Photo Credit: Twitter
మహిళల ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఓపెనర్ షెఫాలీ వర్మ (36 బంతుల్లో 64) అర్ధసెంచరీతో చెలరేగగా, డెబ్యూ బ్యాటర్ ప్రతీక రావల్ (22) ఆకట్టుకుంది.
భారత ఓపెనర్ స్మృతి మంధాన (19; 10 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. భారతీ 13 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5), దీప్తి శర్మ (5), రిచా ఘోష్ (0) నిరాశపర్చారు. చివర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్), శ్రీచరణి (6 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ 150 పరుగుల మార్క్‌ను దాటింది.థాయ్‌లాండ్ బౌలర్లలో సుప్లీపోర్న్ 3 వికెట్లు పడగొట్టింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది.


