Womens Asia Cup 2022 2nd Semi Final: Sri Lanka Beat Pakistan By 1 Run, Check Score Details - Sakshi
Sakshi News home page

Womens Asia Cup: పాక్‌ను మట్టికరిపించిన శ్రీలంక.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

Oct 13 2022 4:37 PM | Updated on Oct 13 2022 4:55 PM

Womens Asia Cup 2022 2nd Semi Final: Sri Lanka Beat Pakistan By 1 Run - Sakshi

మహిళల ఆసియా కప్‌-2022లో ఇవాళ (అక్టోబర్‌ 13) ఉత్కంఠ పోరు జరిగింది. పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌ చివరి నిమిషం దాకా నువ్వా నేనా అన్నట్లు సాగింది. అంతిమంగా శ్రీలంక.. పాక్‌ను పరుగు తేడాతో ఓడించి, అక్టోబర్‌ 15న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్‌ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

పాక్‌ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక​ బౌలర్‌ కులసూర్య అద్భుతంగా బౌలింగ్‌ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్‌ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా, ఇవాళ ఉదయం జరిగిన తొలి సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై టీమిండియా 74 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement