Photo Credit: Twitter
జింబాబ్వే, నమీబియాలతో జరిగిన ట్రై సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఆదివారం విండ్‌హొక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 48 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (29 బంతుల్లో 53), డెవాల్డ్ బ్రెవిస్ (32), కన్నోర్ ఎస్తర్‌హుజిన్ (32) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో న్యూమన్ నైమూరి, బ్రాడ్ ఎవన్స్ చెరో 2 వికెట్లు తీయగా, సికందర్ రజా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ ఎవన్స్ (31 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడం జింబాబ్వే కొంపముంచింది.
సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్, బోర్న్ ఫోర్టున్ చెరో 3 వికెట్లు తీయగా, ఈథన్ బోస్క్ 2 వికెట్లు పడగొట్టాడు. మెరుపు అర్థసెంచరీ సాదించిన జోర్డాన్ హెర్మన్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 226 పరుగులు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎగరేసుకుపోయాడు.
🚨 MATCH RESULT 🚨#TheProteas seal a commanding 48 run victory over Zimbabwe to clinch the T20I Tri-Series title in Namibia! 🇿🇦🏆
A statement finish from South Africa as they get their hands on the trophy! 💪#Unbreakable pic.twitter.com/6c1TqCqSDe— Proteas Men (@ProteasMenCSA) September 6, 2026


