శ్రీలంక హ్యాట్రిక్‌ విజయం | Sri Lanka beat Bangladesh by 4 wickets in Womens Asia Cup T20 tournament | Sakshi
Sakshi News home page

శ్రీలంక హ్యాట్రిక్‌ విజయం

Sep 7 2026 2:00 AM | Updated on Sep 7 2026 2:00 AM

Sri Lanka beat Bangladesh by 4 wickets in Womens Asia Cup T20 tournament

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకిది ‘హ్యాట్రిక్‌’ విజయం. మొదట బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. శోభన (34; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. 

శ్రీలంక బౌలర్లలో ప్రబోద 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్షిత (37 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో పాకిస్తాన్‌ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement