Photo Credit: BCCI Twitter
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 86.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. తద్వారా న్యూజిలాండ్‌కు 110 పరుగుల ఆధిక్యం లభించింది. ధ్రువ్ జురెల్ (170 బంతుల్లో 88; 14 ఫోర్లు) వీరోచిత పోరాటంతో భారత్ ఫాలోఆన్ గండం తప్పించుకుంది.
జురెల్‌కు తోడుగా ఆకాశ్ దీప్ (52 బంతుల్లో 29) కీలక ఇన్నింగ్స్ ఆడగా, గుర్నూర్ బ్రార్ (46 బంతుల్లో 10) న్యూజిలాండ్ బౌలర్లను విసిగించాడు. ఆకాశ్ దీప్‌తో కలిసి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జురెల్.. ఆ తర్వాత బ్రార్‌తో కలిసి 64 పరుగులు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఆఖర్లో బుమ్రా (17 బంతుల్లో 4 నాటౌట్)తో కలిసి 19 పరుగులు జత చేసిన జురెల్ భారత్ స్కోరును 240 పరుగుల మార్క్‌ను దాటించాడు. అయితే జురెల్ సెంచరీ చేస్తాడని భావించినప్పటికీ, కైల్ జేమిసన్ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.
న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిసన్ 4 వికెట్లు తీయగా, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మిగిలిన భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ (23), కేఎల్ రాహుల్ (25), పడిక్కల్ (21) పర్వాలేదనిపించారు. అంతకముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది.
A knock filled with patience, grit and character, Dhruv Jurel's innings comes to an end on 88 #NZvIND | @dhruvjurel21 https://t.co/2fH0MLrq4Z
— BCCI (@BCCI) November 29, 2026
ఇదీ చదవండి: ఫాలోఆన్ తప్పించాడు.. అరుదైన రికార్డు బద్దలుకొట్టాడు


