చదవండి: సౌతాఫ్రికాతో టెస్టు.. చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్


