breaking news
South Africa vs Zimbabwe
-
వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా యువ క్రికెటర్ జోరిచ్ వాన్ షాల్విక్ (Jorich Van Schalkwyk) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేల్లో డబుల్ సెంచరీ (Double Century) సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. జింబాబ్వే అండర్-19 జట్టుతో మ్యాచ్ సందర్భంగా జోరిచ్ ఈ ఘనత సాధించాడు.విధ్వంసకర ఇన్నింగ్స్మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా అండర్-19 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో జోరిచ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.కేవలం 153 బంతుల్లోనే 215 పరుగులు సాధించాడు జోరిచ్. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. జోరిచ్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా 385 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 107 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలగా.. 278 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.యూత్ వన్డేల్లో తొలి ద్విశతకంఈ మ్యాచ్ సందర్భంగా యూత్ వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా జోరిచ్ రికార్డు సాధించాడు. గతంలోనూ అతడు 200 పరుగుల మార్కుకు దగ్గరగా వచ్చి మిస్సయ్యాడు. బంగ్లాదేశ్ అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డేలో జోరిచ్ 156 బంతుల్లో 164 పరుగులు సాధించాడు.నాటి మ్యాచ్‌లో బంగ్లా విధించిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా 44.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి ఛేదించింది. అలా ఆరోజు బంగ్లాపై విజయంలో కీలక పాత్ర పోషించిన జోరిచ్ వాన్ షాల్విక్.. తాజాగా జింబాబ్వేతో రికార్డు డబుల్ శతకంతో మెరిశాడు.వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడుఇదిలా ఉంటే.. భారత్ అండర్-19 జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగో యూత్ వన్డేలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే శతకం సాధించి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 78 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఈ మేర భారీ శతకం నమోదు చేశాడు. అయితే, దీనిని డబుల్ సెంచరీగా మలచలేకపోయాడు.అలా వైభవ్ మిస్సయిన ప్రపంచ రికార్డును జోరిచ్ తాజాగా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా భారత్ తరఫున యూత్ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అంబటి రాయుడు కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌తో 2002 నాటి మ్యాచ్‌లో రాయుడు 177 పరుగులు సాధించాడు. అతడి తర్వాతి స్థానాల్లో రాజ్ అంగద్ బవా (2022లో ఉగాండాపై 162), మయాంక్ అగర్వాల్ (160), శుబ్‌మన్ గిల్ (160), వైభవ్ సూర్యవంశీ (143) ఉన్నారు.చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’ -
T20I Tri-Series: ఫైనల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
జింబాబ్వే వేదికగా ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. హరారే వేదికగా ఆదివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. తద్వారా మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఫైనల్లో అడుగుపెట్టింది.145 పరుగులుటాస్ గెలిచిన సౌతాఫ్రికా జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆతిథ్య జట్టు 144 పరుగులు చేసింది. బెనెట్ (61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)... ర్యాన్ బుర్ల్ (36 నాటౌట్) రాణించారు.ఇక సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు పడగొట్టగా... నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి, పీటర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.డసెన్ కెప్టెన్ ఇన్నింగ్స్‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రూబిన్ హెర్మాన్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రాసీ వాన్ డెర్ డసెన్ (41 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు.కాగా జింబాబ్వేతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా అక్కడ పర్యటిస్తోంది. ఈ క్రమంలో టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన న్యూజిలాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.మరోవైపు... తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచిన దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆతిథ్య జింబాబ్వే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలుండగానే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించాయి.తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా మంగళవారం (జూలై 22) తలపడతాయి. అనంతరం గురువారం (జూలై 24) జింబాబ్వే- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. ఇక శనివారం (జూలై 26) న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్‌తో ఈ సిరీస్ ముగుస్తుంది. చదవండి: IND vs ENG: నితీశ్ రెడ్డి అవుట్! -
కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే
క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వియాన్ ముల్డర్ (Wiaan Mulder). ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 367 పరుగులతో దుమ్ములేపాడు.కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. అజేయ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రొటిస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (Brian Lara) పేరిట క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డుకు చేరవయ్యాడు. అయితే, అనూహ్యంగా తాను 367 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ముల్డర్ ఆశ్చర్యపరిచాడు.లారా వంటి లెజండరీ బ్యాటర్ పేరిటే ఈ రికార్డు ఉండాలని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ముల్డర్‌పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షమూ కురిసింది. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకేనని. అయినా అతడేమీ 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయదంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.లారా రియాక్షన్ ఇదేతాజాగా ఈ విషయం గురించి వియాన్ ముల్డర్ స్పందించాడు. తన అభిప్రాయంతో లారా ఏకీభవించలేదంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘నాకు కాస్త విరామం దొరికినపుడు.. బ్రియన్ లారాతో మాట్లాడాను. నీకంటూ సొంత లెగసీ సృష్టించుకోవాలని ఆయన నాతో అన్నాడు.నీకోసమే నువ్వు ఆడాలని చెప్పాడు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని... మరోసారి గనుక నేను ఇలా 400కు చేరువగా వస్తే మాత్రం.. అప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పాడు.నా నిర్ణయం సరైందేనిజానికి ఇప్పుడు నేను బ్యాటింగ్ కొనసాగించి.. తనకంటే ఎక్కువ స్కోరు చేస్తే సంతోషించేవాడినని నాతో అన్నాడు. ఆయనలో ఉన్న గొప్పదనం అదే. అయితే, ఇప్పటికీ నా నిర్ణయం సరైందేనని నేను భావిస్తున్నా. ఆటను, దిగ్గజాలను గౌరవించడం అన్నిటికంటే ముఖ్యం’’ అని వియాన్ ముల్డర్ సూపర్స్పోర్ట్తో వ్యాఖ్యానించాడు.మిస్ చేసుకున్నావుకాగా వియాన్ ముల్డర్ గురించి మరో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘అతడు తప్పు చేశాడు. 400 కొట్టేందుకు అతడు ప్రయత్నించి ఉండాల్సింది. అలా అయితేనే కదా.. క్వాడ్రపుల్ సెంచరీ చేసేవాడో లేదో తెలిసేది. కానీ 367 పరుగుల వద్ద ఉన్నపుడు డిక్లేర్ చేశాడు.తానేం చెప్పదలచుకున్నాడో అది చెప్పేశాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తాయి. టెస్టు ఇన్నింగ్స్‌లో 400 రన్స్ మామూలు విషయం కాదు. ఈసారి నువ్వు ఇది మిస్ చేసుకున్నావు’’ అంటూ విమర్శించాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నయా చాంపియన్ సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. తొలి టెస్టులో కేశవ్ మహరాజ్ సారథ్యంలో.. రెండో టెస్టులో ముల్డర్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.చదవండి: ప్యాట్ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి -
లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?
‘‘ట్రిపుల్ సెంచరీ సంగతేమో గానీ డబుల్ సెంచరీ చేస్తానని కూడా కలలో అనుకోలేదు. లారా ఒక దిగ్గజం. 400 రికార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయంపై కోచ్‌తో చర్చించా. దిగ్గజాల పేరిటే అలాంటి రికార్డు ఉండటం సబబని భావించాం. ఆ ఘనత లారా పేరిట ఉండటమే సరైంది’’.. జింబాబ్వేపై త్రిశతకం బాదిన తర్వాత సౌతాఫ్రికా స్టార్ వియాన్ ముల్డర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తనకు క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా.. లారా మీద గౌరవంతో మాత్రమే.. ఆ ఫీట్ జోలికి వెళ్లలేదని చెప్పాడతడు.ఈ నేపథ్యంలో వియాన్ ముల్డర్‌పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే లాంటి పసికూన మీద ట్రిపుల్ సెంచరీ బాదడం కాస్త సులువేనని.. అయినా.. 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే దానిని త్యాగం అంటారు గానీ.. 367 వద్ద డిక్లేర్ చేయడం ఏమిటంటూ అతడి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్గాఇంతకీ విషయం ఏమిటంటే.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుపై తొలి టెస్టులో గెలిచిన ప్రొటిస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టెస్టులో ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బులవాయో వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేయగా.. సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.కాగా సోమవారం నాటి రెండో రోజు ఆటను వియాన్ ముల్డర్ ఓవర్‌నైట్ స్కోరు 264తో మొదలు పెట్టాడు... రెండో రోజు మరో 38 బంతులు ఆడే సరికి అతడి ‘ట్రిపుల్ సెంచరీ’ పూర్తయింది... మరో 5 బంతుల తర్వాత దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో టాప్ స్కోరర్ రికార్డు సొంతమైంది... ఆ తర్వాత మరిన్ని రికార్డుల వేట మొదలైంది... జోరు కొనసాగిస్తూ దిగ్గజాలను దాటుకుంటూ పోయాడు... సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, గూచ్, డాన్ బ్రాడ్‌మన్, మార్క్ టేలర్, హనీఫ్, జయసూర్య, గ్యారీ సోబర్స్... ఇలా అందరిని అధిగమించి టాప్–5లోకి వచ్చేశాడు. 367 పరుగులకు చేరాక లంచ్ విరామం వచ్చింది.మరో 34 పరుగులు చేస్తే చాలుఇక తదుపరి లక్ష్యం బ్రియాన్ లారా 400 పరుగుల ఘనత... మరో 34 పరుగులు చేస్తే చాలు టెస్టు చరిత్రలో అతను శిఖరాన నిలిచిపోతాడు. కానీ దక్షిణాఫ్రికా శిబిరం నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. ఈ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు. 367 పరుగులతో నాటౌట్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. లారాను దాటకపోయినా... తన అద్భుత బ్యాటింగ్‌తో అతను ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఈ క్రమంలోనే లారా రికార్డును టచ్ చేయకూడదనే ఉద్దేశంతోనే తాను 400కు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?ఈ నేపథ్యంలో.. ‘‘ప్రతి ఒక్కరు వియాన్ ముల్డర్లా నిస్వార్థంగా ఉంటే.. ఈ ప్రపంచం ఎంతో బాగుండేది’’ అని కొంత మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు చేసిన పని తప్పు అని విమర్శిస్తున్నారు. ‘‘ఒకవేళ ముల్డర్ లారా పట్ల గౌరవం ప్రదర్శించాలని భావిస్తే.. 399 వరకు ఆడి అప్పుడు డిక్లేర్ చేయాల్సింది.లారాను గౌరవిస్తున్నాడు సరే.. మరి హెడెన్, జయవర్దనే, సోబర్స్ ఇలా అందరినీ గౌరవించాలి కదా! అయినా ఆటల్లో రికార్డులు ఉన్నవే బద్దలు కొట్టడానికి కదా! అసాఫా పావెల్ కోసం ఉసేన్ బోల్ట్ నెమ్మదిగా పరిగెత్తలేడు..ఏదేమైనా ఇక్కడ ప్రత్యర్థిని ఆడించి.. ఆలౌట్ చేసి గెలవాలంటే సౌతాఫ్రికాకు సమయం కావాలి. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. కానీ ముల్డర్ తానేదో త్యాగం చేస్తున్నట్లు చెప్పడం సరికాదు’’ అని ట్రోల్ చేస్తున్నారు. -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ‘కెప్టెన్’.. సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్‌లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 465 పరుగుల భారీస్కోరు చేసింది.బౌలర్ల భరతం పట్టాడుఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా జట్టుకు తొలిసారి సారథ్యం వహిస్తున్న ముల్డర్ (Wiaan Mulder) వన్డేను తలపించే ఆట ఆడేశాడు. ఎదుర్కొన్న బంతులకంటే బాదిన పరుగులే ఎక్కువున్నాయి. బౌండరీలైతే మంచినీళ్ల ప్రాయంగా దంచేశాడు. జట్టు స్కోరు 11 వద్ద టోని డి జార్జి (10), 24 పరుగులకే సెనొక్వనే (3) ఇలా ఓపెనర్లు నిష్క్రమించిన వేళ... వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు.ఇక బెడింగ్హామ్ (82; 7 ఫోర్లు)తో మూడో వికెట్‌కు 184 పరుగులు జోడించిన ముల్డర్ రెండో సెషన్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్లో ప్రిటోరియస్ (78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 217 పరుగులు జోడించాడు. దీంతో అఖరి సెషన్లో అతని డబుల్ సెంచరీ, జట్టు 400 పరుగుల మార్క్‌ను వేగంగా అందుకుంది.తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముల్డర్, బ్రెవిస్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తనక చివంగకు 2 వికెట్లు దక్కగా, మతిగిము, మసకద్జా చెరో వికెట్ తీశారు. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో సఫారీ 328 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ముల్దర్కెప్టెన్ హోదాలో ఆడిన తొలి టెస్టులో.. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 నాటౌట్) చేసిన ప్లేయర్‌గా వియాన్ ముల్డర్ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా.. న్యూజిలాండ్ కెప్టెన్ గ్రాహమ్ డౌలింగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డును ఈ సందర్భంగా ముల్డర్ బద్దలు కొట్టాడు.టెస్టు కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే🏏వియాన్ ముల్డర్ (సౌతాఫ్రికా)- 2025లో బులవాయో వేదికగా జింబాబ్వేపై 264 రన్స్ నాటౌట్🏏గ్రాహమ్ డౌలింగ్ (Graham Dowling- న్యూజిలాండ్)- 1968లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా టీమిండియాపై 239 రన్స్🏏శివ్‌నరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్)- 2005లో జార్జ్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా మీద 203 రన్స్ నాటౌట్🏏క్లెమ్ హిల్ (ఆస్ట్రేలియా)- 1910లో సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాపై 191 రన్స్🏏జో రూట్ (ఇంగ్లండ్)- 2017లో లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాపై 190 రన్స్🏏అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)- 2017లో చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌పై 173 రన్స్🏏విజయ్ హజారే (ఇండియా)- 1954లో ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌పై 164 నాటౌట్🏏క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్)- 1974లో బెంగళూరు వేదికగా టీమిండియాపై 163 రన్స్.ముల్డర్.. మరిన్ని రికార్డులు👉అదే విధంగా... టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా ముల్డర్ రికార్డు నెలకొల్పాడు. హెర్షల్ గిబ్స్ (228; 2003లో పాకిస్తాన్‌పై కేప్‌టౌన్‌లో) పేరిట ఉన్న రికార్డును ముల్డర్ సవరించాడు.👉అంతేకాదు.. టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ముల్డర్ (264) ఘనత వహించాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (309; 1930లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై), వీరేంద్ర సెహ్వాగ్ (284; 2009లో ముంబైలో శ్రీలంకపై), డాన్ బ్రాడ్‌మన్ (271; 1934లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 👉ఇక టెస్టు మ్యాచ్ తొలి రోజున దక్షిణాఫ్రికా చేసిన అత్యధిక స్కోరు (465) ఇదే కావడం విశేషం. 2003లో పాకిస్తాన్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 445 పరుగులు చేసింది.క్లీన్ స్వీప్ లక్ష్యంగా..కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా.. రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో పర్యాటక ప్రొటిస్ జట్టు.. జింబాబ్వేను 328 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. పాపం పసికూన!
జింబాబ్వేతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 328 పరుగుల భారీ తేడాతో ఓడించి జయభేరి మోగించింది. కీలక ఆటగాళ్లు జట్టుతో లేకపోయినా ప్రొటిస్ జట్టు ఆద్యంత ఆధిపత్యం కనబరిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.అరంగేట్రంలోనే సత్తా చాటిన చిచ్చరపిడుగులుప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా.. తొలుత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma)తో పాటు ఐడెన్ మార్క్రమ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సారథ్యంలో లువాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్ టెస్టులలో అరంగేట్రం చేశారు.ఇక బులవాయో వేదికగా జూన్ 28న మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ టీనేజర్లు లువాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్ అదరొట్టారు. ప్రిటోరియస్ భారీ శతకం (153) బాదగా.. బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు.వీరిద్దరికి తోడు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ శతకం (100 నాటౌట్)తో చెలరేగాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగుల వద్ద ప్రొటిస్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో టనకా చివాంగ నాలుగు వికెట్లు తీయగా.. ముజర్బానీ రెండు, మసకజ్ద, మసేకెస ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 251 పరుగులకే ఆలౌట్ ఇక తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 251 పరుగులకే ఆలౌట్ అయింది. సీన్ విలియమ్స్ (137) శతక్కొట్టగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రొటిస్ బౌలర్లలో వియాన్ ముల్డర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ కేశవ్ మహరాజ్, కోడి యూసఫ్ చెరో మూడు వికెట్లు తీశారు.ఈ క్రమంలో 167 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈసారి వియాన్ ముల్డర్ (147) శతకంతో ఆకట్టుకోగా.. కేశవ్ మహరాజ్ హాఫ్ సెంచరీ (51) చేశాడు.జింబాబ్వే బౌలర్లలో ఈసారి మసకజ్ద నాలుగు, చివాంగ, మసెకెస రెండేసి వికెట్లు తీయగా.. ముజర్బానీ, మెధెవెరె చెరో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని సౌతాఫ్రికా జింబాబ్వేకు 537 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 208 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా భారీ గెలుపు దక్కించుకుంది.మరోవైపు.. టెస్టుల్లో జింబాబ్వేకు ఇదే అతిపెద్ద పరాజయం. ఇదిలా ఉంటే.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో కార్బిన్ బాష్ ఐదు వికెట్లతో చెలరేగగా.. యూసఫ్ మూడు, కేశవ్ మహరాజ్, డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా 19 ఏళ్ల చిచ్చరపిడుగు ప్రిటోరియస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 418/9 d & 369జింబాబ్వే: 251 & 208.చదవండి: IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్‌కు రుతురాజ్?! -
సీన్ విలియమ్స్ సూపర్ సెంచరీ.. తప్పిన ఫాలో ఆన్ గండం
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో జింబాబ్వే ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (Sean Williams- 164 బంతుల్లో 137; 16 ఫోర్లు) సెంచరీ సాధించి ఈ మేరకు ఊరట కల్పించాడు. బులవాయో వేదికగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (90 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బ్రియాన్ బెనెట్ (19), కిటానో (0), నిక్ వెల్చ్ (4), వెస్లీ మధెవెరె (15), ప్రిన్స్ (7), తఫద్జా ట్సిగా (9), మసకద్జా (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు.ముల్డర్‌కు నాలుగు వికెట్లుఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ 4 వికెట్లు పడగొట్టగా... కేశవ్ మహరాజ్, యూసుఫ్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.ఓపెనర్లలో మాథ్యూ బ్రీజ్కె (1) అవుట్ కాగా... టోనీ డి జోర్జి (22 బ్యాటింగ్; 2 ఫోర్లు).. వన్‌డౌన్ బ్యాటర్ ముల్డర్ (25 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 418/9 వద్దే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఓవరాల్‌గా చేతిలో 9 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ప్రస్తుతం 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తద్వారా జింబాబ్వేతో తొలి టెస్టులో పట్టు బిగించింది.కేశవ్ మహరాజ్@ 200ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న కేశవ్ మహరాజ్... అరుదైన ఘనత సాధించాడు. సఫారీ జట్టు తరఫున 200 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వే కెప్టెన్ ఇరి్వన్ను అవుట్ చేయడం ద్వారా కేశవ్ మహరాజ్ సుదీర్ఘ ఫార్మాట్లో 200వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 9 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 35 ఏళ్ల కేశవ్... ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 202 వికెట్లు పడగొట్టాడు. -
అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్
జింబాబ్వే-దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడతున్నాయి. ఈ సిరీస్‌కు ప్రోటీస్ రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరం కాగా.. కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే- సౌతాఫ్రికా (ZIM vs SA) మధ్య శనివారం తొలి టెస్టు ఆరంభమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా జట్టు.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కుప్పకూలిన టాపార్డర్ఈ క్రమంలో ఆతిథ్య జింబాబ్వే బౌలర్లు ధాటిగా తమ అటాకింగ్ ఆరంభించారు. టనకా చివాంగ దెబ్బకు ఓపెనర్లు టోనీ డి జోర్జి (0), మాథ్యూ బ్రీట్జ్కే (13) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (17) రనౌట్ కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.లువాన్-డ్రి ప్రిటోరియస్, బాష్ శతకాలుఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అరంగేట్ర బ్యాటర్ లువాన్-డ్రి ప్రిటోరియస్ (Lhuan-Dre Pretorius) భారీ శతకంతో సత్తా చాటాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న పందొమిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (51) అర్ధ శతకంతో మెరవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె (10) మాత్రం నిరాశపరిచాడు.అయితే, బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కూడా శతకంతో చెలరేగడం విశేషం. మిగతా వాళ్లలో కెప్టెన్ కేశవ్ మహరాజ్ 21, కోడీ యూసఫ్ 27 పరుగులు చేశారు. శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. బాష్ 100, క్వెనా మఫాకా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.చరిత్ర సృష్టించిన ప్రిటోరియస్జింబాబ్వేతో మ్యాచ్‌లో శతక్కొట్టిన లువాన్-డ్రి ప్రిటోరియస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున పురుషుల క్రికెట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. అరంగేట్రంలోనే టెస్టుల్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగానూ నిలవడం విశేషం.ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున 61 ఏళ్లుగా గ్రేమ్ పొలాక్ పేరిట ఉన్న రికార్డును ప్రిటోరియస్ బద్దలు కొట్టాడు. 1964లో ఆస్ట్రేలియా మీద 19 ఏళ్ల 317 రోజుల్లో పొలాక్ సెంచరీ చేయగా.. ప్రిటోరియస్ 19 ఏళ్ల 93 రోజుల వయసులో జింబాబ్వే మీద ఈ ఘనత సాధించాడు.చదవండి: నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్