టాస్ గెలిచిన థాయ్‌లాండ్‌.. ప్ర‌తీక రావ‌ల్ అరంగేట్రం | Women Asia Cup 2026: Thailand Won Toss-Choose Bowl-Vs India-W | Sakshi
Sakshi News home page

Asia Cup 2026: టాస్ గెలిచిన థాయ్‌లాండ్‌.. ప్ర‌తీక రావ‌ల్ అరంగేట్రం

Aug 30 2026 7:48 PM | Updated on Aug 30 2026 7:58 PM

Women Asia Cup 2026: Thailand Won Toss-Choose Bowl-Vs India-W

Photo Credit: BCCI Twitter

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో భాగంగా ఆదివారం భార‌త్‌, థాయ్‌లాండ్ త‌లప‌డుతున్నాయి. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భార‌త్ త‌ర‌ఫున ప్ర‌తీక్ రావ‌ల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సంద‌ర్భంగా కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్ర‌తీక రావ‌ల్ క్యాప్‌ను అందుకుంది. 

టాస్‌ అనంతరం హర్మన్‌ మాట్లాడుతూ.. ఒక‌వేళ తాము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్ల‌మ‌ని హ‌ర్మ‌న్ తెలిపింది. దుబాయ్‌లో త‌మ‌కు ఇదే తొలి మ్యాచ్ అని పేర్కొన్న హ‌ర్మ‌న్‌, మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని తెలిపింది. జెమీమా అందుబాటులో లేక‌పోవ‌డంతోనే ప్ర‌తీక రావ‌ల్‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ని హ‌ర్మ‌న్ తెలిపింది.

టీమిండియా ఉమెన్స్‌ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.

థాయ్‌లాండ్ వుమెన్‌ (ప్లేయింగ్ XI): అఫిసర సువాన్‌చోంరాతి, నట్టకాన్ చంతమ్, ఫన్నిత మాయ, నన్నపట్ కొంచరోయెంకై(వికెట్ కీప‌ర్‌), చనిదా సుత్తిరువాంగ్, నవోమి హామిల్టన్, సులీపోర్న్ లావోమి, నన్నఫట్ చైహాన్, సునిదా చతురోంగ్రత్తనా, తిపచ్చో పుత్థూవాంగ్ (కెప్టెన్‌), ఒన్నిచా కంచోంపు.

Read: లార్డ్స్‌లో పాక్ బౌల‌ర్ అరుదైన ఫీట్‌.. అక్ర‌మ్ వ‌ల్ల కాలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement