ఆసియాకప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే? | Women's U19 Asia Cup 2026: India Announce 15-Member Squad, Bhavika Ahire Named Captain | Sakshi
Sakshi News home page

U19 Womens Asia Cup: ఆసియాకప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

Nov 28 2026 6:36 PM | Updated on Nov 28 2026 6:46 PM

India name squad for U19 Womens Asia Cup

అండర్-19 మహిళల ఆసియా కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 15 మంది సభ్యులతో కూడిన త‌మ జట్టును ప్రకటించింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్-బ్యాటర్ భావిక అహిరే ఎంపికైంది. అదేవిధంగా భావిక అహిరేకి డిప్యూటీగా అనాది టాగ్డే వ్య‌వ‌హ‌రించ‌నుంది.

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027ను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం భారత అండర్‌-19 జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండో టీ20ల్లోనూ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.

ఈ సిరీస్‌లో యువ ఓపెనర్‌ అచ్సా పర్మార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. తొలి మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన ఆమె.. రెండో టీ20లో 81 పరుగులతో ఆకట్టుకుంది. టాప్ ఆర్డర్‌లో దీయా యాదవ్ కూడా సత్తా చాటుతోంది. తొలి టీ20లో 29 పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్, రెండో మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లోనే 87 పరుగులతో కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

బౌలింగ్‌లో యువ స్పిన్న‌ర్ ఉమా కాష్వి ఆకట్టుకుంటోంది.  ప్ర‌స్తుత భార‌త జ‌ట్టును జోరును చూస్తుంటే మ‌రోసారి ఆసియాక‌ప్ ట్రోఫీని ముద్దాడ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది. కాగా ఈ ఖండాంతర టోర్నీ డిసెంబ‌ర్ 8 నుంచి ప్రారంభం కానుంది.

భారత అండర్-19 జట్టు: భావిక అహిరే (కెప్టెన్, వికెట్ కీపర్), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వా సివాచ్, మహక్ నర్వాసే, మైత్రి మణియార్, ఈశ్వరి అవాసరే, దీయా యాదవ్, శ్రేయ ఎస్ చవాన్ (వికెట్ కీపర్), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కాష్వి, అచ్సా పర్మార్, అనాది టాగ్డే (వైస్ కెప్టెన్), పాలక్ సింగ్.
చదవండి: బంగ్లాదేశ్‌ దిగ్గజం రిటైర్మెంట్‌.. ముహూర్తం ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement