NZ Vs IND: చ‌రిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్‌ | Dhruv Jurel-History-Highest Score-Bats-No7-Or-Lower For IND-In-NZ | Sakshi
Sakshi News home page

NZ Vs IND: చ‌రిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్‌

Nov 29 2026 8:04 AM | Updated on Nov 29 2026 8:09 AM

Dhruv Jurel-History-Highest Score-Bats-No7-Or-Lower For IND-In-NZ

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా క్రికెట‌ర్ ధ్రువ్ జురెల్ చ‌రిత్ర సృష్టించాడు. 170 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 88 ప‌రుగుల వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్న ధ్రువ్ జురెల్ క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌లో సరికొత్త రికార్డు నెల‌కొల్పాడు. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టెస్టుల్లో భార‌త్ త‌ర‌ఫున‌ ఏడు లేదా ఆ త‌ర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అత్య‌ధిక స్కోరు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో జురెల్ చోటు సంపాదించాడు. 

జురెల్ ఆడిన 88 ప‌రుగుల ఇన్నింగ్స్ కివీస్ గ‌డ్డ‌పై రెండో అత్యుత్త‌మం. తొలి స్థానంలో అజింక్య ర‌హానే ఉన్నాడు. 2014లో వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో ర‌హానే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి (118 ప‌రుగులు) సెంచ‌రీ బాదాడు. తాజాగా జురెల్ 88 ప‌రుగుల‌తో రెండో స్థానంలో నిలిచాడు. 

ఇక 1981లో ఆక్లాండ్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో సయ్య‌ద్ కిర్మాణి 78 ప‌రుగులు చేసి మూడో స్థానంలో ఉండ‌గా, ఇదే సిరీస్‌లో వెల్లింగ్ట‌న్ వేదికలో జురెల్ 78 ప‌రుగులు సాధించి నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక ఐదో స్థానంలో జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ (76 ప‌రుగులు) హామిల్ట‌న్ వేదిక‌గా సాధించాడు.

కోహ్లి రికార్డు స‌మం
మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీ సాధించిన జురెల్ టీమిండియా సీనియ‌ర్ విరాట్ కోహ్లి రికార్డును స‌మం చేశాడు. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన‌ కోహ్లి ఒక సెంచ‌రీ, ఒక హాఫ్ సెంచ‌రీ సాధించాడు. తాజాగా జురెల్ కివీస్ గ‌డ్డ‌పై వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ సాధించి కోహ్లి స‌ర‌స‌న నిలిచాడు. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులోనూ జురెల్ (78 ప‌రుగులు) అర్థ‌సెంచ‌రీ సాధించాడు.

పంత్ స‌ర‌స‌న జురెల్‌
2026 ఏడాదిలో టెస్టుల్లో జురెల్‌కు ఇది నాలుగో అర్థ‌సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో ఒక అరుదైన రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. 2026లో టెస్టుల్లో అత్య‌ధిక ఫిఫ్టీ ప్ల‌స్ ఇన్నింగ్స్‌లు ఆడిన క్రికెట‌ర్ల జాబితాలో జురెల్ చోటు ద‌క్కించుకున్నాడు. ఈ జాబితాలో హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్‌), సోన‌ల్ దినూశ (శ్రీలంక‌)లు ఆరు అర్థ‌సెంచ‌రీల‌తో సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.

బాబ‌ర్ ఆజం (పాకిస్తాన్‌), లిట‌న్ దాస్ (బంగ్లాదేశ్‌) ఐదు అర్థ‌సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నారు. తాజాగా జురెల్ నాలుగు అర్థ‌సెంచ‌రీల‌తో మార్క్యూస్ అకెర్‌మ‌న్ (సౌతాఫ్రికా), న‌జ్ముల్ షాంటో (బంగ్లాదేశ్‌), రిష‌బ్ పంత్ (భార‌త్‌), ర‌హ్మ‌త్ షా (అఫ్గానిస్తాన్‌), జో రూట్ (ఇంగ్లండ్‌), బ్రెండ‌న్ టేల‌ర్ (జింబాబ్వే) స‌ర‌స‌న చేరాడు.

ఇదీ చదవండి: ఫాలోఆన్ తప్పించాడు.. అరుదైన రికార్డు బద్దలుకొట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement