breaking news
Asia Cup 2026
-
మన మహిళా క్రికెటర్లు బరిలోకి
నగోయా: ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పతక వేటలో నేడు తొలి పోరులో బరిలోకి దిగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ను ఎదుర్కొంటుంది. ఇటీవలే ఆసియా కప్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ఈ మ్యాచ్‌లో గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం ప్రత్యరి్థకి అసాధ్యం. మరోవైపు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 61 టి20 మ్యాచ్‌ల అనుభవం ఉన్నా... పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్ ఈ ఆసియా క్రీడల్లో ఒక్క మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపించాలని ఆశగా ఉంది. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సన్నాహకంగా ఈ ఆసియా క్రీడలు పనికొస్తాయని భారత కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌తో పెద్దగా పరిచయం లేని జట్లతో కూడా ఆడుతున్న తమకు ఒలింపిక్స్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురవుతాయని అతను వ్యాఖ్యానించాడు. నేడు జరిగే మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మలేసియాతో శ్రీలంక తలపడుతుంది. సెమీస్‌లో పాక్, బంగ్లాదేశ్... ఆసియా క్రీడల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళల జట్లు సెమీస్‌లోకి అడుగు పెట్టాయి. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్, చైనా మధ్య జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా...ర్యాంకింగ్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజ వేసింది. -
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
మహిళల ఆసియా కప్-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా బహుమతి అందుకోమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదుఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే విషయం గురించి మేము ముందుగానే చర్చించుకున్నాము. అతడే ట్రోఫీ ఇస్తానని పట్టుబడితే తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాము. జట్టుకు ఇదే విషయాన్ని తెలియజేశాము.ఇది బోర్డు సామూహిక నిర్ణయం. ఇందుకు నక్వీ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే వేదిక దగ్గరకు వచ్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు. కాగా మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.అపుడు కూడా ఇలాగేదుబాయ్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి హర్మన్ సేన టైటిల్ గెలుచుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్ గెలిచినప్పటికీ భారత పురుషుల క్రికెట్ జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.తాజాగా 2026లో చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా జట్టు సైతం అదే బాటలో నడిచింది. అయితే, ఈసారి తాము ముందుగానే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని బీసీసీఐ ఏసీసీకి సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ నక్వీ తానే స్వయంగా బహుమతి ప్రదానం చేస్తానని వేదిక వద్దకు రాగా.. భారత జట్టు కిందే ఉండిపోగా.. రన్నరప్ శ్రీలంకకు చెక్ ఇచ్చి నక్వీ వెళ్లిపోయాడు.ట్రోఫీ ఇంకా చేతికి రాలేదుఇదిలా ఉంటే.. పురుషుల జట్టుకు రావాల్సిన ఆసియా కప్ ట్రోఫీ ఇంకా బీసీసీఐ చేతికి అందనేలేదు. తాజాగా మహిళల ట్రోఫీ కూడా ఎప్పుడు చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఏసీసీతో సంప్రదించి త్వరలోనే రెండు ట్రోఫీలు దేశానికి చేరేలా చూస్తామని వెల్లడించారు. కాగా టీమిండియా గతేడాది ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా.. నక్వీ తనతో పాటే ట్రోఫీని ఎత్తుకెళ్లాడనే ప్రచారం జరిగింది. దీంతో తాజాగా మహిళల ఫైనల్ ముగిసిన తర్వాత నక్వీ స్టేడియంలోకి రాగా..‘ట్రోఫీ చోర్’ అంటూ టీమిండియా అభిమానులు నినాదాలు చేశారు. చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
‘సంతోషంగా ఉంది.. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.గతేడాది పురుషుల జట్టు మాదిరిగానే ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది హర్మన్ సేన. ఫలితంగా.. ముందే సమాచారం ఇచ్చినప్పటికీ చాంపియన్‌కు తానే ట్రోఫీ ప్రదానం చేస్తానని పట్టుబట్టిన నక్వీకి భంగపాటు ఎదురైంది. ‘ట్రోఫీ దొంగ’ అంటూఅతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. స్టేడియంలో ఉన్నవాళ్లు ‘ట్రోఫీ దొంగ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. రన్నరప్ శ్రీలంక మాత్రం నక్వీ చేతుల మీదుగా చెక్ అందుకుంది.ఈ నేపథ్యంలో నక్వీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం అతడిని ప్రశంసిస్తూ అతి చేయడం కెమెరా కంటికి చిక్కింది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2026 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది.పాత కథ పునరావృతం కాకుండా..తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.దీంతో నక్వీ ట్రోఫీని తనతోపాటే తీసుకువెళ్లడం సహా.. తన అనుమతి లేకుండా భారత్‌కు ట్రోఫీని అందజేయవద్దనే ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చింది. తమ జట్టు ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోదని తేల్చి చెప్పింది.అయినప్పటికీ నక్వీ మొండిగా ముందుకు వెళ్లి.. చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియం వీడి కారులో నక్వీ తిరిగి వెళ్తున్న వేళ కొంతమంది పాక్ అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు‘మంచి పని చేశారు సర్. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’ అంటూ ఓ అభిమాని మాట్లాడటం రికార్డు అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్, నక్వీ తీరుపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.55 పరుగులకే ఆలౌట్ అయిన వాళ్లకే ఆ అర్హత ఉంది‘‘అవును.. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా చాంపియన్‌గా నిలిచిన హర్మన్‌సేనకు.. ఇలాంటి వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు అర్హత ఎందుకు ఉంటుంది?.. భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ అయిన పాక్ మహిళా జట్టుకు మాత్రమే ఆ అర్హత ఉంది. నక్వీ, పాక్ జట్టు.. వారికి వారే తగినవారు. శునకానందం పొందండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా గ్రూప్ దశలో భారత జట్టుతో తలపడ్డ పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్‌సేన 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. శ్రీలంక చేతిలో ఓడి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా అవతరించింది.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మHumiliation for Mohsin Naqvi 🔥😂“Good job, sir. We are happy with you. They don’t deserve the trophy,” a Pakistani fan tells Mohsin Naqvi. pic.twitter.com/6OSfKSNtzV— Anamika (@TheRubric_Medic) September 14, 2026 -
క్రికెట్, ఆర్చరీ, హాకీ క్రీడాకారులకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైనదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. హృదయపూర్వక అభినందనలుఈ సందర్భంగా.. అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదే విధంగా.. రికర్వ్ ఆర్చరీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన ఏపీకి చెందిన ధీరజ్ బొమ్మదేవరను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక AHF జూనియర్ ఆసియా కప్ 2026 టైటిళ్లను గెలుచుకుని దేశ కీర్తిని చాటిన భారత జూనియర్ పురుష, మహిళల హాకీ జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ‘మన క్రీడాకారుల పట్టుదల, కఠోర శ్రమ, అంకితభావం కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి. భవిష్యత్తులోనూ మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలి. భారతదేశ కీర్తిపతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.ఆసియా కప్ మనదేకాగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల ఆసియా టీ20 కప్-2026 ఫైనల్లో భారత జట్టు.. శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఇక అంతకుముందు చైనా వేదికగా సాయంత్రం జరిగిన జూనియర్ హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు చైనాపై.. పురుషుల జట్టు సౌత్ కొరియాపై గెలిచి చాంపియన్‌గా హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. మరోవైపు.. ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం సాధించాడు. -
వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?
ఆసియా కప్ ట్రోఫీ బహూకరణ విషయంలో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు (ఏసీసీ), పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ వైఖరి కారణంగా భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది.ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరణకాగా గతేడాది పురుషుల ఆసియా కప్ టీ20 టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు నక్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో నక్వీ ట్రోఫీని తనతో పాటే తీసుకువెళ్లగా.. సూర్యకుమార్ సేన రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.ఇప్పటికీ ట్రోఫీ భారత్ చేతికి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలోనూ భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ గెలిచింది. అయితే, ట్రోఫీ అందించే విషయంలో నక్వీ మొండిపట్టుదల కారణంగా హర్మన్‌సేన విషయంలో పాత కథే పునరావృతమైంది.𝗧𝗛𝗘 𝗪𝗜𝗖𝗞𝗘𝗧. 𝗧𝗛𝗘 𝗥𝗢𝗔𝗥. 𝗧𝗛𝗘 𝗖𝗥𝗢𝗪𝗡! 👑8 titles. One unstoppable dynasty 💙 #SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame #DPWorldWomensAsiaCup2026 pic.twitter.com/NG3DRF52Xd— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026ముందుగానే సమాచారంనిజానికి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీ బహూకరణ అంశం గురించి ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ..‘‘పురుషుల ఆసియా కప్ మాదిరే ఈసారి కూడా ట్రోఫీ అందుకునే విషయంలో మా వైఖరి గురించి ముందుగానే స్పష్టంగా చెప్పాము. ఇప్పటికీ గతేడాది ట్రోఫీ ఇంకా మా చేతికి రాలేదు. అయినా సరే కొంతమంది విదేశీ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు ఈసారి కూడా సుముఖంగా లేమని చెప్పేశాము.ఆయన చేతుల మీదుగా అయితే ఓకేఒకవేళ ఏసీసీ డిప్యూటీ చైర్పర్సన్ ట్రోఫీని ఖలీద్ అల్ జరూనీ ప్రదానం చేస్తే తీసుకుంటామని చెప్పాము. కానీ మా అభ్యర్థనను తిరస్కరించారు. కాబట్టి ట్రోఫీని ఆ వ్యక్తి (నక్వీ) చేతుల మీదుగా తీసుకోవద్దమని మేము నిర్ణయించుకున్నాము’’ అని సైకియా తెలిపాడు.‘‘ఏదేమైనా ట్రోఫీ చేతికి రానంత మాత్రాన మా జట్టు సాధించిన విజయం వృథాగా పోదు. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిన అమ్మాయిలకు అభినందనలు. ఏదో ఒకరోజు రెండు ట్రోఫీలు మన చేతికి వస్తాయి’’ అని సైకియా పేర్కొన్నాడు.వద్దన్నా వినడు.. ఇదేం బుద్ధి?బీసీసీఐ ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినప్పటికీ మోసిన్ నక్వీ ట్రోఫీ తానే ఇస్తానని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా జియో న్యూస్ వెల్లడించింది. ఏదేమైనా ట్రోఫీ చాంపియన్ చేతికి అందుతుందని.. ఈ విషయంలో ఏసీసీ సుముఖంగానే ఉందని పేర్కొంది.కాగా నక్వీ తీరుపై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ముందుగా చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టడం దేనికి?.. ఇదేం బుద్ధి?.. కావాలనే భారత్‌కు ట్రోఫీలు రాకుండా అల్ప సంతోషం పొందడం పాక్ మంత్రికి అలవాటై పోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 🚨 NO TROPHY FROM MOHSIN NAQVI! 🇮🇳India Women chose not to collect the Asia Cup trophy from Pakistan’s Mohsin Naqvi.Smriti Mandhana simply turned around and headed back to the dugout! 🔥WELL DONE GIRLS! 🙌 pic.twitter.com/XwnW5eW8nW— The Khel India (@TheKhelIndia) September 14, 2026 -
Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్
భారత యువ క్రికెటర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్-2026 ఫైనల్ సందర్భంగా 22 ఏళ్ల షఫాలీ వర్మ ఈ ఘనత సాధించింది.శ్రీలంతో టైటిల్ పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్ షఫాలీ వర్మ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్‌లో చముడి ప్రబోద బౌలింగ్‌లో పదమూడో ఓవర్ ఐదో బంతికి.. చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇవ్వడంతో షఫాలీ అవుటైంది.షఫాలీతో పాటు స్మృతి కూడామొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న షఫాలీ వర్మ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా హాఫ్ సెంచరీ (39 బంతుల్లో 59) సాధించింది.భారత్ స్కోరు ఎంతంటే?మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 17 పరుగులు చేసింది. ఆఖర్లో కమలిని 5 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. 183 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.మహిళల ఆసియా టీ20 కప్ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు👉షఫాలీ వర్మ- 24 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో శ్రీలంక మీద👉స్మృతి మంధాన- 25 బంతుల్లో- సెల్హైట్ వేదికగా 2022లో శ్రీలంక మీద👉రిచా ఘోష్- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో యూఏఈ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో నేపాల్ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో థాయ్‌లాండ్ మీద.చదవండి: అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనతShafali Verma is accelerating and we're just getting started! 🔥Watch #INDvSL in the Final of the #DPWorldWomensAsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame pic.twitter.com/u0js1RtZWo— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
Asia Cup 2026 Final: షఫాలీ, స్మృతి ఫిఫ్టీలు.. కమలిని మెరుపులు
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్ -2026 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 59), షఫాలీ వర్మ (39 బంతుల్లో 68) అర్ధ శతకాలతో అలరించారు. మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14, రిచా ఘోష్ 17 పరుగులు చేయగా.. ఆఖర్లో కమలిని మెరుపులు (5 బంతుల్లో 15 నాటౌట్) మెరిపించింది. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.UPDATES👉నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్👉పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 167-5👉18.5వ ఓవర్: మిథాలి బౌలింగ్‌లో భారతి ఫుల్మలి బంతిని ఎదుర్కోగా.. సింగిల్ తీసే క్రమంలో దీప్తి (5) రనౌట్ అయింది. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కమలిని క్రీజులోకి వచ్చింది. భారతి ఒక పరుగుతో ఉంది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్👉18.4వ ఓవర్: మిథాలి అయోధ్య బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (14). భారతి ఫుల్మలి క్రీజులోకి రాగా.. దీప్తి 5 పరుగులతో ఉంది. స్కోరు: 166-4👉పద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 163-3దీప్తి 2, హర్మన్ 14 పరుగులతో ఉన్నారు.👉మూడో వికెట్ కోల్పోయిన భారత్17.1వ ఓవర్: ఆటపట్టు బౌలింగ్‌లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చిన రిచా ఘోష్ (17). దీప్తి శర్మ క్రీజులోకి వచ్చింది.👉పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 160-2రిచా 17, హర్మన్ 13 పరుగులతో ఉన్నారు. 👉పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 147-2రిచా 5, హర్మన్ 12 పరుగులతో ఉన్నారు.👉పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 140-2రిచా 3, హర్మన్ 7 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్13.4వ ఓవర్: చమరి ఆటపట్టు బౌలింగ్‌లో హర్మన్ పరుగు తీసే క్రమంలో స్మృతితో సమన్వయ లోపం కారణంగా స్మృతి రనౌట్ (39 బంతుల్లో 59) అయింది. రిచా ఘోష్ క్రీజులోకి రాగా.. హర్మన్ 3 పరుగులతో ఉంది. 14 ఓవర్లలో స్కోరు: 134-2.👉షఫాలీ వర్మ అవుట్12.5వ ఓవర్: చముడి ప్రబోద బౌలింగ్‌లో చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చిన షఫాలీ (68) తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్కోరు: 130-1 (13). హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి రాగా.. స్మృతి 58 పరుగులతో ఉంది.👉పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 121-0షఫాలీ 67, స్మృతి 51 పరుగులతో ఉన్నారు.👉పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 113-0👉స్మృతి హాఫ్ సెంచరీషఫాలీ 61 పరుగులతో ఉండగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.👉పది ఓవర్లలో భారత్ స్కోరు: 98-0స్మృతి 38, షఫాలీ 59 పరుగులతో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 91-0👉స్మృతి 32, షఫాలీ 58 పరుగులతో ఉన్నారు.👉24 బంతుల్లోనే షఫాలీ అర్ధ శతకం.. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఆమెకు ఇది 21వ హాఫ్ సెంచరీ.👉ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 78-0షఫాలీ 25 బంతుల్లో 53, స్మృతి మంధాన 23 బంతుల్లో 24 పరుగులతో ఉన్నారు.👉ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 69-0షఫాలీ 48, స్మృతి 21 పరుగులతో ఉన్నారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 57-0 (6 ఓవర్లు)షఫాలీ 19 బంతుల్లో 38 పరుగులతో జోరు మీదుండగా.. స్మృతి 17 బంతుల్లో 19 పరుగులు చేసింది.👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0షఫాలీ 37, స్మృతి 19 పరుగులతో ఉన్నారు.👉నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 35-0షఫాలీ 18, స్మృతి 17 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు👉మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0👉రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 18-0తొలి ఓవర్లో ఐదు పరుగులేమిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ తొలి ఓవర్లో ఐదు పరుగులే చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన తొలి బంతికే ఫోర్ బాది ఖాతా తెరవగా.. షఫాలీ సున్నా పరుగులతో ఉంది.తుదిజట్టులో మార్పుటైటిల్ పోరు కోసం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ టాస్ సందర్భంగా వెల్లడించింది. ప్రతికా రావల్‌కు విశ్రాంతినిచ్చామన్న హర్మన్.. యువ ప్లేయర్ కమలినిని ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు.. గత ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, గత ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.తుదిజట్లుభారత మహిళల జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్ కమిలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.శ్రీలంక మహిళల జట్టుచమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్ కీపర్), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.చదవండి: అఫ్గాన్‌తో తొలి టీ20.. తుదిజట్టులో వైభవ్‌కు దక్కని చోటు -
మహిళల ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ ఢీ
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా... ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మరోవైపు శ్రీలంక కూడా గ్రూప్ దశలో అన్నీ మ్యాచ్‌లు నెగ్గి సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఫామ్‌పరంగా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టుకు కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ రూపంలో భారత జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. స్మృతి ఇప్పటికే ఈ టోర్నీలో ‘శత’క్కొట్టగా... షఫాలీ 168 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. స్పిన్‌కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్‌పై ఈ జంట జట్టుకు ఎలాంటి ఆరంభం ఇస్తుందనేదే కీలకం కానుంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తున్న ప్రతీకా రావల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలితో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి శ్రీలంక సారథి చమరి ఆటపట్టుతో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న దీప్తి ఫైనల్లోనూ రాణించాల్సిన అవసరముంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి తన స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతుండగా... పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు ఫీల్డింగ్‌లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సారథి చమరి ఆటపట్టుపైనే ఎక్కువ ఆధారపడుతోంది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. 22 ఏళ్లకే ఆల్ టైమ్ రికార్డ్!.
-
శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన పాక్
మహిళల ఆసియా కప్ 2026లో ఇవాళ రెండో సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది.కెప్టెన్ ఫాతిమా సనా ఓ మోస్తరు ఇన్నింగ్స్ (47 నాటౌట్) ఆడటంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో షావాల్ జుల్ఫికర్ (24), గుల్ ఫెరోజా (21), తుబా హసన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మునీబా అలీ (2), అయేషా జాఫర్ (7), సదాఫ్ షమాస్ (8) సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమారీ ఆటపట్టు, చముడి ప్రబోదా తలో 2 వికెట్లు తీయగా.. సుగందిక కుమారి ఓ వికెట్ పడగొట్టింది.కాగా, నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో గెలిచి భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. నేటి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇదీ చదవండి: శతక్కొట్టిన కానర్.. సౌతాఫ్రికాదే సిరీస్ -
షెఫాలీ వర్మ విధ్వంసం.. స్మృతి మంధాన రికార్డు బ్రేక్
మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రికార్డు స్దాయిలో ఆరోసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట షెఫాలీ దుమ్ములేపింది. షెఫాలీ వర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసింది. ఫలితంగా భారత జట్టు ప్రత్యర్ధి ముందు 149 ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచగల్గింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 109 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన షెఫాలీ ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది.ఈ ఏడాది టీ20ల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో షెఫాలీ అగ్రస్దానానికి చేరుకుంది. ఆమె ఇప్పటివరకు ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌లలో మొత్తం 593 పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు మంధాన(590) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో స్మృతిని షెఫాలీ అధిగమించింది.2026లో మహిళల టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరేషఫాలీ వర్మ: 593 పరుగులు, 20 ఇన్నింగ్స్లుస్మృతి మంధాన: 590 పరుగులు, 18 ఇన్నింగ్స్లుహర్మన్ప్రీత్ కౌర్: 465 పరుగులు, 18 ఇన్నింగ్స్లుజెమీమా రోడ్రిగ్స్: 345 పరుగులు, 16 ఇన్నింగ్స్లురిచా ఘోష్: 231 పరుగులు, 17 ఇన్నింగ్స్లుచదవండి: ENG vs PAK: సేమ్ సీన్ రీపీట్! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్ -
చరిత్ర సృష్టించిన కడప అమ్మాయి.. 22 ఏళ్ల వయసులోనే ఆల్‌టైమ్ రికార్డ్!
మహిళల ఆసియా కప్-2026లో భారత యువ స్పిన్నర్ శ్రీచరణి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ శ్రీచరణి సత్తాచాటింది. ఈ ఆంధ్ర క్రికెటర్ తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది.నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ఈ కడప అమ్మాయి టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో పాటు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.కుల్దీప్ రికార్డ్ బ్రేక్టీ20 అంతర్జాతీయ క్రికెట్లో (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా శ్రీచరణి చరిత్ర సృష్టించింది. ఆమె కేవలం 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. అంతకుముందు టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (30 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును చరణి బ్రేక్ చేసింది. భారత మహిళల విభాగంలో రాధా యాదవ్ (36 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.ఓవరాల్‌గా మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీచరణి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన మెంగ్టింగ్ ల్యూ (28 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ లీ కాస్పెరెక్, వెస్టిండీస్ క్రికెటర్ అనీసా మహమ్మద్‌లతో కలిసి చరణి (29 మ్యాచ్‌లు) రెండో స్థానాన్ని పంచుకుంది. ఈ ఆసియాకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో చరణి 8 వికెట్లతో మూడో స్దానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 40 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది.చదవండి: IND vs AFG: మరో 3 రోజుల్లో సిరీస్.. అంతలోనే టీమిండియా కీలక సభ్యుడి రాజీనామా! -
Womens Asia Cup 2026: షఫాలీ మెరుపులతో ఫైనల్‌కు భారత్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు అజేయ ప్రదర్శన కొనసాగింది. లీగ్ దశలో ఎదురులేకుండా సాగిన టీమ్ సెమీఫైనల్లోనూ మరో బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించింది.అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. షోర్నా (22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, దీప్తి శర్మ 3, నందని 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో 50 వికెట్లు (29 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకుంది. నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందం ఆడుతుంది. నాలుగు లైఫ్‌లు... స్మృతి మంధాన (2) తొందరగానే వెనుదిరిగినా, షఫాలీ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టింది. సుల్తానా ఓవర్లో వరుసగా ఆమె రెండు సిక్స్‌లు కొట్టగా, పవర్‌ప్లేలో స్కోరు 45 కు చేరింది. నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన షఫాలీ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత సుల్తానా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన షఫాలీ తర్వాతి బంతికి వెనుదిరిగింది. షఫాలీ వర్మకు ఏకంగా 4 లైఫ్‌లు లభించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆమె స్కోరు 6, 11, 56 వద్ద సులువైన క్యాచ్‌లు వదిలేసిన బంగ్లా ఫీల్డర్లు... 50 వద్ద కూడా సులువైన రనౌట్ అవకాశాన్ని చేజార్చారు. ఛేదనలో ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. తొమ్మిది పరుగుల వ్యవధిలో తొలి రెండు వికెట్లు కోల్పోయిన జట్టు... కొంత విరామం తర్వాత 17 పరుగుల వ్యవధిలో తర్వాతి 3 వికెట్లు చేజార్చుకొని కోలుకోలేకపోయింది.10 ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి కావడం విశేషం. 2004 నుంచి 2008 వరకు వన్డే ఫార్మాట్లో నాలుగుసార్లు ఆసియా కప్ జరగ్గా నాలుగుసార్లూ భారత జట్టే విజేతగా నిలిచింది. 2012 నుంచి 2024 వరకు టి20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహించారు. భారత జట్టు మూడుసార్లు (2012, 2016, 2022) టైటిల్ నెగ్గి, రెండుసార్లు (2018, 2024) రన్నరప్‌గా నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) షోర్నా (బి) సుల్తానా 2; షఫాలీ (సి) (సబ్) ఫర్జానా (బి) సుల్తానా 64; ప్రతీక (సి) దిలారా (బి) రాబియా 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 24; రిచా (స్టంప్డ్) నిగార్ (బి) నాహిదా 21; దీప్తి (సి) రాబియా (బి) మారుఫా 13; భారతి (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–59, 3–92, 4–128, 5–149, 6–149. బౌలింగ్: మారుఫా 4–0–40–1, సుల్తానా 3–0–30–2, నాహిదా 4–0–25–1, రాబియా 4–0–22–1, ఫహీమా 4–0–21–0, షోర్నా 1–0–10–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా (సి) క్రాంతి (బి) దీప్తి 21; జువేరియా (సి) రిచా (బి) శ్రీచరణి 14; శోభన (బి) దీప్తి 18; నిగార్ (సి) నందని (బి) ప్రేమ 19; షోర్నా (నాటౌట్) 22; షర్మీన్ (బి) దీప్తి 1; ఫహీమా (సి) ప్రేమ (బి) నందని 14; రాబియా (హిట్‌వికెట్) (బి) నందని 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–26, 2–35, 3–66, 4–76, 5–83, 6–109, 7–109. బౌలింగ్: క్రాంతి 2–0–13–0, నందని 2–0–10–2, శ్రీచరణి 4–1–14–1, షఫాలీ 4–0–25–0, ప్రేమ 4–0–21–1, దీప్తి 4–0–26–3. -
షఫాలీ విధ్వంసం.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించారు.షఫాలీ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓ మోస్తరు స్కోర్‌కే (149-6) పరిమితమైంది. స్టార్ ప్లేయర్, ఓపెనర్ స్మృతి మంధన (2) త్వరగా ఔటైనా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగింది. మిగతా ప్లేయర్లలో ప్రతీకా రావల్ 20 (24 బంతుల్లో ఫోర్, సిక్సర్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 24 (నాటౌట్), రిచా ఘోష్ 21 (16 బంతుల్లో 2 సిక్సర్లు), దీప్తి శర్మ 13 (6 బంతుల్లో ఫోర్, సిక్సర్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా అక్తర్ 2, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, నహిద అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(w), ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మబంగ్లాదేశ్: దిలారా అక్తర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా(w/c), షర్మిన్ అక్తర్, షోర్నా అక్తర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్తర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్తర్చదవండి: ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్‌లోనూ పాక్‌కు మూడినట్టే..! -
టీమిండియా బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించారు.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(w), ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మబంగ్లాదేశ్: దిలారా అక్టర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా(w/c), షర్మిన్ అక్తర్, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్టర్చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..? -
ఫేవరెట్‌గా భారత్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడుతుంది. లీగ్ దశలో మూడు విజయాలతో భారత మహిళలు అజేయంగా నిలవగా... రెండు చిన్న జట్లపై విజయాలతో బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరింది. ఓవరాల్‌గా బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్‌పై భారత బృందం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్ కొంత తడబడినా... తర్వాతి రెండు మ్యాచ్‌లలో టీమ్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్లుగా షఫాలీ, స్మృతి దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌కు సరైన పునాది వేస్తున్నారు. జెమీమా గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ప్రతీక రావల్ మూడు మ్యాచ్‌లలోనూ విఫలం కావడం ఒక్కటే ఇప్పుడు జట్టుకు కాస్త ఆందోళన కలిగించే అంశం. హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ మిడిలార్డర్లో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించగలరు. భారత బౌలింగ్ మరింత పదునుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి, ప్రేమ రావత్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడే యగలరు. పేసర్లు క్రాంతి, నందని శర్మ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. దియానా, జువేరియా, నిగార్, షర్మిన్ భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. అయితే బౌలింగ్ కొంత మెరుగ్గా ఉండటం జట్టుకు సానుకూలాంశం. ముఖ్యంగా పేసర్ మారుఫా తన స్వింగ్‌తో చెలరేగిపోగల సమర్థురాలు. సుల్తానా, నాహిదా ఆమెకు సహకరించాల్సి ఉంది. వేడి వాతావరణం కొనసాగుతుండగా, ఈ టోర్నీలో పిచ్‌లు స్పిన్‌కు బాగా అనుకూలిస్తున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో చివరిసారిగా 2023లో ఓడిన భారత్... ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్‌లలో గెలిచింది. స్మృతి మరో 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పుతుంది. -
సెమీఫైనల్లో భారత్... చైనీస్ తైపీపై 15–0తో జయభేరి
మోకి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతోన్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 15–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ అన్మోల్ ఎక్కా ఆరు గోల్స్ (25వ, 29వ, 32వ, 33వ, 45వ, 51వ నిమిషాల్లో)... ఆర్యన్ మూడు గోల్స్ (17వ, 52వ, 53వ నిమిషాల్లో), హర్పాల్ రెండు గోల్స్ (48వ, 53వ నిమిషాల్లో) చేశారు. గురుసేవక్ సింగ్ (22వ ని.లో), ప్రభ్‌దీప్ సింగ్ (18వ ని.లో), అజీత్ యాదవ్ (35వ ని.లో), అర్జున్ సంతోష్ హర్గుడె (28వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని 10 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... దక్షిణ కొరియా 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. పూల్ ‘బి’ నుంచి పాకిస్తాన్, మలేసియా జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో మలేసియాతో భారత్; పాకిస్తాన్‌తో దక్షిణ కొరియా తలపడతాయి. మరోవైపు భారత మహిళల జట్టు చైనాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో భారత్; హాంకాంగ్‌తో చైనీస్ తైపీ; బంగ్లాదేశ్‌తో జపాన్; మలేసియాతో దక్షిణ కొరియా పోటీపడతాయి. -
టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు
మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. మంగళవారం యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను యూఏఈ బౌలర్లు దెబ్బతీశారు. సురక్ష కొట్టె (3/11), ఇందుజ నందకుమార్ (2/21) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో షార్మిన్ అక్తర్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు), నహిదా అక్తర్ (26 బంతుల్లో 16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి 7వ వికెట్‌కు 42 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేయగలిగింది.అనంతరం 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ, బంగ్లా బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా స్పిన్నర్ రబేయా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, మరుఫా అక్తర్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడాలంటే? -
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నిలో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్‌లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై నెగ్గి... భారత్ చేతిలో చిత్తయిన పాక్, ఈ గెలుపుతో గ్రూప్ ‘ఎ’ నుంచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ జట్టుతో బంగ్లాదేశ్ తలపడుతుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. -
స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు
భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రాపై టీమిండియా స్టార్ స్మృతి మంధాన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన స్మృతి వంటి ప్లేయర్‌ను విమర్శించడం సరికాదని మండిపడుతున్నారు. జట్టు కోసం ఇప్పటికే ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎంతో చేసిందని.. ఆమె వల్లే జట్టు గెలిచిన సందర్భాలను మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు.రెండు ప్రపంచ రికార్డులుఆసియా మహిళల టీ20 కప్-2026లో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన అదరగొట్టిన సంగతి తెలిసిందే. విధ్వసంకర శతకంతో చెలరేగిన ఆమె.. తద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా నిలిచింది. అంతేకాదు... మొత్తంగా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది.పాక్‌తో మ్యాచ్‌లో విఫలం అయితే, ఆ తర్వాత పాకిస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం స్మృతి మంధాన విఫలమైంది. పాక్ విధించిన 56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9).. వన్‌డౌన్ బ్యాటర్ ప్రతికా రావల్ (4) దారుణంగా విఫలమయ్యారు.దీంతో భారత్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (18), దీప్తి శర్మ (12) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే స్మృతి అవుటయ్యే పరిస్థితి (క్యాచ్ అవుట్) వచ్చింది. అయితే, అంపైర్ నిర్ణయంతో ఆమెకు లైఫ్ లభించింది.ఈ నేపథ్యంలో స్మృతి దంచికొడుతుందనుకుంటే.. 11 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించింది. పాక్ కెప్టెన్ సనా ఫాతిమా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో కామెంటేటర్‌గా ఉన్న అంజుమ్ చోప్రా స్మృతిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.అంజుమ్ విమర్శలు‘‘గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్లేయర్ (స్మృతి) ఈసారి తొలి బంతికే అవుటయ్యేది. అంపైర్‌కు స్పష్టత లేకపోవడం వల్ల బతికిపోయింది. కానీ నిజానికి ఆమె అప్పుడే అవుటయ్యేది. కామెంట్రీ బాక్సులో స్టంప్ మైకు ఆడియోలో బంతి బ్యాట్‌ను తాకిన శబ్దాన్ని మనం స్పష్టంగా విన్నాము కదా’’ అని అంజుమ్ చోప్రా పేర్కొంది.అదే విధంగా.. ‘‘ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఆ తర్వాత కూడా ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 56 పరుగుల లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ కూడా త్వరగా పెవిలియన్ చేరింది. ప్రతీసారీ కెప్టెన్ వచ్చి పరుగులు చేయాలా?’’ అని అంజుమ్ చోప్రా టాపార్డర్‌ను విమర్శించింది. ఈ నేపథ్యంలో స్మృతి అభిమానులు అంజుమ్ చోప్రా తీరును విమర్శిస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన స్మృతి లాంటి దిగ్గజాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదంటూ హితవు పలుకుతున్నారు.చదవండి: టీమిండియాపై విజయం.. పాక్ క్రికెట్‌కు శాపంగా మారింది! -
మళ్లీ చీఫ్ గెస్ట్ అతడే.. భారత్ గెలిస్తే ట్రోఫీ తీసుకుంటుందా?
భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 విజేతగా నిలిచి ఏడాది అవుతున్నప్పటికీ, ట్రోఫీ ఇంకా వారి చేతికి అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆ ట్రోఫీని అందుకోకపోవడంతో.. అది ఇప్పటికీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది.అయితే ఇప్పుడు భారత మహిళల జట్టుకు అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా నఖ్వీ హాజరుకానున్నట్లు సమాచారం. గతంలో జరిగినట్లుగానే విజేతలకు ట్రోఫీని స్వయంగా అందించాలని నఖ్వీ భావిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే మరోసారి ఆసియా విజేతగా నిలిచేందుకు ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే నఖ్వీ చేతుల మీదగా భారత అమ్మాయిల జట్టు ట్రోఫీ తీసుకుంటుందా లేదా? మెన్స్ టీమ్ మాదిరిగానే బాయ్‌కట్ చేస్తుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికి ఆసియాకప్‌లో మరోసారి హైడ్రామా చోటు చేసుకోవడం ఖాయమన్పిస్తోంది.కాగా ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టీమిండియా ఇప్పటికే తమ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్ షేక్ చేసుకోలేదు. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరినా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్‌ప్లాప్ ప్లేయర్‌కు చోటు -
శ్రీలంక హ్యాట్రిక్ విజయం
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకిది ‘హ్యాట్రిక్’ విజయం. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. శోభన (34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. శ్రీలంక బౌలర్లలో ప్రబోద 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షిత (37 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. -
శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..
-
పాకిస్తానే బెస్ట్ టీమ్.. అందుకే 55 పరుగులకే ఆలౌటైంది!
మహిళల ఆసియాకప్-2026లో దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ ఘోర పరాభవం తర్వాత పాకిస్తాన్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ జట్టు చిత్తు చిత్తుగా ఓడినప్పటికీ, ఆసియాకప్ టోర్నీలోనే అత్యుత్తమ జట్టు పాకిస్తానేనంటూ అతడు అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. శ్రీచరణి, ప్రేమా రావత్, దీప్తి శర్మ వంటి స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటింగ్ లైనప్ మొత్తం విలవిల్లాడింది. ఓపెనర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ తమ జట్టును రియాజ్ వెనకేసుకురావడం హాస్యాస్పదంగా మారింది."మా జట్టులోని ప్లేయర్లందరికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. కానీ వారు తమను తాము నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన తప్పులపై చర్చించి, తదుపరి హాంకాంగ్‌తో మ్యాచ్‌లో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఈ ఆసియాకప్ ట్రోఫీని గెలిచే అత్యుత్తమ జట్టు ఇప్పటికీ పాకిస్తానేనని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూఏఈ పరిస్థితులు మాకు బాగా తెలుసు. మా జట్లు ఇక్కడ చాలా క్రికెట్ ఆడాయి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రియాజ్ పేర్కొన్నాడు. కాగా రియాజ్ వ్యాఖ్యలకు భారత ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. 'నిజంగానే పాక్ బెస్ట్ టీమ్.. అందుకే 55 పరుగులకు ఆలౌటైంది' ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
మహిళల ఆసియాకప్-2026లో పాకిస్తాన్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాక్ ఘోర పరాజయం పాలైంది. మరోసారి దాయాది జట్టుపై హర్మన్ సేన ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా పాక్ బ్యాటర్లు భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. శ్రీచరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఓ వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్ల విషయానికి వస్తే.. ఓపెనర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.బ్యాటింగ్‌లో విఫలమైన కెప్టెన్ ఫాతిమా సనా.. బౌలింగ్‌లో మాత్రం మూడు వికెట్లు పడగొట్టింది. అయినప్పటికి ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో చేధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఫాతిమా స్పందించింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని సనా చెప్పుకొచ్చింది."ఈ ఓటమి మమ్మల్ని ఎంతగానో బాధించింది. మ్యాచ్‌లో కనీసం ఒక్క భాగస్వామ్యం కూడా నెలకొల్పలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నుండి ముగిసే వరకు పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. కొత్త పిచ్ కావడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. బోర్డుపై మంచి స్కోరు ఉంచి, మా బౌలింగ్ బలాన్ని వాడుకోవాలనుకున్నాం.కానీ మా ప్రణాళికలను మైదానంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. నేను బౌలింగ్‌లో రాణించినా, జట్టు ఓడిపోయినప్పుడు ఆ ప్రదర్శనకు ఏ విలువా ఉండదు. అదే జట్టు గెలిచి ఉంటే ఆ సంతోషం వేరుగా ఉండేది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా తదుపరి మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సనా పేర్కొంది. కాగా పాక్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 7న హాంకాంగ్‌తో తలపడనుంది.చదవండి: IND vs PAK: ఆడింది చాలు పో!.. పాక్ కెప్టెన్ ఓవరాక్షన్? -
భారత జట్ల బోణీ
మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు బోణీ కొట్టాయి. శనివారం డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు 14–0 గోల్స్ తేడాతో ఇండోనేసియాను చిత్తుచేయగా... మహిళల జట్టు 4–1 గోల్స్‌తో దక్షిణ కొరియా పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత్ గోల్స్ వర్షం కురిపించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ప్రభ్‌దీప్ సింగ్ 5 గోల్స్‌తో విజృంభించగా... కెపె్టన్ అన్మోల్ ఎక్కా 4 గోల్స్ సాధించాడు. అజీత్ యాదవ్ మూడు గోల్స్‌తో మెరవగా... హర్పాల్, మౌర్య చెరో గోల్ కొట్టారు. మహిళల మ్యాచ్‌లో సనిక, పూర్ణిమ యాదవ్, పూజ, మధు ఒక్కో గోల్చేశారు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో నేడు జపాన్‌తో భారత పురుషుల జట్టు, మలేసియాతో మహిళల జట్టు తలపడనున్నాయి. -
నేడు పాకిస్తాన్‌తో భారత్ ఢీ
దుబాయ్: వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ‘హ్యాట్రిక్’పై గురి పెట్టింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా సాగుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దాయాదిపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా... పాకిస్తాన్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో నెగ్గి 2 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో ఉంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఆసియాకప్ క్రికెట్ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడింట చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... పాకిస్తాన్‌తో పోరులోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా... పాకిస్తాన్ కంటే టీమిండియా ఎంతో మెరుగ్గా ఉంది. మరోవైపు భారత్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించాలని ఫాతిమా సనా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టుపట్టుదలగా ఉంది. ఓపెనింగ్ అదుర్స్... ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనుంది. హాంకాంగ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రికార్డుల దుమ్ముదులిపిన స్మృతి అదే జోరు కొనసాగిస్తే పాకిస్తాన్‌కు తిప్పలు తప్పకపోవచ్చు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు... భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలిచిన స్మృతి... పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కూడా మంచి టచ్‌లో ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న ప్రతీక రావల్ మరింత భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురు తప్ప మిగిలినవాళ్లు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇక దీప్తి శర్మతో పాటు ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్ ప్లేయర్లకు శక్తికి మించిన పనే కానుంది.శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ 6 వికెట్ల తేడాతో ఇండోనేసియాను చిత్తు చేసింది. ఇండోనేసియా 19.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్ప కూలింది. యూఏఈ 13.1 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసి విజయాన్నందుకుంది.17 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు 17 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో భారత జట్టు... 3 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ జట్టు గెలుపొందాయి. -
‘పాక్ కంటే అడుగు ముందే ఉన్నాం’
దుబాయ్: దాయాది పాకిస్తాన్ జట్టు కంటే భారత బృందం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ పేర్కొంది. దుబాయ్ వేదికగా జరుగుతున్నమహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా... శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీ చరిత్రలో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఇందులో పాకిస్తాన్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దీప్తి మాట్లాడుతూ... ‘పాకిస్తాన్‌తో పోరు అంటే పెద్దగా తేడా ఏమీ లేదు. ఆసియాకప్ అనే కాదు ఇతర మ్యాచ్‌లను తీసుకున్నా... పాకిస్తాన్‌తో పోటీల్లో మనం వారికంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్నాం. జట్టు మొత్తం బాగా ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు సమతూకంగా ఉంది. ఆ రోజు ఎవరి ఆట బాగా సాగుతుందో వారు మరింత మెరుగ్గా ఆడి జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మిగిలిన వారు సానుకూల దృక్పథంతో జట్టుకు సహకరిస్తారు. పాకిస్తాన్ బౌలింగ్ బృందం బలంగా ఉంది. మా వరకైతే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. శ్రీచరణి ఎంతో ప్రతిభావంతురాలు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె నంబర్‌వన్ స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో ఆమె నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంతిని గింగిరాలు తిప్పగలదు. ఆమె బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే. ప్రేమ రావత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా... ఆమెలోనూ మంచి నైపుణ్యం ఉంది. అవకాశం వచ్చిన ప్రతీసారి జట్టుకు సహాయ పడేందుకు సిద్ధంగా ఉంటుంది’ అని దీప్తి వెల్లడించింది. నెట్స్‌తో పాటు మైదానంలో సీనియర్ బౌలర్‌గా వారికి తన వంతు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటానని దీప్తి పేర్కొంది. -
‘కలలో కూడా ఊహించలేదు’
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా హాంకాంగ్‌పై భారీ సెంచరీతో కదంతొక్కిన స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. టెస్టు, వన్డే, టి20 మూడు ఫార్మాట్లలో కలిపి భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 10,868 పరుగులు చేయగా... స్మృతి మంధాన (10,880) తాజాగా ఆమెను అధిగమించింది. అయితే ఇది తానెప్పుడూ ఊహించలేదని స్మృతి వెల్లడించింది. కెరీర్ తొలినాళ్లలో మిథాలీ రాజ్ సారథ్యంలో ఆడిన మంధాన... తన రోల్‌మోడల్ రికార్డును తిరగరాయడం ఆనందంగా ఉందని పేర్కొంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. హాంకాంగ్‌తో పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన స్మృతి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... » బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ రికార్డు గురించి నాకు తెలియదు. క్రీజులో ఉన్నప్పుడు నా స్కోరు, పరుగుల మీద ఎక్కువ దృష్టి పెట్టను. కేవలం పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ జట్టును గెలిపించేందుకు కృషి చేస్తా. » వెనక్కి తిరిగి చూసుకుంటే భారతీయ క్రికెట్లో ఇదొక గొప్ప రోజు. మిథాలీ దీదీ ఒక దిగ్గజం. నేటి తరం క్రికెటర్లకు ఆమె ఆదర్శప్రాయురాలు. మిథాలీ బ్యాటింగ్ చూస్తూనే పెరిగాను. అలాంటిది అత్యధిక పరుగుల జాబితాలో ఆమెను అధిగమిస్తానని నేను అసలు ఊహించలేదు. అయితే అగ్రస్థానంలో ఇద్దరు భారతీయులే ఉండటం సంతోషంగా ఉంది. » మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీల జాబితాలోనూ ‘టాప్’కు చేరడం చాలా ఆనందంగా ఉంది. మిథాలీ మాదిరిగానే... మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కూడా చాలా పెద్ద ప్లేయర్. అలాంటిది ఆమె పెరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డును తిరగరాయడం గొప్పగా అనిపిస్తోంది. మిథాలీ, లానింగ్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. » చిన్నప్పటి నుంచి ఆదర్శంగా భావించిన ఇద్దరు ప్లేయర్ల ఘనతలను ఒకే మ్యాచ్‌లో అందుకోవడం గర్వంగా ఉంది. అయితే ఇది ఆరంభం మాత్రమే మరింత ముందుకు సాగడమే నా లక్ష్యం. గత రెండు మ్యాచ్‌ల్లో మా మిడిలార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయినా... వాళ్లంతా ప్రపంచ స్థాయి ప్లేయర్లు. దుబాయ్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలంగా లేవు. ఇలాంటి చోట పరుగులు చేయడం సవాలుతో కూడుకున్న విషయం. » వేడి వాతావరణంలో ఎక్కువసేపు క్రీజులో కొనసాగడం కష్టమైన పనే. ఉక్కపోత కారణంగా శరీరం త్వరగా అలిసిపోతుంది. అదృష్టవశాత్తు హాంకాంగ్‌తో మ్యాచ్‌లో నేను ఎక్కువ బౌండరీలు కొట్టగలిగాను. దీంతో వికెట్ల మధ్య పరుగులు తీయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. -
స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్
-
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
భారత ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించింది. మిథాలీ రికార్డు బ్రేక్అదే విధంగా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ (10868 పరుగులు)ను స్మృతి అధిగమించింది. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత్- హాంకాంగ్ (చైనా) జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన హాంకాంగ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో స్మృతి మంధాన రికార్డు శతకంతో చెలరేగింది. 58 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకుంది ఈ లెఫ్టాండర్ బ్యాటర్. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న స్మృతి 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. మరో ఓపెనర్ షఫాలి వర్మ (17 బంతుల్లో 28) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే పెవిలియన్ చేరింది.మిగిలిన వారిలో ప్రతికా రావల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11) పూర్తిగా నిరాశపరిచారు. భారతి ఫుల్మలి రెండు, దీప్తి శర్మ ఒక పరుగుతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు ఆమెదేస్మృతి గనుక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే పసికూన చేతిలో స్వల్ప స్కోరుకే పరిమితమవాల్సిన దుస్థితి తలెత్తేది. కాగా మహిళల ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గానూ స్మృతి (124) నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (119*) పేరిట ఉండేది.మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్లు👉స్మృతి మంధాన (ఇండియా)- 18👉మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)- 17👉లారా వొల్వర్ట్ (సౌతాఫ్రికా)- 17👉హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్)- 15👉సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 14👉టామీ బీమౌంట్ (ఇంగ్లండ్)- 14తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్.హాంకాంగ్, చైనానటాషా మైల్స్ (కెప్టెన్), మరియం బీబీ, మరికో హిల్, జోయ్లీన్ కౌర్, మరీనా లాంపో, యాస్మిన్ దస్వాని (వికెట్ కీపర్), షంజీన్ షాజాద్, క్యారీ చాన్, రుచితా వెంకటేశ్, ఇక్రా సహర్, అలిసోన్ సియూ. -
ఏషియన్ గేమ్స్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. స్టార్ బ్యాటర్ రీఎంట్రీ
ఏషియన్ గేమ్స్ 2026 కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ షాంటో టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. షాంటో చివరిగా 2025లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక టెస్టు విజయాన్ని అందించిన జట్టుకు షాంటోనే కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఏషియన్ గేమ్స్ కోసం ఎంపిక చేసిన బంగ్లా జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇవాళే సౌతాఫ్రికా-ఏపై ట్రిపుల్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించిన తౌహిద్ హృదోయ్ దాస్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరిస్తాడు. ఈ జట్టులో వికెట్ కీపర్, బ్యాటర్ నురుల్ హసన్‌కు చోటు దక్కలేదు. అలాగే పేసర్లు తస్కిన్ అహ్మద్, అబ్దుల్ గఫ్ఫార్ సైఫుల్లా కూడా ఈ జట్టులో లేరు. గాయం నుంచి కోలుకుంటున్న నహీద్ రాణా సెలెక్షన్‌కు అందుబాటులో లేడు. ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్తో పేస్ విభాగం బలంగా ఉంది.ఏషియన్ గేమ్స్‌కు బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (కెప్టెన్), తంజీద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), మొసద్దెక్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరీ, రిషాద్ హొస్సేన్, మెహెదీ హసన్, నసుమ్ అహ్మద్, మహ్మద్ సైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్ముద్.కాగా, ఏషియన్ గేమ్స్‌లో బంగ్లాదేశ్ ప్రయాణం సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్‌ఫైనల్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్ కూడా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.చదవండి: పాక్‌తో చివరి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ కొనసాగింపు -
టీమిండియా ప్లేయర్ వరల్డ్ రికార్డ్
మహిళల ఆసియాకప్-2026లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మది కీలక పాత్ర. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన దీప్తీ.. బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. కేవలం 1.1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన దీప్తి మూడు వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో యూపీ క్రికెటర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా దీప్తి రికార్డులకెక్కింది. ఆమె ఇప్పటివరకు టీ20ల్లో 171 వికెట్లు పడగొట్టింది. ఇంతకుముందు ఈ రికార్డు థాయిలాండ్ బౌలర్ తిపట్చా పుత్తవోంగ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో తిపట్చాను దీప్తి అధిగమించింది. అదేవిధంగా భారత మహిళల క్రికెట్ తరఫున 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో క్రికెటర్‌గా కూడా ఆమె నిలిచింది. అంతకుముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (203 మ్యాచ్‌లు), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (172 మ్యాచ్‌లు) మాత్రమే ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరేదీప్తి శర్మ-171తిపట్చా పుట్టావాంగ్-170హెన్రియెట్ ఇషిమ్వే-164సోఫీ ఎక్లెస్టోన్ -154కారీ చాన్-153ఒన్నిచా కమ్‌చోంఫు-153చదవండి: పాకిస్తాన్ ఖేల్ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అవుట్! -
Asia Cup 2026: రికార్డు విజయంతో శ్రీలంక బోణీ
మహిళల ఆసియా కప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక అద్భుత విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక, యూఏఈని కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం 7.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల టీ20ల్లో బంతుల పరంగా శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరో 73 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, రికార్డు విజయం నమోదు చేసింది.37 డాట్ బాల్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. మిథాలీ అయోధ్య (3.5-0-14-3), చేతన విముక్తి (4-0-16-3), సుగంధిక కుమారీ (4-0-18-2), చమారీ ఆటపట్టు (3-0-10-1), కవిష దిల్హరి (2-0-9-1) ధాటికి 19.5 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది. యూఏఈ బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో ఏకంగా 37 డాట్ బాల్స్ పడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణమో అర్దమవుతుంది.అరుదైన మైలురాయిని తాకిన లంక కెప్టెన్స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక మెరుపు వేగంతో ప్రారంభించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు 25 బంతుల్లో 48 పరుగులతో (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి, తన జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. ఈ క్రమంలో చమారీ ఓ అరుదైన మైలురాయిని తాకింది. మహిళల ఆసియా కప్‌లో సిక్సర్‌తో 500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది.నేడే భారత్ మ్యాచ్ఈ టోర్నీలో భారత్ ఇవాళ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: నేడు బరిలోకి భారత మహిళలు -
ఆసియా కప్ కోసం పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్
ఆసియా కప్ 2026 కోసం పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. సాధారణంగా కనిపించని విధంగా పురుషుల జట్టుతో టీ20 మ్యాచ్‌లు ఆడి కీలక టోర్నీకి సన్నద్ధమైంది. ఆగస్టు 28 నుంచి మహిళల ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో, పాక్ క్రికెట్ బోర్డు ఈ ప్రత్యేక ప్రాక్టీస్‌కు ఏర్పాట్లు చేసింది.ఫాతిమా సనా నాయకత్వంలోని పాకిస్తాన్ మహిళల జట్టు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో భాగంగా అబ్దుల్ ఖాదిర్ క్రికెట్ అకాడమీ పురుషుల జట్టుతో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ఉన్నారు.పూర్తి స్థాయి టీ20 మ్యాచ్లుఇవి కేవలం నెట్స్‌లో నిర్వహించే సిమ్యులేషన్ మ్యాచ్‌లు కావు. పూర్తి స్థాయి టీ20 నిబంధనలతోనే ఈ రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. పురుషుల జట్టుతో ఆడటం ద్వారా మహిళల ఆటగాళ్లకు మరింత వేగం, ఒత్తిడి, పోటీ వాతావరణం ఎదురైంది.ముఖ్యంగా కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను అమలు చేయడం వంటి అంశాలపై ఈ మ్యాచ్‌లు ఉపయోగపడ్డాయని జట్టు భావిస్తోంది.పురుషుల జట్టుతో ఎందుకు ఆడారు..?ఆసియా కప్‌కు ముందు తమ జట్టును ఒత్తిడిలో పరీక్షించడమే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రధాన ఉద్దేశమని కెప్టెన్ ఫాతిమా సనా వెల్లడించింది. పెద్ద టోర్నీల్లో కీలక సమయాల్లో ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది.ఆసియా కప్‌లో పాక్‌కు అంతగా కలిసిరాని రికార్డుపాకిస్తాన్ మహిళల జట్టు ఇప్పటివరకు ఆసియా కప్‌ను ఒక్కసారి కూడా గెలవలేదు. 2012, 2016లో ఫైనల్‌కు చేరినప్పటికీ రెండు సార్లూ భారత్ చేతిలో ఓడిపోయింది. గత ఎడిషన్‌లో మాత్రం సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.గ్రూప్-Aలో భారత్‌తో పాక్ఆసియా కప్ 2026లో పాకిస్తాన్ గ్రూప్-Aలో భారత్‌తో పాటు ఉంది. సెప్టెంబర్ 1న థాయ్‌లాండ్‌తో మ్యాచ్ ద్వారా పాక్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.ఆ తర్వాత సెప్టెంబర్ 5న భారత్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. గతంలో ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయాల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ పోరులో ముందుకు వెళ్లాలని పాక్ భావిస్తోంది.చదవండి: Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్ -
Asia Cup 2026: టీమిండియాకు భారీ షాక్
ఏసీసీ మహిళల ఆసియా కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నీకి దూరమైంది. ఆసియా కప్ ఈవెంట్‌తో పాటు.. ఆసియా క్రీడలకు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్ వేదికగా ‘ది హండ్రెడ్’ మహిళల లీగ్-2026లో జెమీమా రోడ్రిగ్స్ సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అయితే, ఇటీవల ఆగష్టు 3 నాటి మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో విలవిల్లాడింది.గాయం తీవ్రతరంఫలితంగా హండ్రెడ్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు జెమీమా దూరమైంది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న ఆమె గాయం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైద్య బృందం సూచన మేరకు ఆమెకు విశ్రాంతి అవసరమని నిర్ణయించింది.ఈ క్రమంలో ఆసియా కప్, ఆసియా క్రీడలకు జెమీమా రోడ్రిగ్స్ దూరమైనట్లు బోర్డు ప్రకటించిది. ఇక ఆసియా కప్ టోర్నీకి మాత్రం జెమీమా స్థానంలో ప్రతికా రావల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఆసియా కప్ నిర్వహణకు ఆగష్టు 28- సెప్టెంబరు 13 మధ్య షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు యూఏఈ వేదిక.ఆసియా కప్-2026 టోర్నీకి భారత మహిళల జట్టు (అప్డేటెడ్)హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, భారతి ఫల్మలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతికా రావల్.చదవండి: ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్ ఫైర్


