వరుసగా మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్‌ | Womens Hockey Asian Champions Trophy 2026: India beat China and win the trophy | Sakshi
Sakshi News home page

వరుసగా మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్‌

Nov 28 2026 9:22 PM | Updated on Nov 28 2026 9:22 PM

Womens Hockey Asian Champions Trophy 2026: India beat China and win the trophy

source: X

సొంతగడ్డపై జరుగుతున్న మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026లో భారత్‌ విజేతగా అవతరించింది. ఇవాళ జరిగిన ఫైనల్లో చైనాను 3-1 గోల్స్ తేడాతో ఓడించి వరుసగా మూడోసారి (2023, 2024, 2026), ఓవరాల్‌గా నాలుగోసారి (2016, 2023, 2024, 2026) టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక ఛాంపియన్‌షిప్‌లు సాధించిన జట్టుగా నిలిచింది.

ఫైనల్‌ తొలి అర్ధభాగంలో ఇబ్బందిపడిన భారత్‌.. రెండో అర్దభాగంలో అనూహ్యంగా పుంజుకొని వరుస గోల్స్‌తో విజయం సాధించింది. భారత్ విజయంలో దీపిక కీలక పాత్ర పోషించింది. ఒత్తిడికర పరిస్థితుల్లో రెండు గోల్స్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపింది.

ఇదీ చదవండి: ఫైనల్లో భారత్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement