నాలుగో గేమ్‌ ‘డ్రా’ | The draw streak continues in the World Chess Championship | Sakshi
Sakshi News home page

నాలుగో గేమ్‌ ‘డ్రా’

Nov 29 2026 2:35 AM | Updated on Nov 29 2026 2:35 AM

The draw streak continues in the World Chess Championship

జెనీవా (స్విట్జర్లాండ్‌): గుకేశ్‌ దొమ్మరాజు, జవొఖిర్‌ సిందరోవ్‌ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ సమరంలో ‘డ్రా’ల పర్వం కొనసాగుతోంది. శనివారం ఈ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన నాలుగో గేమ్‌ కూడా ‘డ్రా’గా ముగిసింది. 34 ఎత్తుల తర్వాత గేమ్‌ను సమంగా ముగించేందుకు ఇద్దరు ఆటగాళ్లు అంగీకరించారు. గుకేశ్, సిందరోవ్‌ ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడేందుకే ప్రాధాన్యనిచ్చారు. 

తెల్ల పావులతో ఆడిన గుకేశ్‌ ఉజ్బెకిస్తాన్‌ జీఎండిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. 9వ ఎత్తు తర్వాత గుకేశ్‌కు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం లభించినా... సిందరోవ్‌ తెలివిగా తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎలాంటి తడబాటు లేకుండా కొన్ని ఎత్తులు వేశారు. క్వీన్‌ ఎండ్‌ గేమ్‌కు చేరిన తర్వాత ఆట ముందుకు సాగేందుకు ఎలాంటి అవకాశం లేకపోయింది. దాంతో గుకేశ్, సిందరోవ్‌ చేతులు కలిపారు. 14 గేమ్‌ల ఈ సమరంలో ప్రస్తుతం 2–2తో స్కోరు సమంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement