చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. 60 ఏళ్ల రికార్డు బ్రేక్‌ | Marco Jansen Achieves Historic Feat For South Africa In Tests | Sakshi
Sakshi News home page

AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. 60 ఏళ్ల రికార్డు బ్రేక్‌

Oct 21 2026 8:41 PM | Updated on Oct 21 2026 8:59 PM

Marco Jansen Achieves Historic Feat For South Africa In Tests

సెయింట్ జార్జ్ పార్క్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన జాన్సెన్.. అనంత‌రం బౌలింగ్‌లోనూ స‌త్తాచాటాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 

ఈ స‌మ‌యంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన జాన్సెన్ కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి జ‌ట్టును ఆదుకున్నాడు. కేవలం 100 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 85 పరుగులు చేశాడు. సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయినప్పటికీ జాన్సెన్ ఓ అరుదైన ఘ‌న‌తను పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వ‌దేశంలో జ‌రిగిన టెస్టుల్లో సౌతాఫ్రికా త‌ర‌పున నంబ‌ర్ 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా జాన్సెన్ నిలిచాడు.

ఇంతకుముందు ఈ రికార్డు పీటర్ వాన్ డెర్ మెర్వె పేరిట ఉంది. 1966లో జోహన్నెస్‌బర్గ్‌లో వాన్ డెర్ మెర్వె 76 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 60 ఏళ్ల రి​కార్డును  జాన్సెన్ బ్రేక్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో జాన్సెన్‌తో పాటు టెంబా బవుమా(179) భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425-9 వద్ద డిక్లేర్‌ చేసింది.

99 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌
అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులే కుప్పకూలింది. మార్కో యాన్సెన్ (5/33) ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించగా, కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
చదవండి: AUS vs SA: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఘనత.. స్టీవ్‌ వాకు కూడా సాధ్యం కాలేదు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement