కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం | Sri Lanka Legend Kumar Sangakkara Loses Father And First Coach SK Sangakkara, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం

Mar 4 2026 1:24 PM | Updated on Mar 4 2026 2:53 PM

Kumar Sangakkara father passed away

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార్‌ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్‌కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్‌కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్‌ సర్కిల్స్‌తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎస్‌కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.  ఎస్‌కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.

కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడంలో ఎస్‌కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్‌కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్‌ కెరీర్‌ కోసం సమయం వెచ్చించే వారు.  ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement