breaking news
Women Asia Cup T20
-
శ్రీ చరణి ప్రపంచ రికార్డు.. 55 పరుగులకే పాక్ ఆలౌట్
మహిళల ఆసియా కప్ టోర్నీలో తెలుగు క్రికెటర్ శ్రీ చరణి మరోసారి తన బౌలింగ్‌తో మెరిసింది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీ చరణి (4-0-7-3) తన కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తాను వేసిన తొలి ఓవర్లోనే శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ చరణి ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2026 ఏడాదిలో భారత మహిళల క్రికెట్లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీచరణి రికార్డులకెక్కింది. పాక్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా శ్రీ చరణి 34వ వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. తద్వారా 2026 ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. రెండో స్థానంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 23 వికెట్లతో కొనసాగుతుండగా, నందని శర్మ 12 వికెట్లు, అరుంధతీ రెడ్డి 11 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 9 వికెట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్ జాబితాలో పూనమ్ రౌత్ 2018లో 35 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.కుప్పకూలిన పాక్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. షావల్ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మినహా మిగతా 8 మంది బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు చెరో 3 వికెట్ల తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.టాస్ గెలవడం ఒక్కటే పాకిస్తాన్‌కు ఊరట అని చెప్పొచ్చు. బ్యాటింగ్‌కు దిగిన కాసేపటికే పాక్‌కు భారత బౌలర్లు బొమ్మ చూపించారు. శ్రీ చరణి ఆరంభంలోనూ మూడు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టేయగా, ఆ తర్వాత స్పిన్నర్ ప్రేమా రావత్ బాధ్యతలు తీసుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాక్ బ్యాటర్లు పరుగులు చేయలేక నానా అవస్థలు పడ్డారు.Innings Break!An outstanding bowling performance from #TeamIndia! 🙌 🙌3️⃣ wickets each for Sree Charani & Prema Rawat2️⃣ wickets for Deepti Sharma1️⃣ wicket for Shafali VermaStay tuned for India's chase! ⌛️Scorecard ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/e27WuNsSL0— BCCI Women (@BCCIWomen) September 5, 2026 Shree Charani strikes twice in her very first over! 💥 3 wickets in 3 overs.3-0-6-3.Match winning performance by Charani.#INDvPAK #ShreeCharani #Dubai #T20 #TeamIndia #PakistanCricket #AsiaCup #WomensCricket pic.twitter.com/PVEQQBZlf1— lightningspeed (@lightningspeedk) September 5, 2026Read: మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్
మహిళల ఆసియా కప్ టోర్నీ-2026లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలయ్యింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. థాయ్‌లాండ్, హాంకాంగ్‌లపై విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అజేయంగా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాబితాలో హర్మన్ తొలి స్థానంలో నిలిచింది. హర్మన్‌కు కెప్టెన్‌గా ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. పురుషుల, మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యహరించిన రికార్డు హర్మన్ పేరిటే ఉంది. ఈ జాబితాలో చమేరీ ఆటపట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ (100 మ్యాచ్‌లు), హెథర్ నైట్ (96 మ్యాచ్‌లు, ఇంగ్లండ్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(వికెట్ కీపర్), షావాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా(కెప్టెన్), ఉమ్-ఎ-హనీ, ఈమాన్ ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.🚨 𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗠𝗼𝗺𝗲𝗻𝘁, 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝗮𝗹 𝗠𝗼𝗺𝗲𝗻𝘁 🚨Harmanpreet Kaur becomes the first cricketer to captain a side in 1️⃣5️⃣0️⃣ T20Is. 👏 👏Updates ▶️ https://t.co/1WHHWPMe2o#TeamIndia | #WomensAsiaCup | @ImHarmanpreet pic.twitter.com/WrdFlp7kcH— BCCI Women (@BCCIWomen) September 5, 2026 🚨 Toss and Playing XI Update #TeamIndia will bowl first and here's our line-up for the match 🔽Updates ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/69Jmw9YgUu— BCCI Women (@BCCIWomen) September 5, 2026Read: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో అదరగొడుతుంది. పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధన శతకంతో మెరిసింది. 64 బంతుల్లో 124 పరుగులు సాధించిన స్మృతి మంధాన మహిళల టీ20 క్రికెట్లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకుంది. సెంచరీతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ కన్నీళ్లు సంతోషంతోనే తప్ప బాధతో వచ్చనవి కావని మంధాన మీడియాతో పేర్కొంది.అనంతరం మ్యాచ్‌లో మీరు చేసిన సెంచరీని ఎవరికి అంకితం చేస్తారని ప్రశ్న వేయగా.. ‘‘ఈ సెంచరీని అంకితం చేయడానికి నా మైండ్‌లో ఎవరు లేరు. కానీ ఈ శతకాన్ని మాత్రం కచ్చితంగా నా ఫ్యామిలీకే అంకితమిస్తాను. హాంకాంగ్‌తో తొలిసారి మ్యాచ్ ఆడుతున్నందున ఆ జట్టు గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు. వాళ్ల బౌలింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను మ్యాచ్‌కు ముందు రోజు వీక్షించాము. Photo Credit: BCCI Twitterఒక తెలియని బౌలర్ మన ముందుకు వచ్చినప్పుడు వారి గురించి కాకుండా ఆటపై మాత్రమే దృష్టిపెడతాను. వస్తాను, బంతిని చూస్తాను, కొడతాను అన్న తరహాలోనే నా బ్యాటింగ్ కొనసాగుతుంది. అయితే పవర్ ప్లేలో కొన్ని ఫుల్‌టాస్ బంతులను వదిలేశాను. నిజానికి ఫుల్‌టాస్ బంతులు నా బలం కాదు.. బలహీనత. వాటిని వదిలేసినప్పుడు మనసులో కాస్త సంతోషపడ్డాను. ఎందుకంటే అప్పుడు వదిలేయకుంటే సెంచరీ వచ్చేది కాదేమో. Photo Credit: BCCI Twitterటాపార్డర్‌లో ఆడుతాం కాబట్టే బ్యాటర్‌కు సెంచరీ చేసే అవకాశం వస్తోంది. టీ20 క్రికెట్లో టాపార్డర్ మినహా మిగతా ఏ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఈ సెంచరీతో నేను ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టానన్న విషయం నాకు తెలియదు. ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ రికార్డులేంటన్నివి చూశాను’’ అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు. THE HISTORIC MOMENT FOR SMRITI MANDHANA. pic.twitter.com/v12EhZPgwY— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2026చదవండి: టీ20 క్రికెట్లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్ -
టీ20 క్రికెట్లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నమీబియా, హాంకాంగ్‌లపై గెలుపుతో హర్మన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. గురువారం రాత్రి హాంకాంగ్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగు క్రికెటర్ శ్రీ చరణి అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీ చరణి 31 వికెట్లు పడగొట్టింది. Photo Credit: BCCI Twitterతద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీ చరణి రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పూనమ్ యాదవ్ (2018లో 35 వికెట్లు), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (2024లో 30 వికెట్లు, 2022లో 29 వికెట్లు) మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించింది. 2024లో రాధా యాదవ్ 29 వికెట్లు తీసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్ ఇంకా ముగియకపోవడంతో శ్రీ చరణి అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో త్వరలోనే టాప్ స్థానానికి చేరుకునే అవకాశముంది.Photo Credit: BCCI Twitter👉137- మహిళల టీ20 క్రికెట్లో పరుగుల పరంగా హాంకాంగ్‌పై భారత జట్టుకు రెండో అతి పెద్ద విషయం. గతంలో 2018 ఆసియా కప్‌లో మలేషియా వుమెన్స్‌పై 142 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది.👉మహిళల ఆసియా కప్ టీ20 చరిత్రలో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 137 పరుగుల విజయం నాలుగో అతిపెద్దది. తొలి స్థానంలో పాకిస్తాన్ వుమెన్స్ 147 పరుగుల తేడాతో మలేషియా వుమెన్స్‌పై విజయం సాధించగా, రెండో స్థానంలో శ్రీలంక వుమెన్స్ (144 పరుగులు వర్సెస్ మలేషియా) కొనసాగుతుండగా, ఇండియా వుమెన్ (142 పరుగులు వర్సెస్ మలేషియా) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: లంక బ్యాటర్ శివతాండవం.. 39 బంతుల్లోనే సెంచరీ -
11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్
మహిళల ఆసియా కప్-2026 టోర్నీని భారత్ విజయంతో ఆరంభించింది. ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో హర్మన్ సేన ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్ల కోల్పోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(64) టాప్ స్కోరర్ నిలవగా.. 11 వస్ధానంలో బ్యాటింగ్ వచ్చిన పేసర్ క్రాంతి గౌడ్(8 బంతుల్లోనే 15 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో క్రాంతి గౌడ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ( మెన్స్ అండ్ ఉమెన్స్ విభాగాలలో కలిపి) 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా క్రాంతి రికార్డులకెక్కింది. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఏ భారత బ్యాటర్ కూడా పదకొండో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి డబుల్ డిజిట్ స్కోరు సాధించలేదు. గతంలో సిరాజ్, శ్రీ చరణి నెలకొల్పిన ఏడు పరుగుల రికార్డును క్రాంతి దాటేసింది.కుప్పకూలిన థాయ్అనంతరం లక్ష్య చేధనలో థాయ్‌లాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. నందినీ శర్మ, దీప్తీ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి థాయ్ జట్టు పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు తెలుగు తేజం శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో నన్నపత్ కొంచరోయెంకై(41) టాప్ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: పాకిస్తాన్ ఖేల్ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అవుట్! -
భారత్ బోణీ అదిరె
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 94 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ షఫాలీ వర్మ (36 బంతుల్లో 64; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో అదరగొట్టింది.ప్రతీక రావల్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (19; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టాప్–3 రాణించడంతో 8.5 ఓవర్లలో 91/1తో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. థాయ్‌లాండ్ బౌలర్లలో లవోమి 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నన్నపట్ కొంచరోన్కై (48 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. 150వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన దీప్తి శర్మ ఒక్క పరుగు ఇవ్వకుండానే 3 వికెట్లు పడగొట్టడం విశేషం. నందని శర్మ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం హాంకాంగ్‌తో ఆడుతుంది. నేడు బంగ్లాదేశ్‌తో ఇండోనేసియా తలపడనుంది.ప్రతీక @ 95ఈ మ్యాచ్ ద్వారా ప్రతీక రావల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 95వ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. గాయంతో జెమీమా రోడ్రిగ్స్ ఆసియా కప్‌నకు దూరం కాగా... ఆమె స్థానంలో ప్రతీకాకు చోటు దక్కింది. ఢిల్లీకి చెందిన ప్రతీక ఇప్పటికే టీమిండియా తరఫున ఒక టెస్టు, 27 వన్డేలు ఆడింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ చేతుల మీదుగా ప్రతీక క్యాప్ అందుకుంది. కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ, నందని శర్మ, ప్రేమ రావత్ తర్వాత ఈ ఏడాది భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన ఐదో క్రికెటర్‌గా ప్రతీక నిలిచింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (రనౌట్) 19, షఫాలీ (సి అండ్ బి) లయోమి 64; ప్రతీక (బి) లయోమి 22; హర్మన్‌ప్రీత్ (సి) మాయ (బి) పుథవాంగ్ 5; భారతి (సి) సువంచోన్రాఠి (బి) చతురోంగ్రత్నా 13; రిచా (సి) పుథవాంగ్ (బి) లయోమి 0; దీప్తి (రనౌట్) 5; ప్రేమ (స్టంప్డ్) కొంచరోన్కై (బి) చతురోంగ్రత్నా 6; నందని (బి) సుథిరువాంగ్ 1; శ్రీచరణి (నాటౌట్) 6; క్రాంతి (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–38, 2–91, 3–108, 4–112, 5–112, 6–127, 7–136, 8–137, 9–137. బౌలింగ్: మాయ 3–0–31–0; పుథవాంగ్ 4–0–37–1; చతురోంగ్రత్నా 3–0–31–2; ఒన్నిచా 3–0–19–0; లయోమి 4–0–26–3; సుథిరువాంగ్ 3–0–14–1. థాయ్‌లాండ్ ఇన్నింగ్స్: నథాకాన్ (బి) క్రాంతి 4; మాయ (సి) ప్రతీక (బి) నందని 6; కొంచరోన్కై (సి) రిచా (బి) దీప్తి 41; సువంచోన్రాఠి (ఎల్బీ) శ్రీచరణి 1; సుథిరువాంగ్ (సి) స్మృతి (బి) శ్రీచరణి 5; నయోమి (ఎల్బీ) (బి) దీప్తి 1; చైహాన్ (సి) నందని (బి) దీప్తి 0; లయోమి (సి) షఫాలీ (బి) నందని 6; చతురోంగ్రత్నా (సి) రిచా (బి) నందని 0; ఒన్నిచా (రనౌట్) 0; పుథవాంగ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 65. వికెట్ల పతనం: 1–4, 2–16, 3–35, 4–43, 5–44, 6–44, 7–60, 8–60, 9–60, 10–65. బౌలింగ్: క్రాంతి 4–0–26–1; నందని 4–0– 18–3; శ్రీచరణి 3–0–10–2; ప్రేమ 4–1–11–0; దీప్తి 1.1–1–0–3. -
షెఫాలీ వర్మ విధ్వంసం.. థాయ్‌లాండ్ టార్గెట్ 160 రన్స్
మహిళల ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఓపెనర్ షెఫాలీ వర్మ (36 బంతుల్లో 64) అర్ధసెంచరీతో చెలరేగగా, డెబ్యూ బ్యాటర్ ప్రతీక రావల్ (22) ఆకట్టుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (19; 10 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. భారతీ 13 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5), దీప్తి శర్మ (5), రిచా ఘోష్ (0) నిరాశపర్చారు. చివర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్), శ్రీచరణి (6 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ 150 పరుగుల మార్క్‌ను దాటింది.థాయ్‌లాండ్ బౌలర్లలో సుప్లీపోర్న్ 3 వికెట్లు పడగొట్టింది.మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది.చదవండి: థాయ్‌లాండ్‌తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు -
టీ20 క్రికెట్లో దీప్తి శర్మ అరుదైన ఫీట్
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్ వుమెన్‌తో మ్యాచ్‌కు ముందే భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్ దీప్తి శర్మకు 150వ టీ20 కావడం విశేషం. ఈ నేపథ్యంలో భారత్ తరఫున మహిళల క్రికెట్లో 150 టీ20 ఆడిన మూడో ప్లేయర్‌గా దీప్తి శర్మ నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (202 మ్యాచ్‌లు), స్మృతి మంధన (171 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒక ఓవరాల్‌గా మహిళల క్రికెట్లో 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన 12వ క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇప్పటివరకు దీప్తి శర్మ 149 టీ20 మ్యాచ్‌ల్లో 1270 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 168 వికెట్లు పడగొట్టింది.దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది.From 1st T20I to 1⃣5⃣0⃣th 🙌From a young debutant to an experienced all-rounder 👌Deepti Sharma is all set for a special game today 🤗 - By @mihirlee_58#TeamIndia | #WomensAsiaCup | @Deepti_Sharma06 pic.twitter.com/73HWwNQyUr— BCCI Women (@BCCIWomen) August 30, 2026Read: థాయ్‌లాండ్‌తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు -
థాయ్‌లాండ్‌తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు
ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్ వుమెన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మంధన రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుజీ బేట్స్ (10,740 పరుగులు)ను అధిగమించింది. ప్రస్తుతం మంధన మూడు ఫార్మాట్లు కలిపి 10,750 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక తొలి స్థానంలో భారత దిగ్గజం మిథాలీరాజ్ (10,868 పరుగులు) ఉండగా, సుజీ బేట్స్ మూడో స్థానంలో ఉంది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (10, 273 పరుగులు), స్టెఫానీ టేలర్ (10,007 పరుగులు) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది.Read: టాస్ గెలిచిన థాయ్‌లాండ్.. ప్రతీక రావల్ అరంగేట్రం -
టాస్ గెలిచిన థాయ్‌లాండ్.. ప్రతీక రావల్ అరంగేట్రం
మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్, థాయ్‌లాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. టాస్ అనంతరం హర్మన్ మాట్లాడుతూ.. ఒకవేళ తాము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని హర్మన్ తెలిపింది. దుబాయ్‌లో తమకు ఇదే తొలి మ్యాచ్ అని పేర్కొన్న హర్మన్, మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. జెమీమా అందుబాటులో లేకపోవడంతోనే ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చిందని హర్మన్ తెలిపింది.టీమిండియా ఉమెన్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.థాయ్‌లాండ్ వుమెన్ (ప్లేయింగ్ XI): అఫిసర సువాన్చోంరాతి, నట్టకాన్ చంతమ్, ఫన్నిత మాయ, నన్నపట్ కొంచరోయెంకై(వికెట్ కీపర్), చనిదా సుత్తిరువాంగ్, నవోమి హామిల్టన్, సులీపోర్న్ లావోమి, నన్నఫట్ చైహాన్, సునిదా చతురోంగ్రత్తనా, తిపచ్చో పుత్థూవాంగ్ (కెప్టెన్), ఒన్నిచా కంచోంపు.A look at #TeamIndia's playing XI for the opening game. Pratika Rawal makes her debut. #AsiaCup #INDvTHAI pic.twitter.com/QYOn1U616T— BCCI Women (@BCCIWomen) August 30, 2026Read: లార్డ్స్‌లో పాక్ బౌలర్ అరుదైన ఫీట్.. అక్రమ్ వల్ల కాలేదు! -
అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్
మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.అందుకే ఓడిపోయాంస్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది. -
ధనాధన్ ఇన్నింగ్స్.. కెరీర్ బెస్ట్ స్కోర్! కానీ..
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.ఓవరాల్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
పసికూనను చిత్తు చేసిన పాక్... సెమీస్ రేసులో
వుమెన్స్ ఆసియా కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందడుగు వేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఆసియా టోర్నీలో పాక్ తొలుత భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన చేతిలో.. నిదా దర్ బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించి గెలుపు బాటపట్టింది. తాజాగా యూఏఈని పది వికెట్లు తేడాతో ఓడించింది. డంబుల్లా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ పాక్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులే చేసింది. పాక్ స్పిన్నర్లు నష్రా సంధు, సైదా ఇక్బాల్, తూబా హసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిదా దర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక యూఏఈ విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా(55 బంతుల్లో 62), మునీబా అలీ (30 బంతుల్లో 37) అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు కలిసి 14.1 ఓవర్లలో 107 పరుగులు జోడించి పాక్‌ను గెలిపించారు. ఫలితంగా పాక్ మహిళా జట్టు ఆసియా కప్-2024 సెమీ ఫైనల్ రేసులోకి దూసుకువచ్చింది.కాగా ఆసియా కప్-2024లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.పాకిస్తాన్ మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది. ఇక గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో పాక్ తమ మూడు మ్యాచ్‌లు ఆడేయగా.. భారత్ మంగళవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారవుతాయి.చదవండి: IPL 2025: మెగా వేలం.. రోహిత్ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు -
విజృంభించిన భారత బౌలర్లు.. 65 పరుగులకే పరిమితమైన శ్రీలంక
మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఏ దశలోను భారత్‌కు పోటీ ఇవ్వ లేకపోయింది. భారత పేసర్ రేణుకా సింగ్ ఈ కీలక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: T20 World Cup 2022: ఫేవరెట్ ఎవరు.. ఆసీస్ గడ్డపై అత్యధిక విజయశాతం ఎవరిది? -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్
మహిళల ఆసియాకప్ టి20 టోర్నీలో శ్రీలంక వుమెన్స్ ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం పాకిస్తాన్ వుమెన్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మరి ఒక్క పరుగు విజయంతో ఫైనల్‌కు చేరామంటే ఆ సంతోషం మాములుగా ఉండదు కదా. అందుకే మ్యాచ్ గెలిచిన ఆనందంలో శ్రీలంక మహిళా క్రికెటర్లు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఆటగాళ్లంతా ఒకేసారి కలిసి స్టెప్పులేస్తూ ఆడిపాడారు. ప్రస్తుతం లంక క్రికెటర్స్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక వుమెన్స్.. టీమిండియా మహిళలతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాక్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత నెలలో జరిగిన పురుషుల ఆసియా కప్ టి20 టోర్నీ విజేతగా షనక నేతృత్వంలోని శ్రీలంక గెలిచింది. ఈ విజయం ఆ దేశానికి పెద్ద ఊరటను ఇచ్చింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా లంక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి బయటపడుతున్న లంకకు క్రికెట్ కొత్త ఊపిరినిస్తుంది. నెల వ్యవధిలోనే అటు పురుషుల టీమ్ ఆసియా కప్‌ను గెలవగా.. ఇటు మహిళల టీమ్ కూడా ఫైనల్‌కు చేరుకుంది. మరి లంక వుమెన్స్ టైటిల్ గెలుస్తుందా లేక టీమిండియా మహిళలకు దాసోహమంటారా చూడాలి. #ApeKello celebrating in style 💃 Sri Lanka qualified for the finals of the Women’s #AsiaCup2022 after winning against Pakistan by 1 run. pic.twitter.com/WXHkGcQJdd — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 13, 2022 చదవండి: ఎఫ్-1 రేసులో అపశృతి.. రేసర్ వెన్నుముక విరిగింది -
పాక్‌ను మట్టికరిపించిన శ్రీలంక.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ
మహిళల ఆసియా కప్-2022లో ఇవాళ (అక్టోబర్ 13) ఉత్కంఠ పోరు జరిగింది. పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ చివరి నిమిషం దాకా నువ్వా నేనా అన్నట్లు సాగింది. అంతిమంగా శ్రీలంక.. పాక్‌ను పరుగు తేడాతో ఓడించి, అక్టోబర్ 15న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాక్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా, ఇవాళ ఉదయం జరిగిన తొలి సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై టీమిండియా 74 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్
మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా వుమెన్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 74 పరుగులతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ వుమెన్స్ భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగలిగింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో నరుమోల్ చవాయి 21, నట్టాయా బుచాతమ్ 21 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, జేమీమా రోడ్రిగ్స్ 27 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక వుమెన్స్, పాకిస్తాన్ వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో టీమిండియా వుమెన్స్ ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న(శనివారం) జరగనుంది. Women's Asia Cup: India beat Thailand by 74 runs in the first semifinal to enter the final. (Pic Source: BCCI Women) pic.twitter.com/VwWZl0gjkQ — ANI (@ANI) October 13, 2022 4⃣2⃣ Runs 1⃣ Wicket 1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍 Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX — BCCI Women (@BCCIWomen) October 13, 2022 -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
Womens Asia Cup T20 2022: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా పసికూన థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత భారత్ కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తిప్పేసిన స్పిన్నర్లు.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. స్పిన్నర్లు స్నేహ్ రాణా (3/9), రాజేశ్వరీ గైక్వాడ్ (2/8), దీప్తి శర్మ (2/10) మాయాజాలం చేయడంతో ప్రత్యర్ధి బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. థాయ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. వీరిలో బూచాథమ్ అనే బ్యాటర్ చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (8) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (20 నాటౌట్), వన్ డౌన్ బ్యాటర్ పూజా వస్త్రాకర్ (12 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ టేబుల్ టాపర్‌గా (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (పాక్ చేతిలో ఓటమి)) దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 13న జరుగనున్నాయి. సెమీస్ రేసులో తొలి మూడు బెర్తులు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. నాలుగో స్థానం కోసం బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
మిథాలీ ‘రాజ్యం’
సాక్షి క్రీడా విభాగం : ఎప్పుడో 1999లో కెరీర్లో తొలి వన్డేలోనే సెంచరీతో మెరుపులా దూసుకొచ్చింది మిథాలీ రాజ్... ఇప్పుడు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో తనదైన శైలిలో మరో సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ 17 ఏళ్ల కాలంలో మహిళా క్రికెట్లో ఒక తరం మారింది. తరాల మధ్య అంతరం కూడా చాలా ఉంది. ఫార్మాట్లు మారాయి, ప్లేయర్లు మారారు... కానీ మారనిది మిథాలీరాజ్ ఆట ఒక్కటే. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌విమన్‌గా ఖ్యాతిని సొంతం చేసుకుంది. కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆటపై ప్రేమతో అమెచ్యూర్ క్రికెటర్‌గానే తన ప్రతిభను ప్రదర్శించిన మిథాలీ... ఇప్పుడు టీవీ ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగిన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా తన ఆటను మరో స్థారుుకి తీసుకుపోయింది. ఈ రెండు తరాలకు వారధిగా నిలిచిన ఆమె అనేక ఘనతలను తన పేరిట లిఖించింది. అంకెలు, గణాంకాలపరంగా చూస్తూ ఆమెను కొందరు ‘మహిళా సచిన్’ అంటూ అభిమానంగా పిలుచుకున్నా... మిథాలీ రాజ్ మూలస్థంభంలా నిలబడి జట్టుకు అందించిన కొన్ని విజయాలు చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది. డబుల్ ధమాకా... హైదరాబాద్ నగరంలోనే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ రాజ్ ఆ తర్వాత వేర్వేరు వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించింది. నాడు బీసీసీఐ గుర్తింపునకు నోచుకోకుండా, భవిష్యత్తు అసలు ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఎవరికీ పట్టని మహిళా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అంటే పెద్ద సాహసమే. కానీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను తనకు ప్రియమైన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్ వైపు సాగేలా చేశారుు. అదే పట్టుదల ఆమెకు 15 ఏళ్ల వయసులో 1997 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు అందించింది. కానీ ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించిన టీమ్ మేనేజ్మెంట్ ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. దాంతో కాస్త మనసు విరిగినా... పట్టుదలతో ఆడి చివరకు శతకంతో తన రాకను ప్రపంచానికి చూపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ (214) మిథాలీ స్థాయిని అమాంతం పెంచేసింది. అప్పట్లో మహిళల టెస్టుల్లో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కెప్టెన్‌గా సూపర్... 2003 వచ్చేసరికి మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు ఉండని పరిస్థితి వచ్చేసింది. చివరకు సీనియర్ల నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకున్న అనుభవంతో 2005లో ఆమె తొలిసారిగా కెప్టెన్సీని అంగీకరించింది. అదే ఏడాది ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మిథాలీ... సెమీస్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 91 నాటౌట్ స్కోరు మహిళల క్రికెట్లోని అత్యుత్తమ ఇన్నింగ్సలలో ఒకటి. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో టీమిండియా ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీ టైటిల్సే కాకుండా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై వారి గడ్డపైనే గెలిచిన వన్డే సిరీస్ ఆమె కెరీర్లో మైలురాళ్లు. బీసీసీఐ మార్పు చేర్పుల్లో భాగంగా మధ్యలో కొంత కాలం మినహా గత దశాబ్ద కాలంలో మిథాలీనే భారత కెప్టెన్. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌పై వామ్స్లేలో కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ అందించిన చారిత్రక టెస్టు విజయం మిథాలీ కీర్తిని మెరో మెట్టు ఎక్కించింది. తిరుగులేని రికార్డు... వేర్వేరు కారణాలతో ఇన్నేళ్ల కెరీర్లో భారత్ చాలా తక్కువ టెస్టులు ఆడింది. దాంతో మిథాలీ కూడా 10 టెస్టులే ఆడినా, అందులోనూ ఆమె సగటు 51 కావడం విశేషం. టి20ల్లో కూడా మన బెస్ట్ బ్యాట్స్‌విమన్‌గా తనదైన ముద్ర చూపించిన మిథాలీ... వన్డేల్లో మాత్రం క్వీన్. 167 మ్యాచ్‌లలో 5,407 పరుగులతో టాప్ స్కోరర్ల జాబితాలో మిథాలీ ప్రపంచ క్రికెట్లో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ జాబితాలో అత్యధిక సగటు (49.60) ఆమెదే కావడం విశేషం. 5 సెంచరీలు, 40 అర్ధసెంచరీలతో ఆమె రికార్డు అద్భుతం. శనివారమే 34వ పుట్టిన రోజు జరుపుకున్న మిథాలీ పరుగుల తృష్ణ ఇంకా తగ్గలేదు. ఇదే ఫామ్‌తో ఆమె మరిన్ని ఘనతలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.


