స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఘనత.. స్టీవ్‌ వాకు కూడా సాధ్యం కాలేదు! | Steve Smith achieves rare milestone in second SA vs AUS Test | Sakshi
Sakshi News home page

AUS vs SA: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఘనత.. స్టీవ్‌ వాకు కూడా సాధ్యం కాలేదు!

Oct 21 2026 6:34 PM | Updated on Oct 21 2026 6:56 PM

Steve Smith achieves rare milestone in second SA vs AUS Test

PC: X

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్‌ 11,000 ప‌రుగుల మైలు రాయిని అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఈ ఫీట్‌ను అందుకున్న మూడో ఆస్ట్రేలియా బ్యాట‌ర్‌గా స్మిత్ రికార్డుల‌కెక్కాడు. 

అత‌డి కంటే ముందు రికీ పాంటింగ్ (13,378 పరుగులు), అల్లన్ బోర్డర్ (11,174 పరుగులు) మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు.  స్టీవ్ వా, డేవిడ్ వార్నర్, మైకెల్ క్లార్క్, మాథ్యూ హెడెన్ వంటి దిగ్గ‌జాల‌కు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు.

కాగా ఈ మ్యాచ్‌లో స్మిత్ తీవ్రమైన మెడ నొప్పితో ఇబ్బంది ప‌డుతూనే త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగించాడు.  88 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన ప‌రుగుల‌కే అత్య‌ధిక స్కోర్ కావడం గ‌మ‌నార్హం. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా పేస‌ర్లు నిప్పులు చెర‌గడంతో ఆసీస్ కేవ‌లం 99 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

మార్కో యాన్సెన్ (5/33) ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించగా, కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా (179) భారీ సెంచరీతో క‌దం తొక్కాడు.
చదవండి: IND vs NZ: పాపం వైభవ్‌ సూర్యవంశీ..! తేల్చి చెప్పిన టీమిండియా కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement