శ్రీ చరణి, ఇన్‌సెట్‌లో ప్రేమా రావత్ (PC: BCCI Twitter)
మహిళల ఆసియా కప్ టోర్నీలో తెలుగు క్రికెటర్ శ్రీ చరణి మరోసారి తన బౌలింగ్‌తో మెరిసింది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీ చరణి (4-0-7-3) తన కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తాను వేసిన తొలి ఓవర్లోనే శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ చరణి ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.
2026 ఏడాదిలో భారత మహిళల క్రికెట్‌లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీచరణి రికార్డులకెక్కింది. పాక్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా శ్రీ చరణి 34వ వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. తద్వారా 2026 ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది.
రెండో స్థానంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 23 వికెట్లతో కొనసాగుతుండగా, నందని శర్మ 12 వికెట్లు, అరుంధతీ రెడ్డి 11 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 9 వికెట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్ జాబితాలో పూనమ్ రౌత్ 2018లో 35 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కుప్పకూలిన పాక్
ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. షావల్ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మినహా మిగతా 8 మంది బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు చెరో 3 వికెట్ల తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.
టాస్ గెలవడం ఒక్కటే పాకిస్తాన్‌కు ఊరట అని చెప్పొచ్చు. బ్యాటింగ్‌కు దిగిన కాసేపటికే పాక్‌కు భారత బౌలర్లు బొమ్మ చూపించారు. శ్రీ చరణి ఆరంభంలోనూ మూడు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టేయగా, ఆ తర్వాత స్పిన్నర్ ప్రేమా రావత్ బాధ్యతలు తీసుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాక్ బ్యాటర్లు పరుగులు చేయలేక నానా అవస్థలు పడ్డారు.
Innings Break!
An outstanding bowling performance from #TeamIndia! 🙌 🙌
3️⃣ wickets each for Sree Charani & Prema Rawat
2️⃣ wickets for Deepti Sharma
1️⃣ wicket for Shafali Verma
Stay tuned for India's chase! ⌛️
Scorecard ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/e27WuNsSL0— BCCI Women (@BCCIWomen) September 5, 2026
Shree Charani strikes twice in her very first over! 💥
3 wickets in 3 overs.
3-0-6-3.
Match winning performance by Charani.#INDvPAK #ShreeCharani #Dubai #T20 #TeamIndia #PakistanCricket #AsiaCup #WomensCricket pic.twitter.com/PVEQQBZlf1— lightningspeed (@lightningspeedk) September 5, 2026
Read: మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు


