బంగ్లాదేశ్‌ దిగ్గజం రిటైర్మెంట్‌.. ముహూర్తం ఖరారు | Bangladesh batter Mushfiqur Rahim to Retire from Test Cricket After First England Test in 2027 | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ దిగ్గజం రిటైర్మెంట్‌.. ముహూర్తం ఖరారు

Nov 28 2026 6:35 PM | Updated on Nov 28 2026 6:43 PM

Mushfiqur Rahim set to retire from Tests in February 2027

source: X

బంగ్లాదేశ్ దిగ్గజం ముష్ఫికర్ రహీమ్ టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌కు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో  జరిగే టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ అతడి కెరీర్‌లో చివరిది కానుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ శనివారం (నవంబర్ 28) అధికారికంగా వెల్లడించాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 14న తొలి టెస్టు ప్రారంభం కానుంది. మీర్‌పూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌తో ముష్ఫికర్ తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న అతడు ఇప్పటికే వన్డేలు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టెస్ట్‌ క్రికెట్‌ నిర్ణయాన్ని కూడా ముష్ఫికర్‌ కొద్ది రోజుల క్రితమే వెల్లడించాడు. అయితే ఎప్పుడు రిటైరవుతానన్న తేదీని మాత్రం అప్పట్లో తెలుపలేదు. తాజాగా బీసీబీ అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ ఈ విషయాన్ని అధికారికం చేశాడు. ముష్ఫికర్ కెరీర్‌ను గౌరవించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తమీమ్ తెలిపాడు.

ముష్ఫికర్ బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు. ఇప్పటివరకు 108 టెస్టులు ఆడిన అతడు 199 ఇన్నింగ్స్‌ల్లో 7062 పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 14 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ముష్ఫికర్ కొనసాగుతున్నాడు. అలాగే బంగ్లాదేశ్ తరఫున 100 టెస్టుల మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడు కూడా ముష్ఫికరే.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌కు గాయం.. సీజన్‌ మొత్తానికి దూరం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement